ఏ రంగంలోనూ శాశ్వత పోటీ అన్నది వుండదు. టాలీవుడ్ లాంటి చోట్ల అస్సలు వుండదు, వుండకూడదు. అలా వుంటే ఇటు అటు నష్టపోవడం తప్ప సాధించేది వుండదు. టాలీవుడ్ సినిమాల నైజాం పంపిణీ రంగంలో ఇటీవల పోటీ నెలకొంది. కొన్నాళ్ల క్రితం వరకు దాదాపు పోటీ అన్నది లేకుండా వుండేది. నైజాంలో పంపిణీ రంగంలో వున్న సురేష్ బాబు, అసియన్ సునీల్, శిరీష్ రెడ్డి ఓ మాట మీద వుంటూ వచ్చారు. మధ్యలో ఒకరిద్దరు కొత్తగా ఈ రంగంలోకి వచ్చినా, వీరికి సరైన పోటీ ఇవ్వలేక రంగంలోంచి తప్పుకున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ఏడాది కాలంగా మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ రంగంలోకి దిగింది. ఈ సంస్ధ బలంగా నిలదొక్కుకుంది. ఇటీవల ఎడా పెడా సినిమాలు పంపిణీ చేస్తూ ఎగ్జిబిటర్లను దగ్గర చేసుకుంటోంది. ఇదే సమయంలో అసియన్ సునీల్, సురేష్ బాబులు కలిసి అసియన్ సురేష్ అనే సంస్థను స్టార్ట్ చేసారు. అ సంస్థ కూడా దూకుడు మీద వుంది. వరుసగా సినిమాలు హోల్ సేల్ గా కొనడం, పంపిణీ చేయడం చేస్తోంది. ఈ సంస్థలో అప్పుడప్పుడు తనకు నచ్చిన సినిమాలు వుంటే శిరీష్ కూడా జాయిన్ అవుతుంటారని టాక్ వుంది.
ఎప్పుడైతే రెండు.. మూడు పంపిణీ సంస్థలు నైజాంలో వచ్చాయో, అప్పుడు చిన్న, మిడ్ రేంజ్ సినిమాల నిర్మాతలకు కాస్త ఊపిరి వచ్చింది. సినిమాను పంపిణీకి ఇచ్చేందుకు అప్షన్ దొరికింది.
ఇలాంటి నేపథ్యంలో వున్నట్లుండి టాలీవుడ్ లో ఒక కొత్త గ్యాసిప్ వినిపిస్తోంది. శిరీష్ రెడ్డి, మైత్రీ సంస్థ కలిసి ఓ అండర్ స్టాండింగ్ కు వచ్చాయని, ఇకపై అక్కరలేని పోటీలకు దిగవని నిర్మాతల సర్కిల్ లో వినిపిస్తోంది. ఎవరి వ్యాపారాలు వారు చేసుకుంటారు. కానీ ఒకరికి ఒకరు సహకరించుకుంటారు.
శిరీష్ దగ్గర గేమ్ ఛేంజర్, ఎన్ బి కె 109 లాంటి సినిమాలు వున్నాయి. మైత్రీ దగ్గర పుష్ప 2 ఇంకా చాలా సినిమాలు వున్నాయి. అందువల్ల ఇకపై పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్లాలని ఇరు వర్గాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయమై శిరీష్ రెడ్డిని ప్రశ్నించగా, తమకు థియేటర్లు, సినిమాలు కావాలంటే వాళ్లు ఇస్తారని, వాళ్లకు కావాలంటే తాము ఇస్తామని, ఇందులో కలిసిపోవడం అంటూ ఏమీ లేదని, ఎవరి వ్యాపారం వారిది, ఎవరి పోటీ వారిది అని క్లారిటీ ఇచ్చారు.
So మొత్తానికి Dil Raju aka Dil Reddy Telangana లో నేనే కింగ్ అని విర్రవేగినోడు, Andhra Chowdary గారికి లొంగాడు అంటావు. వ్యాపారంలో ఉండవలసిన లక్షణం నమ్మకం. Dil Raju అది పోగొట్టుకున్నాడు Rajamouli తో games ఆడి. ఇంక అతన్ని ఎవరు నమ్ముతారు. కష్టపడాలి.
వాళ్లు కలిసినా మేం థియేటర్ లో చూడం