వైసీపీ నేత‌లు ఇల్లు దాటొద్దంటున్న పోలీసులు

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుమ‌ల ప‌ర్య‌ట‌న ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇవాళ ఆయ‌న తిరుమ‌ల‌కు రానున్నారు. రేపు శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేసుకోనున్నారు. అయితే ద‌ర్శ‌నానికి వెళ్లాలంటే త‌ప్ప‌నిస‌రిగా డిక్ల‌రేష‌న్ ఫాంపై సంత‌కం చేయాల్సిందే అని…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుమ‌ల ప‌ర్య‌ట‌న ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇవాళ ఆయ‌న తిరుమ‌ల‌కు రానున్నారు. రేపు శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేసుకోనున్నారు. అయితే ద‌ర్శ‌నానికి వెళ్లాలంటే త‌ప్ప‌నిస‌రిగా డిక్ల‌రేష‌న్ ఫాంపై సంత‌కం చేయాల్సిందే అని కూట‌మి నేత‌లు అంటున్నారు.

అయితే ఆ అవ‌స‌రం లేద‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా రెండుసార్లు, అలాగే ముఖ్య‌మంత్రి హోదాలో ఐదు ద‌ఫాలు క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామిని జ‌గ‌న్ ద‌ర్శించుకున్నారు. అప్పుడెప్పుడు లేని సంత‌కం, ఇప్పుడెందుకని వైసీపీ నేత‌లు నిల‌దీస్తున్నారు. కేవ‌లం రాజ‌కీయ క‌క్ష‌తో మ‌త విద్వేషాల్ని కూట‌మి నేత‌లు రెచ్చ‌గొడుతున్నార‌ని వైసీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు.

అలిపిరి వ‌ద్దే జ‌గ‌న్‌ను అడ్డుకుంటామ‌ని కూట‌మి నేత‌లు హెచ్చ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కునడంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఉమ్మ‌డి చిత్తూరు, క‌డ‌ప‌, నెల్లూరు జిల్లాల్లోని వైసీపీ నాయ‌కులకు గ‌త రాత్రి నుంచి పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. ఇల్లు దాటి బ‌య‌టికి రావ‌ద్ద‌ని పోలీసులు హెచ్చ‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో పాల్గొని గొడ‌వల‌కు తెర‌లేపితే క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం వేధింపుల్లో భాగంగానే జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌ను వివాదాస్ప‌దం చేస్తోంద‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శించ‌డం గ‌మ‌నార్హం.

16 Replies to “వైసీపీ నేత‌లు ఇల్లు దాటొద్దంటున్న పోలీసులు”

  1. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ, ఉండి నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నాటి సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ అడ్డంగా బుక్కయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రఘురామను కొడుతూ వీడియోకాల్‌లో సీఐడీ బాస్‌కు చూపించామని, అప్పట్లో విధులు నిర్వహించిన సీఐ, ఎస్సై, సిబ్బందీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. తన సిబ్బందితో నేరుగా రఘురామను నిర్బంధించిన గదిలోకి వచ్చి దగ్గరుండి సునీల్‌ కొట్టించారని వారు తెలిపారు. ఈ కేసులో పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు సీఐడీ చీఫ్‌ సెల్‌ఫోన్‌ లొకేషన్‌ కూడా తీసుకున్నారు. దర్యాప్తును కొలిక్కి తెచ్చారు.

  2. ఎవడైనా మా తప్పులేదు, ఏ విచారణకైనా సిద్ధం అంటారు, వీళ్లేంటి అవి తప్పుడు ఆరోపణలు, విచారణ వద్దు అంటారు?

  3. ఒరే GA… వాడు కాలినొప్పి అనే కుంటి కారణం తో కాలినడక ప్రయాణాన్ని ఆల్రెడీ రద్దు చేసుకున్నడు రా అయ్యా ! అప్డేట్ అవ్వరా .

  4. ఒరే .. వాడు కాలినొప్పి అనే కుంటి కారణం తో కాలినడక ప్రయాణాన్ని ఆల్రెడీ రద్దు చేసుకున్నడు రా అయ్యా ! అప్డేట్ అవ్వరా .

  5. ఒరే GA… కాలినొప్పి అనే కుంటి కారణం తో కాలినడక ప్రయాణాన్ని ఆల్రెడీ రద్దు చేసుకున్నడు రా అయ్యా .. అప్డేట్ అవ్వరా

  6. వాడు కాలినొప్పి అనే కుం టి కారణం తో కాలినడక ప్రయాణాన్ని ఆల్రెడీ రద్దు చేసుకున్నడు రా అయ్యా ! అప్డేట్ అవ్వరా .

Comments are closed.