హర్యానా హ్యాట్రిక్: మాయ చేశారా? మంత్రం వేశారా?

సాధారణంగా మాయ చేసి గెలవడం అంటే ప్రతి సందర్భంలోనూ నెగిటివ్ అర్థంతో చూడాల్సిన అవసరం లేదు. జనాల్ని సమ్మోహితుల్ని చేసి, అనన్యమైన ప్రజాదరణ కూడగట్టుకుని గెలిచినా కూడా.. దానిని మాయచేశారనే అంటారు. కానీ.. ఇప్పుడున్న…

సాధారణంగా మాయ చేసి గెలవడం అంటే ప్రతి సందర్భంలోనూ నెగిటివ్ అర్థంతో చూడాల్సిన అవసరం లేదు. జనాల్ని సమ్మోహితుల్ని చేసి, అనన్యమైన ప్రజాదరణ కూడగట్టుకుని గెలిచినా కూడా.. దానిని మాయచేశారనే అంటారు. కానీ.. ఇప్పుడున్న సమాజంలో మాయ చేసి గెలవడం అంటేనే ఏదైనా మోసం చేసి గెలవడం అనే ఒకే ఒక అర్థం స్ఫురిస్తూ ఉంటుంది.

హర్యానాలో భారతీయ జనతాపార్టీ విపరీతమైన ప్రజావ్యతిరేకతను కూడా తట్టుకుని హ్యాట్రిక్ విజయం సాధించడం పట్ల ప్రజల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వారు మాయ చేశారా? మంత్రం వేశారా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రధానిగా నరేంద్రమోడీ హవా తగ్గిందనే మాట వాస్తవం. 2014, 2019లలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన బలం ఉండే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీని విజయంతో నడిపించిన ప్రధాని మోడీ హవా.. 2024 లో పనిచేయలేదు.

పాజిటివ్ అర్థంలో మనం తీసుకునే మాయ, మ్యాజిక్ అనే పదాలు 2024లో వర్కవుట్ కాలేదు. దాని ఫలితం ఏమిటి? చివరి నిమిషంలో కుదిరిన పొత్తులతో దగ్గరైన చంద్రబాబు నాయుడు వంటి నాయకుడు మీద ఆయన డిపెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు ఏం డిమాండ్ చేస్తే అది.. ప్రతిదానికీ తల ఊపవలసిన పరిస్థితి దాపురించింది. ఇలాంటి స్థితిలో.. ప్రధాని నరేంద్రమోడీ ఉన్నారు. ఆయన హవా పలచబడిన మాట ప్రజలందరికీ అర్థమవుతూనే ఉంది.

హర్యానా విషయానికి వస్తే అక్కడ బిజెపి గెలుస్తుందని ఒక్కటంటే.. ఒక్క సర్వే సంస్థ కూడా అంచనా వేయలేదు. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఏ సంస్థ కూడా.. తేడా అనేది మార్జిన్ లో ఉంటుందన్నట్టుగా కూడా తమ ఫలితాలు చెప్పలేదు. ఇండియా కూటమి అక్కడ కూడా ఘనవిజయం సాధిస్తారనే అనుకున్నారు. కానీ అనూహ్యంగా భాజపా హ్యాట్రిక్ కొట్లింది.

ఈ ఫలితాన్ని బట్టి మోడీ హవా ఈ వంద రోజుల్లో మళ్లీ పెరిగిందని బిజెపి టముకు వేసుకోవచ్చు గాక..! కానీ, హర్యానాలో కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న అంతర్గత కలహాలు కూడా వారి విజయానికి దారితీశాయని అనుకోవాలి. పైగా జమ్మూకాశ్మీర్ ను విడచిపెట్టి హర్యానాలో ఏదైనా తెరవెనుక మాయలకు బిజెపి పాల్పడిందా అనే అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయి. అయినా ఫలితాల తర్వాత, గతంలో ఉన్న ఎంతటి ప్రజావ్యతిరేకత అయినా కనుమరుగు అయిపోతుంది.

కానీ తమాషా ఏంటంటే.. జమ్మూకాశ్మీర్ లో కూడా భారతీయ జనతా పార్టీ 24 శాతం పైగా ఓట్లు సాధించింది. అక్కడ ఆ పార్టీ ఏకపక్షంగా అధికారంలోకి వస్తుందనే ఊహ ఎవరికీ ఉండకపోవచ్చు. అయితే అన్ని పార్టీలు తలాకొన్ని సీట్లు పంచుకుంటే.. ఏదైనా మాయచేసి అధికారంలో భాగం కావొచ్చునని బిజెపి ఆశపడి ఉంటుంది. కానీ ఎన్సీ కాంగ్రెస్ ల జోడీ రూపంలో ఇండియా కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించడంతో అక్కడ బిజెపి వారి పాచికలు పారలేదు.

10 Replies to “హర్యానా హ్యాట్రిక్: మాయ చేశారా? మంత్రం వేశారా?”

  1. కాశ్మిర్ లో బీజేపీ పాచిక లు పారలేదు అని ఏదేదో రాసారు. ఎంత గొప్ప సీఎం అయినా హైదరాబాద్ పాత బస్తీ పార్లమెంట్ సీట్ గెలిచారా 1984 నుంచీ? గెలవలేదు కదా, అలాంటప్పుడు పూర్తి ముస్లిం మయం అయిన కాశ్మిర్ లో బీజేపీ ఎలా గెలుస్తుంది, ఎంత గొప్ప అభివృద్ధి చేసినా

  2. మాయలు మంత్రాలూ, మోడీ గారి మేజిక్ అని ఏదేదో రాసారు. మొదటి, రెండో సారి మోడీ గారి మేజిక్ తోనే హర్యానా లోకి అధికారం లోకి వచ్చినా ఈసారి అక్కడి ముఖ్యమంత్రి, RSS కష్టపడి పని చెయ్యడం వల్ల విజయం సాధించారు.

  3. పెద్ద నాయకుల హవా అనేది ఎప్పుడూ ఉంటుంది, 2018 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓడిపోయింది, మళ్ళీ లోకసభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలలో గెలిచింది. కొన్ని సార్లు స్థానిక పరిస్థితులు అనుకూలించవు, అంతే!

  4. మిగిలిన పార్టీలు గెలిస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు. బీజేపీ గెలిస్తే మాయలూ మంత్రాలు.

    సర్వే సంస్థలు చెప్పిందే వేదవాక్కు. అవి చెప్పినట్లు జరగకపోవటం నిజంగా మాయలూ మంత్రాలే . లోగడ చత్తీస్‍ఘడ్ మధ్యప్రదేశ్ లలో బీజేపీ బొక్కబోర్లా పడుతుందని అన్ని సర్వే సంస్థలూ ఎలుగెత్తి చాటాయి. బీజేపీ మాయలూ మంత్రాలు చేసి 2/3 మెజారిటీ సాధించింది అని అప్పుడే రుజువు అయిపోయింది. ఇప్పుడు హర్యానాలో కూడా అంతే అంతే

    నరేంద్రమోడీ దేశంలో ఏ మూలకెళ్ళినా జనం రోడ్ షో లకు పోటెత్తటం. పడిపోతున్న మోడీ ప్రతిష్టకు పెద్ద తార్కాణం.

    400 సీట్లు మోడీకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని సాక్షాత్తు ఒక రాష్ట్రముఖ్యమంత్రి మార్ఫ్ చేసిన వీడియోతో ప్రచారం చేసి ప్రజాస్వామ్యబద్దంగా దెబ్బతీయటం మాత్రం ధర్మ సమ్మతం

Comments are closed.