సమంతాకు ఇంకా ఎన్నాళ్లీ బాధలు..!

విడాకులు ఎవ్వరూ కోరుకోరు. దురదృష్టంకొద్దీ కొంతమంది ఆ దశను చూస్తారు. సెలబ్రిటీలకు ఇది మరింత బాధాకరం. ఎందుకంటే మీడియా అంతా అటువైపు చూస్తుంది. అయితే కొన్నాళ్లకు అంతా మరిచిపోతారు. ఎవరి జీవితాలు వాళ్లు బతికేస్తారు.…

విడాకులు ఎవ్వరూ కోరుకోరు. దురదృష్టంకొద్దీ కొంతమంది ఆ దశను చూస్తారు. సెలబ్రిటీలకు ఇది మరింత బాధాకరం. ఎందుకంటే మీడియా అంతా అటువైపు చూస్తుంది. అయితే కొన్నాళ్లకు అంతా మరిచిపోతారు. ఎవరి జీవితాలు వాళ్లు బతికేస్తారు.

సమంత కూడా అలానే అనుకుంది. చాన్నాళ్ల పాటు ఓపిగ్గా ఎదురుచూసింది. కానీ ఆమె విడాకుల వ్యవహారం మీడియాకు ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. మినిమం గ్యాప్స్ లో ఎప్పటికప్పుడు ఆమెకు ఆ చేదు జ్ఞాపకాన్ని గుర్తుచేస్తూనే ఉంది. జరుగుతున్న ఘటనలు అలా ఉన్నాయి మరి.

నాగచైతన్య ప్రేమలో పడ్డాడంటూ గతంలో పుకార్లు వచ్చాయి. ఆ టైమ్ లో సమంతతో విడాకులు మళ్లీ తెరపైకొచ్చాయి. ఇక హీరోయిన్ శోభితాతో అతడు ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. ఆ తర్వాత వేణుస్వామి నోరు పారేసుకున్నాడు. ఇలా ప్రతి సందర్భంలో ఆ ఎఫెక్ట్ సమంతపై పడింది.

ఇది చాలదన్నట్టు తాజాగా రాజకీయ నాయకులు కూడా సమంత గురించి మాట్లాడ్డం మొదలుపెట్టారు. ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఉండదేమో.

సమంత-చై విడిపోయి మూడేళ్లు అవుతోంది. ఇన్నేళ్లయినా వీళ్లి విడాకుల వ్యవహారం మినిమం గ్యాప్స్ లో ఇలా తెరపైకి వస్తూనే ఉంది. జీవితంలో జరిగిన బాధాకరమైన ఘటన గుర్తొచ్చిన ప్రతిసారి ఎవరికైనా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆ ఇబ్బందిని ఎప్పటికప్పుడు చవిచూస్తూనే ఉంది సమంత.

త్వరలోనే నాగచైతన్య-శోభిత పెళ్లి చేసుకుంటారు. అప్పుడు మరోసారి విడాకుల అంశం కచ్చితంగా తెరపైకొస్తుంది. సమంతాకు ఈ విడాకుల బాధలు ఇంకొన్నాళ్లు తప్పవు.

20 Replies to “సమంతాకు ఇంకా ఎన్నాళ్లీ బాధలు..!”

  1. సమంత విడాకులకు కారణమైన డ్రామా రావు గాడు ఫోన్ టాప్ చేసి ఫార్మ్ హౌస్ లో సమంత ని ఏమి చేసాడో చెప్పాలి , తప్పు ఒప్పుకుని తగిన శిక్ష డ్రామా రావు కి పడితేనే సమంత కి ఉపశమనం

    1. కడుపుకు కూడె తింటున్నావా ఏదిపడితే అది వాగుతున్నావు. పెంట గాని తినటం లేదుకదా? నాకు అనుమానమే

    2. కడుపు కు కూడె తింటు న్నావా ఏది పడితే అది వాగు తున్నావు. పెంట గాని తినటం లేదుకదా ? నాకు అనుమానమే

Comments are closed.