ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరికి త్వరలో ఆ పార్టీ అధిష్టానం ఉద్వాసనం పలకనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత ఏడాది జూలై మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికల కోసం పురందేశ్వరిని బీజేపీ అధిష్టానం అధ్యక్షురాలిని చేసింది. టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు కుదుర్చుకోవడంలో పురందేశ్వరి కీలక పాత్ర పోషించారు. బీజేపీ నాయకత్వ బాధ్యతలు పురందేశ్వరి చేతిలో లేకపోయి వుంటే, పొత్తు కుదిరేది కాదనే మాట వినిపించే సంగతి తెలిసిందే.
ప్రస్తుతం పురందేశ్వరి రాజమండ్రి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆమెను తప్పించి, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారని తెలిసింది. ఇప్పటికే కిరణ్‌తో బీజేపీ అధిష్టానం చర్చించి, ఒక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
అక్టోబర్‌లో పురందేశ్వరిని తప్పించొచ్చని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో టీడీపీ ఎదుగుదల కోసం మాత్రమే పురందేశ్వరి పని చేస్తున్నారని ఇప్పటికే ఆమెపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మరీ ముఖ్యంగా తన సామాజిక వర్గానికి మాత్రమే ఆమె ప్రాధాన్యం ఇస్తున్నారని పార్టీ నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.
ఇందుకు ఉదాహరణగా లంకా దినకర్‌కు నామినేటెడ్ పదవి ఇవ్వడాన్ని చూపారని తెలిసింది. కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని పురందేశ్వరి ఆశించినప్పటికీ, అధిష్టానం మాత్రం ఆమె వైపు మొగ్గు చూపలేదు. పురందేశ్వరిని బీజేపీ చీఫ్‌గా తప్పిస్తే, తమకు నష్టమని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
Neeku happy
Aamsbki kendram lo vunnatha padavi vachindami rrayavu kadaa
Call boy jobs available 9989793850
dunnapothu ki jagan ante entha ksi,dweshamo…
కిరణ్‌కుమారరెడ్డి అయితే మళ్ళీ తిరోగమనమే
అయితే ఇపుడు హై లో ఉంది అంటావ్
అంతే కదా..ఆ వర్గం లో ఈ వంశం అంతా ఇంతే..