నాగార్జున కోర్టుకెళితే… మేమెందుకు స్పందించాలి?

తెలంగాణ‌లో మంత్రి కొండా సురేఖ ఇటీవ‌ల అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన కామెంట్స్ తీవ్ర వివాదం రేకెత్తించాయి. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ త‌న‌ను సోష‌ల్ మీడియాలో అస‌భ్యంగా ప్ర‌చారం చేస్తున్నారంటూ…

తెలంగాణ‌లో మంత్రి కొండా సురేఖ ఇటీవ‌ల అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన కామెంట్స్ తీవ్ర వివాదం రేకెత్తించాయి. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ త‌న‌ను సోష‌ల్ మీడియాలో అస‌భ్యంగా ప్ర‌చారం చేస్తున్నారంటూ కొండా సురేఖ ర‌గిలిపోయారు. ఈ నేప‌థ్యంలో కొండా సురేఖ ఆవేశానికి లోనై అక్కినేని, స‌మంత‌ల‌పై అభ్యంతకర వ్యాఖ్య‌లు చేశారు.

స‌మంత‌, కేటీఆర్‌కు ముడిపెట్టి, అక్కినేని నాగార్జున‌ను కొండా సురేఖ బ‌జార్ను ప‌డేశారు. నాగ‌చైత‌న్య‌, స‌మంత మ‌ధ్య విడాకుల‌కు కేటీఆరే కార‌ణ‌మ‌ని ఆమె చేసిన తీవ్ర దుమారం రేపాయి. అయితే స‌మంత‌పై చేసిన కామెంట్స్‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు సురేఖ ప్ర‌క‌టించారు. దీంతో వివాదానికి ముగింపు ప‌ల‌కాల‌ని తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్‌కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

అయితే త‌నపై చేసిన కామెంట్స్‌ను వెన‌క్కి తీసుకోక‌పోవ‌డాన్ని నాగార్జున కుటుంబం సీరియ‌స్‌గా తీసుకుంది. తిరుప‌తిలో ఆయ‌న బుధ‌వారం మీడియాతో మాట్లాడుతూ అక్కినేని నాగార్జున కోర్టుకెళితే తామెందుకు స్పందించాల‌ని ప్ర‌శ్నించారు. అది నాగార్జున వ్య‌క్తిగ‌త అంశ‌మ‌న్నారు. తాము జోక్యం చేసుకునేది లేద‌న్నారు.

కొండా సురేఖ త‌న కామెంట్స్‌ను వెన‌క్కి తీసుకున్నార‌ని ఆయ‌న గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే స‌మంత‌పై కామెంట్స్‌ను మాత్ర‌మే సురేఖ వెనక్కి తీసుకోవ‌డంతోనే నాగార్జున కోర్టును ఆశ్ర‌యించార‌నే సంగ‌తిని మ‌హేశ్‌కుమార్ గౌడ్ మ‌రిచిపోవ‌డం గ‌మ‌నార్హం.

6 Replies to “నాగార్జున కోర్టుకెళితే… మేమెందుకు స్పందించాలి?”

  1. Just Akkineni Family kuda sorry chepithe saripoyedi. Reventh clear ga Nagarjuna ni target chesadu.

    vallaku in the past godavalu unnayemo because both are in real estate big time

  2. అసలు ఈ విసహాయం లో నాగార్జునకి సంబంధమే లేదు , అసలు దొం!గ డ్రామా రావు గాడు తప్పించుకు తిరుగుతున్నాడు ఎదవ తెలివితేటలు ఎక్కువ ముక్కోడి కుటుంబానికి , జగన్ రెడ్డి కి

  3. మొదట పరువు ఉండేది అని నిరూపించాలి, పోయింది అని కే సు పెట్ట డానికి పాత కోడలిని వేదించారు అనే కే సు కి కొత్త కోడలు వాంగ్మూలం ఎందుకో?

Comments are closed.