సుప్రీం మొట్టికాయ‌లేసినా… బాబు మార‌రా?

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై సుప్రీంకోర్టు మొట్టికాయ‌లు వేసినా, ఆయ‌నలో మాత్రం మార్పు క‌నిపించ‌డం లేదు. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంపై చంద్ర‌బాబు విషం చిమ్ముతూనే ఉన్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు ల‌డ్డూ ప్ర‌సాదంపై…

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై సుప్రీంకోర్టు మొట్టికాయ‌లు వేసినా, ఆయ‌నలో మాత్రం మార్పు క‌నిపించ‌డం లేదు. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంపై చంద్ర‌బాబు విషం చిమ్ముతూనే ఉన్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు ల‌డ్డూ ప్ర‌సాదంపై ఇంకా ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల వ‌ద్ద కామెంట్స్ చేస్తున్న‌ట్టు, ఆయ‌న అనుకూల ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు రావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌నే చంద్ర‌బాబు ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ నిమిత్తం సీబీఐ నేతృత్వంలో సుప్రీంకోర్టు సిట్ వేసింది. ఇక‌పై ఎవ‌రూ బ‌హిరంగంగా రాజ‌కీయ కామెంట్స్ చేయొద్ద‌ని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ ఏపీ రాజ‌కీయ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు.

తాజాగా చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రులకు ల‌డ్డూ ప్ర‌సాదాలు చంద్ర‌బాబు అంద‌జేసి, ఇవి స్వ‌చ్ఛ‌మైన నెయ్యితో త‌యారు చేసిన‌ట్టు చెప్పార‌ని ఆయ‌న అనుకూల మీడియాలో ప్ర‌చురించారు. ల‌డ్డూ ప్ర‌సాదంపై విమ‌ర్శ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ప్ర‌ధాని ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన‌ట్టుగా ఒక ప‌త్రిక‌లో రాయ‌డం గ‌మ‌నార్హం.

చంద్ర‌బాబునాయుడు బ‌హిరంగంగా మాట్లాడ‌కుండానే, ఆయ‌న అన్న‌ట్టుగా రాయ‌డం గ‌మ‌నార్హం. ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ అయ్యింద‌నే త‌న ఆరోప‌ణ‌లకు బ‌లం క‌లిగించేందుకు అన్న‌ట్టు, బాబు కామెంట్స్ చేస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ ఆరోప‌ణ‌ల‌పై నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు ద‌ర్యాప్తు క‌మిటీని వేసింద‌ని తెలిసిన‌ప్ప‌టికీ, మ‌ళ్లీమ‌ళ్లీ అవే ఆరోప‌ణ‌లు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

37 Replies to “సుప్రీం మొట్టికాయ‌లేసినా… బాబు మార‌రా?”

    1. avunu correct…anduke siggulekunda 12 CBI 8 ED casulu meeda unnai. Desham lo evadiki aa record ledu. Chettam ni addam pettukoni kodi katti case lo oka dalitudini 5 ellu jail lo unchaadu , chetta vedhava…Chettam lo losugulu addupettukoni 11 elluga bail meeda 3000+ vaidaalu …abbo aa record inka evariki sadyam kaadu

          1. Now visionary government is creating liquor syndicates resulting in thousands of crores of loss for government which means for public. This is visionary way of wealth creation for their supporters. The unfortunate part here is that differences arised in splitting this looted money causing even yellow channels to bringing up this day light looting.

  1. స్వచ్ఛమైన నెయ్య వడమూ అంటే .. నీకు ఎందుకు స్వామి ఉలికి పటు .. అది రాజకీయ విమర్శకాదు కదా .. .

  2. “తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంపై చంద్ర‌బాబు విషం చిమ్ముతూనే ఉన్నారు”..why YCP still thinks same strategy used to come to power in 2019 and while in power will work after 2024 also….lol

  3. సనాతన పరిరక్షకుడా.. నీవు ఎక్కడ.. లడ్డు విషయంలో తాత కూడా పగలబడి నవ్వాడట.. అంటే తక్కువ చేసి చూసాడని అర్థం.. ప్రాయశ్చిత్తం దీక్ష చేద్దాం రావయ్యా

  4. దొం గ ని దొం గే అంటే తడుముకుంటున్నారు కదరా .. నెయ్యి లో కల్తీ జరగకపోతే ఎందుకు అంత భయం

Comments are closed.