జ‌గ‌న్ అపాయింట్‌మెంట్… ఓ క‌లే!

ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాజీ ముఖ్య‌మంత్రి. అధికార బాధ్య‌త‌లేవీ లేవు. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టార‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్‌ను క‌ల‌వాలంటే… సొంత పార్టీ నాయ‌కుల‌కు ఒక క‌ల‌గా మిగులుతోంది. జ‌గ‌న్…

ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాజీ ముఖ్య‌మంత్రి. అధికార బాధ్య‌త‌లేవీ లేవు. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టార‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్‌ను క‌ల‌వాలంటే… సొంత పార్టీ నాయ‌కుల‌కు ఒక క‌ల‌గా మిగులుతోంది. జ‌గ‌న్ అపాయింట్‌మెంట్స్ ఇవ్వ‌డం లేదో, లేక ఆ వ్య‌వ‌హారాలు చూసుకునే వాళ్ల స‌మ‌న్వ‌య లోప‌మో తెలియ‌దు. చివ‌రికి ప‌ది మంది ఎమ్మెల్యేలు, న‌లుగురు లోక్‌స‌భ‌, 8 మంది రాజ్య‌స‌భ స‌భ్యులు, అలాగే ఎమ్మెల్సీలు సైతం జ‌గ‌న్‌ను క‌ల‌వాల‌ని అనుకుంటుంటే సాధ్యం కావ‌డం లేద‌నే మాట వినిపిస్తోంది.

పెద్దిరెడ్డి కుటుంబం, విజ‌య‌సాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి త‌దిత‌ర ముఖ్య నేత‌లు మిన‌హాయిస్తే, జ‌గ‌న్‌ను ఇటీవ‌ల కాలంలో కొత్త‌గా క‌లిసిన వాళ్ల పేర్లు చెప్ప‌మంటే, త‌డుముకోవాల్సిన ప‌రిస్థితి. ఇక బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల వైసీపీ నాయ‌కులు జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డం అసాధ్య‌మ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఓడిపోయినా, ఇంకా జ‌గ‌న్ ఎవర్నీ క‌ల‌వ‌క‌పోవ‌డం ఏంట‌నే ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. కేవ‌లం ఎన్నిక‌ల స‌మ‌యంలో కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు అని వ‌స్తే వాళ్లెందుకు ప‌ట్టించుకుంటార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. జ‌గ‌న్‌ను క‌లిసే మార్గం ఏంటో వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తెలియ‌క తీవ్ర నిరాశ చెందుతున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీరు ఏంటో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు.

ఓడిపోయాక కూడా ఎవ‌ర్నీ క‌ల‌వ‌కుండా ఏం చేస్తున్నార‌నే ప్ర‌శ్న‌కు స‌మాధానం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు ఒక నియోజ‌క‌వ‌ర్గంలో కూట‌మి నాయ‌కుల దాడికి గురై న‌ష్ట‌పోయిన బాధితులున్నార‌ని అనుకుందాం. జ‌గ‌న్ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేసిన తాము కూట‌మి చేతిలో దెబ్బ‌లు తిన్న‌ప్ప‌టికీ, ఒకే ఒక్క‌సారి ఆయ‌న్ను క‌లుసుకోవాల‌ని కోరుకుంటున్నారు. త‌మ ప్రాంతంలో ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వైసీపీ నాయ‌కుడి ద్వారా జ‌గ‌న్‌ను క‌ల‌వాల‌నేది వారి కోరిక‌. స‌ద‌రు వైసీపీ నాయ‌కుడు జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ కోరితే… నెల‌లు గ‌డుస్తున్నా ఆయ‌న గారి ద‌ర్శ‌న భాగ్యం లేద‌ని ఎంతో మంది ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

దీంతో న‌ష్ట‌పోయిన గ్రామ‌, మండ‌ల‌స్థాయి నాయ‌కులు, అలాగే వారి అనుచ‌రులు తీవ్ర ఆవేద‌న‌, ఆగ్ర‌హానికి గురి అవుతున్నారు. ఇక తాము ఎవ‌రి కోసం, ఎందుకోసం ప‌ని చేయాల‌నే నిస్పృహ‌లోకి జారుకుంటున్నారు. 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోని వైసీపీ నాయ‌కుల‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చే ప‌రిస్థితి… ఇంత‌టి ద‌య‌నీయ స్థితిలోనూ లేక‌పోతే, ఇక జ‌గ‌న్ ఏం మారిన‌ట్టు? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

29 Replies to “జ‌గ‌న్ అపాయింట్‌మెంట్… ఓ క‌లే!”

  1. లండన్ పోనివ్వకుండా అడ్డుకున్నారు.మానసిక సమస్యల తో వాడు సతమతమవుతున్నాడు.బిళ్ళలు తెప్పించుకొనే మార్గం కనుపడట లేదు.అర్ధరాత్రి అయ్య తో మాట్లాడితే అంటే ఒకటే దేం.. గులు అట..!!

  2. పాపం..

    ఇక్కడ కామెంట్స్ రాసే “Raja” అనే PAYTM కూలి.. 2029 లో జగన్ రెడ్డి మళ్ళీ అధికారం లోకి వచ్చేస్తాడని ఎదురుచూస్తూ.. రోజూ కామెంట్స్ లో కథలు రాసుకొంటున్నాడు..

    అసలు విషయం ఏమిటంటే.. ఆ జగన్ రెడ్డి కి శవం కనపడితే గాని.. ఇల్లు కదలడు ..

    వైసీపీ సోషల్ మీడియా లో.. జగన్ రెడ్డి బెంగుళూరు నుండి వచ్చినప్పుడు.. బెంగుళూరు కి వెళ్ళినప్పుడు.. గన్నవరం ఎయిర్పోర్ట్ లో పులివెందుల సింహం అని రాసుకుని మురిసిపోతుంటారు ..

    ఎందుకో.. ఈ మధ్య రాయడం మానేశారు.. వాళ్లకి కూడా చిరాకు దొబ్బినట్లుంది..

    వైసీపీ లో చెట్టుకొకరు.. పుట్టకొకరు..

    ఈసారి కాంగ్రెస్ కి అయినా సీట్లు వస్తాయేమో గాని.. వైసీపీ కి మాత్రం ఒక్క సీటు కూడా రాదు..

    1. ఒక్క సీటు కూడా రాని వారి గురించి మీరు ఎందుకు టైం waste చేసుకుంటారు బ్రదర్

      అదే వారికి పెద్ద శిక్ష

      1. ఆల్రెడీ ఒక నీలి బకరా పేరు రాసాను కదా.. అలాంటి వాళ్ళ నీలి కళ్ళు తెరిపించడానికి..

        1. వాడు మనం అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పలేక బ్లాక్ చేసుకున్నాడు

  3. బెంగుళూరు బంకర్ లో దాక్కుని, కేవలం కళ్ళుమూసుకుంటే చాలు 5 ఏళ్ళు అలా అలా గడిచి, చంద్రబాబు చేసే తప్పులతో 175/175 కొట్టి, అధికారం లోకి వస్తాం ఇంతోటి దానికి నాయకులు అండ్ కార్యకర్తలు ఎందుకురా “గుడ్డి ఆంధ్రా”??

    జై జై పంగనామాల బంకర్ రెడ్డీ

    1. ఇలా 175 అనే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారో తెలుసు కదా బ్రదర్

      వేరే నెంబర్ చెప్పండి

  4. మొగాడు వినాశం యొక్క లోచె*డ్డి లు ఇస్త్రీ చేసుకుంటూ బిజీ గా వున్నాడు మా*డా. పాపం పిల్లాడిని రెస్ట్ తీసుకొనివ్వండి.

    1. రోజు వినాశం బట్టలు ఇస్త్రీ చేసి, పక్క దులిపి ఇల్లు నీీట్ గా గుడ్డ తో మాపు చేస్తే కానీ ప్యాలస్ పులకేశి కి సత్తు కంచం లో చద్ది బువ్వ పడదు అంట కదా.

      ఇవన్నీ బయటకి కానిపించ కుండా వుండటానికి తాడిచెట్టు యెత్తు ఇనుప కంచె, 900 మంది ప్రైవేటు సెక్యూరిటీ.

      ఇంకా ఇంట్లోకి బయట వాళ్ళని యెందుకు రానిస్తాడు ?

  5. మార్చ్ వరకు ఆగండి బతికితే మిమ్మల్ని పొతే అంతకి ముందే మీ శవాన్ని చూడడానికి వస్తారు…. ఘాటు గా ఉన్నా ఇదే నిజం

  6. Jagan అన్న సింగ్లె సిమ్హం! కార్యకర్థలు, నాయకులు, గెలిచిన MLA లు MP లతొ పని లెదు.

    ఒక్కడి గా వస్తాడు, జనం ఎగిరి తంతె ఒక్కడిగానె వెళ్ళిపొతాడు.

    ఇక ఈ 5 ఎళ్ళు బంకర్ లొ పబ్జీ ఆడుకొని ఫ్రెష్ గా వస్తాడు!

  7. జగన్ ఫస్ట్ క్లాసు స్టూడెంట్. అప్పోయింట్మెంట్ ఇస్తే మిగితా నాయకులు అన్న స్పీడ్ ని తట్టుకోలేరు. అందుకే అప్పోయింట్మెంట్ ఇవ్వడం లేదు

  8. అవినీతి మరియు అసభ్య రాజకీయాలు: బోరుగడ్డ అనిల్ అరెస్టుతో ప్రజల సమాధానం స్పష్టమైంది

    బోరుగడ్డ అనిల్ ఈరోజు అరెస్టు కావడం, ప్రజలు జగన్‌కు గట్టి సమాధానం ఇచ్చినట్లే కనిపిస్తోంది. అనిల్ వంటి వ్యక్తుల వల్లే పార్టీకి ప్రతిష్టహాని కలుగుతోంది. ఆయన అసభ్యమైన, తిడుతూ మాట్లాడే భాష ప్రజల నమ్మకాన్ని దూరం చేస్తుంది. జగన్‌ను నిజంగా మద్దతు ఇస్తున్నారా? అయితే, బోరుగడ్డ అనిల్ లాంటి వారిని అనుసరించకండి. ఆయన ఏ స్థితికి చేరుకున్నాడో, జగన్ నాయకత్వం కూడా ఇలాంటి నెగటివ్ వ్యక్తుల వల్ల ఇబ్బందుల్లో పడుతోంది.

    రాజకీయాల్లో అసభ్యమైన భాషకు అవసరం ఏమిటి? సంస్కారం, మర్యాదతో మాట్లాడటం ప్రజల గౌరవాన్ని పొందేందుకు చాలా ముఖ్యమైనది. అనిల్ పరిస్థితి ప్రతి ఒక్కరికీ పాఠం కావాలి—అసభ్యమైన ప్రవర్తన, జలగట్టు భాష మనిషిని కేవలం కష్టాల్లోకి తీసుకెళ్లడం తప్ప, గౌరవం తీసుకురాదు.

Comments are closed.