టాలీవుడ్ ను కలవరపడుతున్న సమస్య ఓటీటీ లేదా డిజిటల్ హక్కుల మార్కెట్. కొన్ని నెలల క్రితం వరకు సినిమాలకు అలంబన, అశ అదే. ఇప్పుడు కలవరపెడుతున్నదీ అదే. శాటిలైట్ నడిచినన్నాళ్లు నడిచింది. కానీ టాలీవుడ్ చేసిన పని ఒకటి వుంది. చాలా తెలివిగా చాలా మంది హీరోల శాటిలైట్ మార్కెట్ కు కృత్రిమ రేటును క్రియేట్ చేసారు.
తమ చాకచక్యం, తెలివితేటలు వాడి, కొంత మంది హీరోలకు శాటిలైట్ హక్కుల మార్కెట్ క్రియేట్ చేసి, తద్వారా సినిమాలు, రెమ్యూనిరేషన్ పెంచుకున్నారు. అలాగే కార్పొరేట్ సంస్థలు వున్నా కూడా, మనవాళ్లు మన తెలివితేటలు, లయజనింగ్ వాడి మరి కొంత సాధించారు. కానీ ఎల్లకాలం ఇలాంటి విద్యలు సాగవు కదా. పరిస్థితులు మారాయి ఓటీటీ వచ్చింది. శాటిలైట్ అన్ని విధాలా ఒకేసారి ఢమాల్ మంది.
ఇటు ఓటీటీకి, అటు శాటిలైట్ కు మధ్యలో హిందీ శాటిలైట్ లేదా హిందీ డబ్బింగ్ వచ్చింది. ఇక్కడ మంచి అదాయం కనిపించింది. ఎటొచ్చీ మాస్ ఫైట్లు వున్న సినిమాలకే ఇది ఎక్కువగా వర్కవుట్ అయింది. ఈ హిందీ అదాయం చూపించి, ఒక్క హిట్ కూడా ఇవ్వకుండానే కొందరు హీరోలు రన్నింగ్ లో సాగిపోయారు. కానీ ఓటీటీ వల్ల మన శాటిలైట్ మాత్రమే కాదు, హిందీ డబ్బింగ్ అదాయం కూడా దెబ్బతింది. ఇక మిగిలిన అశ అంతా డిజిటల్ అమ్మకాలు మాత్రమే. కానీ ఇప్పుడు అక్కడ కార్పొరేట్ కంపెనీలు, వాటి స్ట్రాటజీలు, విలీనాలు అన్నీ కలిసి ఒక్కసారిగా బ్రేక్ పడిపోయింది.
ఇప్పుడు డిజిటల్ అమ్మకాలు జరుగుతున్నాయి. కానీ నిర్మాతలు అనుకున్న రేట్లు రావడం లేదు. పైగా విడుదల డేట్ వాళ్లు ఇచ్చే స్లాట్ కు, మనకు థియేటర్ ఇన్ కమ్ వుండే సీజన్ కు, ఇంకా చాలా చాలా ఈక్వేషన్లు మ్యాచ్ కావడం లేదు. నిర్మాత అనుకున్న డేట్ కు సినిమా రావాలి అంటే డిజిటల్ కంపెనీలతో అగ్రిమెంట్లు మార్చాల్సి వస్తోంది. అంటే నాలుగు వారాలకు బదులు అరు వారాలు, లేదా ఎనిమిది వారాలు ఇలా అన్న మాట. దాని వల్ల డిజిటల్ మార్గంలో వచ్చే అదాయం పడిపోతోంది. పైగా కంపెనీలు కొనుగోళ్లు తగ్గించాయి. కొనే కంపెనీలు తగ్గిపోయాయి. అయితే అమెజాన్ లేదంటే నెట్ ఫ్లిక్స్ రెండే మిగిలాయి. చిన్న సినిమాలకు అహా అలంబనగా వుండేది. అదీ తగ్గింది. ఈటీవీ విన్ వచ్చింది. కానీ చాలా సెలెక్టివ్ గా వుంది.
ఇలా మొత్తం మీద, డిజిటల్ అమ్మకాల పరిస్థితి ఏమంత అశాజానకంగా లేదు. పైగా నిర్మాతలు తల పెట్టుకునేలా వుంది. కానీ త్వరలో ఈ పరిస్థితిలో మార్పు రాబోతోందని తెలుస్తోంది.
ప్రస్తుతం అమెఙాన్, నెట్ ఫ్లిక్స్ మాత్రమే యాక్టివ్ గా వున్నాయి. పైగా నెట్ ఫ్లిక్స్ కూడా ఒరిజినల్స్ మీద తన బడ్జెట్ ఎక్కువగా పెట్టబోతోంది. హాట్ స్టార్ విలీన ప్రక్రియలో వుంది. జీ 5 అంత ఎక్కువ తీసుకోవడం లేదు. అహా, ఈటీవీ విన్ చిన్న ప్లేయర్లు.
కానీ త్వరలో ఈ పరిస్థితి మారబోతోందని తెలుస్తోంది. అంబానీ రిలయన్స్ పూర్తిగా రంగంలోకి దిగిన తరువాత పరిస్థితి వేరుగా వుంటుంది. అమెజాన్ కు పోటీగా ఫ్లిప్ కార్ట్ కూడా రంగంలోకి వస్తోంది. వీడియో కంటెంట్ ద్వారానే అమెజాన్ తన రిటైల్ మార్కెట్ యాప్ ను బలోపేతం చేసుకుంది అని ఫ్లిప్ కార్ట్ భావిస్తోంది. అలాగే అదానీలు కూడా ఏదో ఒక సంస్థ ద్వారా ఈ మార్కెట్ లోకి వస్తారు అనే టాక్ వినిపిస్తోంది. జీ5 లోకి కార్పొరేట్ పెట్టుబడులు రావచ్చు అనే మాట వినిపిస్తోంది.
ఇవన్నీ జరగడానికి అర్నెల్ల నుంచి ఏడాది పడుతుందని ముంబాయి వర్గాలు పేర్కొంటున్నాయి. అదే కనుక జరిగితే మళ్లీ టాలీవుడ్ లో సినిమాల మీద సినిమాల నిర్మాణం ఊపందుకుంటుంది. ఇప్పుడు మాత్రం ఏమీ తగ్గలేదు. అయితే అచి తూచి అడుగు వేస్తున్నారు. అప్పుడు కాస్త దూకుడుగా వుంటుంది.
కానీ ఏమైనా సరే, నిర్మాతలకు పెద్దగా ఒరిగేది వుండదు. హీరోల రెమ్యూనిరేషన్లు పెరగడం తప్ప.
vc available 9380537747
Checkout latest OTT movie updates at https://ottmovies.info
అంబానీ దూకుడు గా ఉంటాడు అని అనుకొనక్కర్లేదు, ఇంతవరకు jio సినిమా లో పెద్దగా పెట్టుబడులు పెట్టలేదు!
Call boy jobs available 9989793850
OTT లు బాగా active గా ఉంటేనే… ప్రేక్షకుల జేబుల్లో డబ్బులు మిగులుతాయి
Future is ott
చాలా మంచి గుడ్ న్యూస్, ఇక థియేటర్లు అవసరం లేదు