గేమ్ ఛేంజర్ కు ఇంద్ర సినిమాతో లింక్

తాజాగా రిలీజైన ప్రోమోతో గేమ్ ఛేంజర్ పై మెల్లమెల్లగా అంచనాలు పెరుగుతున్నాయి. రేపు రిలీజ్ కాబోతున్న ఈ పాటకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు నిర్మాత దిల్ రాజు. రేపు రాబోతున్న మచ్చా..మచ్చా సాంగ్…

తాజాగా రిలీజైన ప్రోమోతో గేమ్ ఛేంజర్ పై మెల్లమెల్లగా అంచనాలు పెరుగుతున్నాయి. రేపు రిలీజ్ కాబోతున్న ఈ పాటకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు నిర్మాత దిల్ రాజు. రేపు రాబోతున్న మచ్చా..మచ్చా సాంగ్ కు చిరంజీవి ఇంద్ర సినిమాకు ఓ సంబంధం ఉంది.

అవును.. ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ లో వీణ స్టెప్ ఉంది. ఇంద్ర సినిమాలో చిరంజీవి వేసిన వీణ స్టెప్పును రామ్ చరణ్ రీ-క్రియేట్ చేశాడు. ఈ మేరకు చరణంలో వీణ స్టెప్పుకు సంబంధించి లిరిక్స్ యాడ్ చేశాడు అనంత్ శ్రీరామ్. ఈ సాంగ్ ను విశాఖ, అమృతసర్ లో తీశారు. ఇది హీరో ఇంట్రడక్షన్ సాంగ్.

ఇప్పటివరకు వీణ స్టెప్పును చాలామంది వేశారు. అయితే స్వయంగా చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఆ స్టెప్పును రీ-క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ లో ఆనందం రెట్టింపు అవుతుంది. అయితే రేపు రిలీజ్ కాబోతున్న లిరికల్ వీడియోలో ఆ బిట్ ను ఉంచుతారా లేక సినిమా రిలీజ్ అయ్యేంత వరకు సస్పెన్స్ లో పెడతారా అనేది క్లారిటీ ఇవ్వలేదు రాజు.

ఇక గేమ్ ఛేంజర్ కు సంబంధించి ప్రచార ప్రణాళికను కూడా బయటపెట్టాడు దిల్ రాజు. అక్టోబర్ ప్రారంభంలో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ చేస్తామని, అక్టోబర్ చివరి వారంలో మరో సాంగ్ ను విడుదల చేస్తామని తెలిపాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న గేమ్ ఛేంజర్ ను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామన్నాడు.

3 Replies to “గేమ్ ఛేంజర్ కు ఇంద్ర సినిమాతో లింక్”

Comments are closed.