సీన్ రివ‌ర్స్ అవుతోంద‌ని.. ఫిర్యాదుకు ప‌రుగు పెట్టించిన స‌ర్కార్‌!

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం వ్య‌వ‌హారంలో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి హిందువుల్లో చెడ్డ పేరు సంగ‌తేమో గానీ, త‌మ‌ను అనుమానించే ప్ర‌మాదం ఏర్ప‌డింద‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది. నిజంగా నెయ్యిలో క‌ల్తీ జ‌రిగింద‌ని భావించిన‌ట్టైతే…

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం వ్య‌వ‌హారంలో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి హిందువుల్లో చెడ్డ పేరు సంగ‌తేమో గానీ, త‌మ‌ను అనుమానించే ప్ర‌మాదం ఏర్ప‌డింద‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది. నిజంగా నెయ్యిలో క‌ల్తీ జ‌రిగింద‌ని భావించిన‌ట్టైతే ఇంత వ‌ర‌కూ ఎందుకు కేసు న‌మోదు చేయ‌లేద‌నే ప్ర‌శ్న వెల్లువెత్తింది. దీంతో బాబు స‌ర్కార్ ఆగ‌మేఘాల‌పై టీటీడీ అధికారుల్ని అప్ర‌మ‌త్తం చేసింది.

క‌ల్తీ నెయ్యి స‌ర‌ఫ‌రా చేసిందని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న త‌మిళ‌నాడులోని దిండిగల్‌కు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌పై టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ విభాగం జీఎం పి.ముర‌ళీకృష్ణ బుధ‌వారం తిరుప‌తి ఈస్ట్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. నెయ్యిలో పంది, జంతు కొవ్వులు క‌లిసిన‌ట్టుగా గుజ‌రాత్‌లోని నేష‌న‌ల్ డెయిరీ డెవ‌ల‌ప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) కాఫ్ ల్యాబ్ నిర్ధారించిన‌ట్టు ఫిర్యాదులో పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

ఫిర్యాదులో డొల్ల‌త‌నం క‌నిపిస్తోంది. కేవ‌లం కొవ్వు ప‌దార్థాలు క‌లిసి ఉండే అవ‌కాశం లేక‌పోలేద‌ని స‌ద‌రు గుజ‌రాత్ సంస్థ అనుమానం వ్య‌క్తం చేస్తూ మాత్ర‌మే నివేదిక ఇచ్చింది. కానీ టీటీడీ మాత్రం ఏకంగా నిర్ధారించి ఏఆర్ డెయిరీపై ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఒక‌వేళ పాల‌లో పంది, జంతు కొవ్వులు క‌లిపి ఉంటే త‌ప్ప‌కుండా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే.

అయితే త‌మ ఆరోప‌ణ‌ల్ని నిజ‌మ‌ని న‌మ్మించ‌డానికి వేలాది మంది ఎంతో ప‌విత్రంగా భావించే తిరుమ‌ల ల‌డ్డూను క‌లుషితం చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. తిరుమ‌ల ల‌డ్డూను రాజ‌కీయంగా వాడుకోడానికి ప్ర‌భుత్వం అత్యుత్సాహం చూపుతుంద‌నేందుకు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు.

17 Replies to “సీన్ రివ‌ర్స్ అవుతోంద‌ని.. ఫిర్యాదుకు ప‌రుగు పెట్టించిన స‌ర్కార్‌!”

  1. “కేవ‌లం కొవ్వు ప‌దార్థాలు క‌లిసి ఉండే అవ‌కాశం లేక‌పోలేద‌ని స‌ద‌రు గుజ‌రాత్ సంస్థ అనుమానం వ్య‌క్తం చేస్తూ మాత్ర‌మే నివేదిక ఇచ్చింది. కానీ టీటీడీ మాత్రం ఏకంగా నిర్ధారించి”

    అంటే వేలకోట్లు పెట్టి గొప్పగా కట్టుకున్న laboratories అనేవి కేవలం అనుమానాలు వ్యక్తపరచడానికేనా? అంటే crimee investigationn లో కూడా forensicc పాత్ర కేవలం అనుమానాలు వ్యక్తం చేయబట్టే హత్యహ casex లు కూడా సిబిఐ తేల్చలేకపోతున్నదన్నమాట.

  2. ఏదైతేనేమి కెసు ఓపెన్ చేశారు కదారా ..

    మన జగన్ రెడ్డి లాగా.. బాబాయ్ హత్య కేసులో సిబిఐ ఇన్వెస్టిగేషన్ వద్దని పిటిషన్ వేసి తప్పించుకొనే ప్రయత్నం చేయలేదు కదా….

  3. ///గుజ‌రాత్ సంస్థ అనుమానం వ్య‌క్తం చేస్తూ///

    .

    రిపోర్ట్ కి ఒక పార్మట్ ఉంటుంది రా అయ్యా! నువ్వు పంది కొవ్వు lab కి పంపించినా suspected అనె ఇస్తారు!

    వాళ్ళు ఇచ్చిన S. Values చెపుతున్నాయి కదా!

  4. మరి అంతా కరొక్ట్ గా ఉంటె వాళ్ళు చెసిన 5 రకాల పరీక్షలలొ ఎందుకు పూర్తిగా fail అయ్యింది?

  5. మీరు చేసిన పాపాలలోనే పూర్తిగా మునిగి పోయారు GA… ఆ భగవంతుడు కూడా కాపడలేడు…

  6. TTD has issued notice to the firm in July and asked for explanation, they have replied in Sept. Upon review of their explanation which is unsatisfactory, TTD has filed police case. It is not like what you are c00king up.

  7. ప్యాలస్ పులకేశి గాడు అధికారము లో వున్నప్పుడు ఒక బెవ*ర్సు పని చేశాడు

    రాష్ట్రం లో నేరస్తుల చేతి వేలు ముద్రల కంప్యూటర్ లిని తన కుల*తోక బానిస పోలీసు అధికారుల చేత నాశనం చేశాడు. అలా అయితేనే తన ప్యాలస్ బ్రాండ్ గంజా*యి సరఫరా నేరస్తుల పట్టుపడకింత వుంటారు అని ప్లాన్ చేసాడు. అందులో ప్యా*లస్ పుల*కేశి గా*డి వేలు ముద్రల కూడా వున్నాయి అని అనుమానం.

  8. విశాఖ ప్రజలు కొంచెం ఎర్రి పువ్వులు, లోకేష్ మల్ల కాలీఫ్లవర్ పెడుతున్నాడు. భోగాపురం విమానాశ్రయం వస్తే వైజాగ్‌ని మారుస్తామని చెబుతున్నారు. వైజాగ్‌లో ఐటీ రంగం హైదరాబాద్‌తో సమానంగా 1% కూడా లేదు. ఐటీ వృద్ధి, ఫార్మా, ప్రైవేట్ రంగాల వృద్ధి లేకపోతే భోగాపురం విమానాశ్రయం వల్ల ఉపయోగం ఉండదు. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుకు వైసీపీ పార్టీయే కారణం. వైజాగ్ కోసం టీడీపీ ఏం చేయబోతోంది. ప్రజలు ఎదురు చూస్తున్నారు…మాకు గాలి కబుర్లు వద్దు

  9. కల్తీ నెయ్యిలో లేదు ఆవులో ఉందట .. మాజీ స్పీకర్ తమినేని

    కేసు క్లోస్డ్ .. తప్పు ఆవుది .. పాపం జగన్ ని అన్నారు అందరు .

Comments are closed.