మంత్రితో తేల్చుకోడానికి సిద్ధ‌మైన సుగ‌వాసి!

అన్న‌మ‌య్య జిల్లా టీడీపీలో విభేదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాజంపేట టీడీపీ ఇన్‌చార్జ్ సుగ‌వాసి బాల‌సుబ్ర‌మ‌ణ్యం త‌న‌కు పార్టీలో అవ‌మానం జ‌రుగుతోంద‌ని ర‌గిలిపోతున్నారు. మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్‌రెడ్డిపై సుగ‌వాసి బ‌హిరంగంగానే తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.…

అన్న‌మ‌య్య జిల్లా టీడీపీలో విభేదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాజంపేట టీడీపీ ఇన్‌చార్జ్ సుగ‌వాసి బాల‌సుబ్ర‌మ‌ణ్యం త‌న‌కు పార్టీలో అవ‌మానం జ‌రుగుతోంద‌ని ర‌గిలిపోతున్నారు. మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్‌రెడ్డిపై సుగ‌వాసి బ‌హిరంగంగానే తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప‌నిలో ప‌నిగా ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డిపై ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించ‌డం గ‌మ‌నార్హం.

రాయ‌చోటి నుంచి రాంప్ర‌సాద్‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. సుగ‌వాసి కూడా సుదీర్ఘ కాలం పాటు రాయ‌చోటిలోనే రాజ‌కీయాలు చేశారు. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో సుగ‌వాసికి బ‌దులు రాంప్ర‌సాద్‌రెడ్డికి చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు. సుగ‌వాసికి రాజంపేట టికెట్ ఇచ్చారు. ఇంత‌టి గాలిలో కూడా రాజంపేట‌లో సుగ‌వాసి ఓడిపోయారు.

ఈ నేప‌థ్యంలో త‌న‌ను అణ‌చివేస్తున్నార‌ని సుగ‌వాసి ఫీల్ అవుతున్నారు. క‌నీసం త‌న కార్య‌క్ర‌మాల‌కు వెళ్లొద్ద‌ని అధికారుల్ని ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి ఆదేశించార‌ని సుగ‌వాసి బ‌హిరంగంగానే ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అలాగే మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి ఇసుక దోపిడీకి పాల్ప‌డుతూ ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తెస్తున్నార‌ని మండిప‌డ్డారు. చివ‌రికి అధికారుల బ‌దిలీల సిఫార్సు లేఖ‌లకు మంత్రి డ‌బ్బు తీసుకుంటున్న‌ట్టు సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేసినా ప్ర‌యోజ‌నం లేద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అన్న‌మ‌య్య జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌మోహ‌న్‌రాజుపై కూడా సుగ‌వాసి మండిప‌డ్డారు. సుండుప‌ల్లె మండ‌లం గుండుప‌ల్లెలో ఇది మంచి ప్ర‌భుత్వం అనే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తుంటే, ఎవ‌రూ వెళ్లొద్ద‌ని గ్రామ‌స్తుల‌ను జ‌గ‌న్‌మోహ‌న్‌రాజు ఆదేశించార‌ని, ఆయ‌న మాట‌ల్ని లెక్క చేయ‌కుండా వ‌చ్చారంటూ సుగ‌వాసి చెప్పుకొచ్చారు. వంద రోజుల పాల‌న పూర్త‌యిన నేప‌థ్యంలో టీడీపీలో అంత‌ర్గ‌త విభేదాలు బ‌ట్ట‌బ‌య‌ల‌వుతున్నాయి. మంత్రితో తేల్చుకోడానికి సుగ‌వాసి సిద్ధ‌మైన‌ట్టు ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు.

3 Replies to “మంత్రితో తేల్చుకోడానికి సిద్ధ‌మైన సుగ‌వాసి!”

  1. AP ప్రజలు చాలా ..తెలివైనొల్లు

    జగన్ లా విపరితమైన గర్వాన్ని మరియు అలసత్వాన్ని సహించరు ..

    పవన్ బాబు లా ఒవర్ యాక్షన్ పాలిటిక్స్ సహించరు ..

    తిరుమల లడ్డు విషయం CBIకొ.. SUPREM COURT JUDGE కొ ఇచ్చెయండీ

    State development పై ద్రుష్టి పెట్టండి ..మీ mp ల సంఖ్యా బలంతొ డిల్లి నుండి నిదులు తెండి

Comments are closed.