అభిమానులకు బాలకృష్ణ ‘రిటర్న్ గిఫ్ట్’

చెంప దెబ్బలకు ఫేమస్ బాలయ్య. అభిమానులపై చేయి చేసుకోవడం అతడి స్టయిల్. ఫ్యాన్స్ కూడా బాలయ్యతో కొట్టించుకోవడాన్ని గర్వంగా ఫీలవుతుంటారు. తన చెంపదెబ్బలపై ఇప్పటికే ఓసారి స్పందించారు బాలయ్య. తనతో కొట్టించుకోవడం ఫ్యాన్స్ కు…

చెంప దెబ్బలకు ఫేమస్ బాలయ్య. అభిమానులపై చేయి చేసుకోవడం అతడి స్టయిల్. ఫ్యాన్స్ కూడా బాలయ్యతో కొట్టించుకోవడాన్ని గర్వంగా ఫీలవుతుంటారు. తన చెంపదెబ్బలపై ఇప్పటికే ఓసారి స్పందించారు బాలయ్య. తనతో కొట్టించుకోవడం ఫ్యాన్స్ కు ఇష్టమంటూ తనకుతానుగా ప్రకటించుకున్నారు.

ఇప్పుడు మరోసారి తన “చేతివాటం”పై ఆయన స్పందించాడు. ఓ అవార్డ్ ఫంక్షన్ లో కరణ్ జోహార్ తో చిట్ చాట్ చేశాడు బాలయ్య. ‘అందరూ మిమ్మల్ని చూసి ఎందుకు భయపడతారు’ అనేది కరణ్ జోహార్ ప్రశ్న. దీనికి బాలయ్య తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.

అభిమానులంతా తనను ప్రేమిస్తారని, అయితే కొన్ని సార్లు చిరాకు పెడుతుంటారని, అలాంటి సందర్భాల్లో వాళ్లకు రిటర్న్ గిఫ్ట్ దక్కుతుందని చమత్కరించారు. ఇక్కడ బాలకృష్ణ చెప్పిన రిటర్న్ గిఫ్ట్ కు అర్థం చెంప దెబ్బ. ఇలా తను చెంపదెబ్బలకు బ్రాండ్ అంబాసిడర్ అనే విషయాన్ని బాలకృష్ణ అంగీకరించారు.

జై బాలయ్య అనే నినాదాన్ని మొదటిసారి ఎప్పుడు విన్నారనే ప్రశ్నకు కాస్త ఓవర్ గా సమాధానమిచ్చారు బాలయ్య. పురాణాల్లో అభిమన్యుడి టైపులో, తను తల్లి గర్భంలో ఉన్నప్పుడే జై బాలయ్య నినాదాన్ని విన్నానని చెప్పుకొచ్చారు. ఇక తన కాంపిటిటర్స్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జునపై స్పందిస్తూ.. వాళ్లంతా లెజెండ్స్ అంటూ కితాబిచ్చారు.

7 Replies to “అభిమానులకు బాలకృష్ణ ‘రిటర్న్ గిఫ్ట్’”

  1. ఎప్పుడో త్రేతా యుగం లో ఆ రాముడి పాద ధూళి తాకి రాయి ఆడదిగా మారినట్టు.. ఈ దిక్కుమాలిన యుగం లో ఫాన్స్ కూడా ఆ పాద ధూళి కోసం బాగా తన్నించుకొని దూల తీర్చుకుంటే ఇంకా ఉత్తమం…

Comments are closed.