అటు హీరో, అటు నిర్మాత.. ఓపెన్ ఛాలెంజ్

సినిమా విడుదలకు ముందు ఛాలెంజ్ చేయడానికి గట్స్ కావాలి. ఎంతో నమ్మకం, మరెంతో ధైర్యం లేకపోతే అలాంటి సవాళ్లు చేయరు. ఈమధ్య కాలంలో ఓ హీరో, ఓ నిర్మాత అలాంటి సవాళ్లు విసిరారు. వాళ్లు…

సినిమా విడుదలకు ముందు ఛాలెంజ్ చేయడానికి గట్స్ కావాలి. ఎంతో నమ్మకం, మరెంతో ధైర్యం లేకపోతే అలాంటి సవాళ్లు చేయరు. ఈమధ్య కాలంలో ఓ హీరో, ఓ నిర్మాత అలాంటి సవాళ్లు విసిరారు. వాళ్లు నమ్మకం పెట్టుకున్న ఆ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి వాళ్లిచ్చిన భారీ స్టేట్ మెంట్స్ నిజమయ్యాయా?

అరివీర భయంకరమైన స్టేట్ మెంట్ ఇచ్చిన ఆ హీరో కిరణ్ అబ్బవరం. “ఇంతవరకు ఎక్కడా రాని పాయింట్ తో సినిమా తీశాం. మేం ఎత్తుకున్న పాయింట్ ఎక్కడైనా మీకు వచ్చినట్టు అనిపించినా, ఎక్కడైనా కనిపించినట్టు అనిపిస్తే నేను సినిమాలు చేయను.” అంటూ చాలా పెద్ద ప్రకటన ఇచ్చాడు.

‘క’ సినిమాకు సంబంధించి విడుదలకు ముందు కిరణ్ ఇచ్చిన డేరింగ్ స్టేట్ మెంట్ ఇది. అతడు చెప్పినట్టుగానే ఈ కథలో మెయిన్ మిస్టరీని, క్లయిమాక్స్ ను ఊహించడం ఎవ్వరితరం కాదు. బాక్సాఫీస్ ఫలితం సంగతి పక్కనపెడితే.. ఛాలెంజ్ చేసి మరీ ఈ విషయంలో తన గట్ ఫీల్ చాటుకున్నాడు కిరణ్ అబ్బవరం.

ఇలా ఛాలెంజ్ చేసిన మరో వ్యక్తి నాగవంశీ. ‘లక్కీ భాస్కర్’ సినిమాకు సంబంధించి ఈ నిర్మాత ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. అదేంటంటే.. ఓ కొత్త కాన్సెప్ట్, కొత్త బ్యాక్ డ్రాప్ తో ఓ ప్రయోగం చేశామని, లక్కీ భాస్కర్ లో కూడా తప్పులు ఎవరికైనా దొరికితే వాళ్లను పిలిచి పార్టీ ఇస్తానని ఛాలెంజ్ చేశాడు.

నాగవంశీ చెప్పినట్టే ఈ కాన్సెప్ట్ కొత్తది, ఈ తరహా కథ ఇంతవరకు తెలుగుతెర మీద రాలేదు. నెరేషన్ మినహాయిస్తే.. అతడు ఛాలెంజ్ చేసినట్టు కథలో ఎలాంటి తప్పులు ఎవ్వరికీ కనిపించలేదు.

సో.. ఇటు హీరో కిరణ్ అబ్బవరమైనా, అటు నిర్మాత నాగవంశీ అయినా తమ ఛాలెంజెస్ విషయంలో సక్సెస్ అయ్యారు.

12 Replies to “అటు హీరో, అటు నిర్మాత.. ఓపెన్ ఛాలెంజ్”

  1. ఈ లా టి సాలెంజ్ లు సాలా సుసేసినం. ఈయన గోరు సిన్మాలు సెత్తే మాకేలా… మానెత్తే మాకేల? బాగుంటే సూత్తాం… నేకుంటే మానెత్తాం… ఎవడికేహే

  2. పాయిoట్ కొత్తగా వున్నంత మాత్రాన సరిపోదు, రెండు గంటల పాటు ఆడియన్స్ సినిమాలో లీనం కావాలి, క సినిమాలో అదే లోపించింది. లక్కీ భాస్కర్ ఓకే. ఒకట్రెండు సీన్లు బాగున్నాయనో, పాటలు బాగున్నాయనో సినిమా లను చూసే కాలం వెళ్ళిపోయింది.K.A కూడా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసుకుంటే సరిపోతుంది

Comments are closed.