జ‌గ‌న్ దెబ్బ‌కు సాయం పెంచిన బాబు స‌ర్కార్‌

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దెబ్బ‌కు చంద్ర‌బాబు స‌ర్కార్ ఆర్థిక సాయం పెంచాల్సి వ‌చ్చింది. వైఎస్సార్ జిల్లా బ‌ద్వేల్‌లో విఘ్నేష్ అనే ప్రేమోన్మాది పెట్రోల్ పోసి ఇంట‌ర్ విద్యార్థిని త‌గుల‌బెట్టాడు. 80 శాతం శ‌రీరం…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దెబ్బ‌కు చంద్ర‌బాబు స‌ర్కార్ ఆర్థిక సాయం పెంచాల్సి వ‌చ్చింది. వైఎస్సార్ జిల్లా బ‌ద్వేల్‌లో విఘ్నేష్ అనే ప్రేమోన్మాది పెట్రోల్ పోసి ఇంట‌ర్ విద్యార్థిని త‌గుల‌బెట్టాడు. 80 శాతం శ‌రీరం కాలిపోయి క‌డ‌ప రిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో బాధిత విద్యార్థిని కుటుంబానికి రూ.ఐదు ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారాన్ని ప్ర‌భుత్వం ముందుగా ప్ర‌క‌టించింది. ఆ మేర‌కు బాధిత కుటుంబానికి ఇన్‌చార్జ్ క‌లెక్ట‌ర్ అదితిసింగ్‌, వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు ఆర్‌.శ్రీ‌నివాస్‌రెడ్డి త‌దిత‌రులు అంద‌జేశారు. మ‌రోవైపు గుంటూరులో దుండ‌గుడి దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డి మృతి చెందిన స‌హానా కుటుంబానికి మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ త‌న పార్టీ త‌ర‌పున రూ.10 ల‌క్ష‌ల సాయాన్ని ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వం కూడా పెద్ద మొత్తంలో ఆర్థిక భ‌రోసా ఇవ్వాల‌ని జ‌గ‌న్ డిమాండ్ చేశారు.

అలాగే బ‌ద్వేల్‌కు బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డానికి జ‌గ‌న్ వెళుతున్నార‌నే స‌మాచారంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అప్ర‌మ‌త్తం అయ్యారు. వెంట‌నే బాధిత కుటుంబ స‌భ్యుల‌తో ఆయ‌న ఫోన్‌లో మాట్లాడారు. మ‌రో రూ.5 ల‌క్ష‌ల సాయాన్ని పెంచి, జ‌గ‌న్ బ‌ద్వేల్ వెళ్లే లోపు అంద‌జేయ‌డం గ‌మ‌నార్హం.

బ‌ద్వేల్‌లో బాధిత కుటుంబ స‌భ్యుల్ని జ‌గ‌న్ ప‌రామ‌ర్శించిన అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ ఇదే విష‌యాన్ని చెప్పారు. తాను బ‌ద్వేల్ వ‌స్తున్నాన‌ని తెలియ‌డంతోనే చంద్ర‌బాబు స‌ర్కార్ స్పందించింద‌న్నారు.

22 Replies to “జ‌గ‌న్ దెబ్బ‌కు సాయం పెంచిన బాబు స‌ర్కార్‌”

  1. ఇంకెముంది చెప్పు…

    జగన్ దెబ్బకి అమరావతి కదుతున్న బాబు

    జగన్ దెబ్బకి పొలవరం కి నిదులు తెస్తున్న బాబు

    జగన్ దెబ్బకి TCS ని తెస్తున్న బాబు

    జగన్ దెబ్బకి అన్నా క్యంటీన్లు పెట్టిన బాబు

  2. కుల రాజకీయాలను వ్యతిరేకించిన ప్రజలు: కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చి వైసీపీకి గట్టి శిక్ష!”

    వైసీపీ మద్దతుదారులు రాజా, రంగనాధ్, రా మరియు ఇతరులు చూపిస్తున్న కుల విద్వేష రాజకీయాలను ప్రజలు గట్టిగా తిరస్కరించారు. కమ్మ, కాపు వంటి కులాలపై ఎప్పటికప్పుడు ద్వేషాన్ని రెచ్చగొట్టిన వైసీపీ నాయకత్వాన్ని ప్రజలు నిరాకరించారు. కుల ద్వేషం ప్రాతిపదికగా నడిపించిన ఈ రాజకీయాల కారణంగా, జగన్‌కు గట్టి బుద్ధి చెప్పి, కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు.

    రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాల్సిన నాయకత్వం కులపరమైన చిచ్చు పెట్టడంలో మునిగిపోయింది. కులాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా జగన్ పాలన ప్రజలకు ఎంత ప్రమాదకరంగా ఉందో గమనించారు. ఈ కుల విద్వేష రాజకీయాలను సహించలేని ప్రజలు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. జగన్ మద్దతుదారులుగా మీరంతా ఇంకా ఈ ద్వేష రాజకీయాన్ని నడిపిస్తారా? ప్రజలు ఇది సహించడంలేదని, 11 సీట్ల గట్టి సమాధానం ద్వారా స్పష్టం చేశారు.

    ఇక జగన్ నాయకత్వం విషయానికి వస్తే, ఆయన తన సొంత చెల్లి శర్మిలతో కాస్త ఆస్తి కోసం తగువేసుకుంటూ ఉండడం తప్ప, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేసినట్లు కనిపించదు. కుటుంబాన్ని సరిగా నడపలేని వాడు, రాష్ట్రాన్ని నడిపిస్తాడా? రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతున్నా, పాలవరం ప్రాజెక్టు స్తబ్దుగా ఉండిపోతున్నా, జగన్ పాలనలో పెద్దగా మార్పులు కనిపించలేదు.

    ఇదంతా కాకుండా, ముఖ్యంగా ప్రజలకు బాధ కలిగించినది జగనన్న మద్దతుదారులు చూపించిన కుల విద్వేషం. కమ్మ, కాపు వంటి కులాలపై జరిగిన కుల హింస ప్రజలను విభజించేలా చేసిందే తప్ప, అభివృద్ధిని రాబట్టలేదు. ప్రజలు ఈ కులపరమైన ద్వేషాన్ని గమనించి, జగన్‌కు గట్టి బుద్ధి చెప్పిన సందర్భమిది.

    ప్రజలకు కావలసినది వాగ్దానాలు కాదు, అభివృద్ధి కోసం పనిచేసే నాయకత్వం. కులాల మధ్య చిచ్చు పెట్టడం, కుటుంబ తగవులతో నిండిన పాలన కాస్తంత కూడా ప్రజలకు ఆమోదయోగ్యం కాకపోవడం ఖాయం.

  3. పెంచాల్సింది సాయం కాదు… బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. అది కదా అధికారం ఉన్నవారు చేయాల్సింది.

  4. ఈ GA ఇక, మా నాయకుడు పిత్తు వెసాడు… అందుకె సెంటు వాస్తన వస్తుంది… అని కూడా డప్పు వెస్తాడెమొ!

  5. అన్నియ ఒక్కొక్కరికి 50 ఇస్తే బాబు కూడా ఇచ్చేవాడు ఏమో…

    పవన్ సొంత డబ్బు నిన్న 11 లక్షలు ఇస్తే దాని గురించి వార్త లేదు గోసిగా

  6. జగన్ రెడ్డి లో ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్..?

    లోకేష్ ఢిల్లీ టూర్ మహత్యమా..? ఢిల్లీ లో అమిత్ షా ని కలిసిన కారణమా..? లేక..

    జగన్ రెడ్డి స్కాం లన్నింటికీ సాక్ష్యాలు “సిద్ధం” అవుతున్నాయనా..?

  7. ఎక్కువ ఎలివేషన్ ఇవ్వకండి అన్న ప్రతి పక్షం లో నే ఉండాలి అని జనాలు ఫిక్స్ అయితే మొదటి కే మోసం వస్తుంది

  8. జగన్ గారికి పథకం తీసుకొని అవ్వ్వాతాతలే కాదు తల్లి చెల్లి కూడా మోసం చేసి నట్టున్నారు అక్కడికి పాపం చెల్లికి 5 రూపాయల paytm వాడికి పడేసినట్టు ఎంతోకొంత ముట్టచెప్పిన విశ్వాసం లేకుండా దెబ్బలాడుతుంది ఎంతఅన్యాయం పాపం అది ఆయన కష్టపడ్డా సొమ్ము ఎంత వూళ్ళమ్మట తిరిగి ప్రచారం చేస్తేమాత్రం వాటాలు ఇచ్చేస్తారేమిటి paytm గాళ్ళలాగా ఇచ్చింది పట్టుకుపోవాలి

Comments are closed.