జోగిని తెచ్చుకుంటే ముసలం పుట్టినట్టే!

ఇప్పుడు జోగి రమేశ్ ను పార్టీలోకి తీసుకుంటే వసంత కృష్ణప్రసాద్ లో కూడా అసంతృప్తి రేగే ప్రమాదం ఉంది

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుల్లో ఒకరు, మాజీ మంత్రి జోగిరమేష్ ఇప్పుడు వైసీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారా? ఆయన త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్పేసి.. అధికారంలో ఉన్న కూటమి పార్టీల్లో చేరబోతున్నారా? తెలుగుదేశంలో చేరడానికి ప్రయత్నిస్తున్నారా? అనే పుకార్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

జోగి రమేశ్ మీద మాత్రమే కాకుండా, ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా నమోదై ఉన్న కేసుల ఒత్తిడినుంచి బయటపడడానికి జోగి రమేశ్ వైసీపీని వీడడానికి నిర్ణయించుకుని ఉండవచ్చుననే ప్రచారం జరుగుతోంది. అయితే జోగి రమేశ్ ను తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటే మాత్రం ముసలం పుట్టినట్టే అని పార్టీ కేడర్, నాయకులు మాట్లాడుకుంటున్నారు.

జోగి రమేశ్ వైఎస్సార్ సీపీలో సీనియర్ నాయకుల్లో ఒకరు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తుల్లో కూడా ఒకరు. జగన్ పరిపాలన రోజుల్లో.. జోగి రమేశ్ తో వ్యక్తిగతంగా తగాదాలు ఉన్న అప్పటి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. జగన్ వద్దకు వెళ్లి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ.. జోగిమీద చర్యలు తీసుకోవడానికి జగన్ సంసిద్ధత చూపలేదు. సర్దుకుపోవాలని వసంతకే చెప్పుకొచ్చారు.

ఎన్నికల ముందు పరిణామాల్లో వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశంలోకి వచ్చి మైలవరం నుంచే పోటీచేసి గెలిచారు. అప్పటిదాకా పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేశ్ ను జగన్ పెనమలూరుకు మార్చారు. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న పుకార్ల ప్రకారం జోగి రమేశ్ తెలుగుదేశంలోకి రావాలని అనుకుంటున్నారు.

అయితే ఆయన తెదేపాలో చేరడం వలన ఆ పార్టీలో పెద్ద ముసలమే పుట్టే అవకాశం ఉంది. జోగి రమేశ్ దెబ్బను వైసీపీలో తట్టుకోలేకపోయిన వసంతకృష్ణప్రసాద్ ను తెలుగుదేశంలోకి తీసుకువచ్చి ఆయనకు టికెట్ ఇవ్వడం వలన.. చంద్రబాబునాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావును దూరం చేసుకున్నారు.

కీలక నాయకుడు అయిన దేవినేని ఉమా ఎన్నికల తర్వాత ఇప్పటిదాకా కూడా ఎక్కడా యాక్టివ్ గా కనిపించడం లేదు. తనకు అన్యాయం జరిగిందని కుమిలిపోతూ ఉన్నారు. ఇప్పుడు జోగి రమేశ్ ను పార్టీలోకి తీసుకుంటే వసంత కృష్ణప్రసాద్ లో కూడా అసంతృప్తి రేగే ప్రమాదం ఉంది. అలాగే మైలవరంతో సమానంగా పెడన మీద కూడా పట్టున్న జోగి రమేశ్ ఆ నియోజకవర్గంలో రాజకీయం చేయడం ప్రారంభిస్తే అక్కడి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సహించలేకపోవచ్చు.

మొత్తానికి ఆ ప్రాంతంలో పలు నియోజకవర్గాల రాజకీయాలు జోగి రమేశ్ రాక వల్ల ప్రభావితం అవుతాయి. ఆయనకు చంద్రబాబు ఎక్కడ ఏహోదాలో అవకాశం ఇస్తారనేది కూడా ముఖ్యం. జోగి రమేశ్ పార్టీలోకి వచ్చి ఇక్కడ గోతులు తవ్వడం మొదలుపెడితే కనీసం నాలుగైదు నియోజకవర్గాలు ప్రభావితం అవుతాయనే చర్చ కూడా ఉంది. మరి ఆయనను చేర్చుకోవడానికి చంద్రబాబు అత్యుత్సాహం ఏమిటో అర్థం కావడం లేదు.

25 Replies to “జోగిని తెచ్చుకుంటే ముసలం పుట్టినట్టే!”

  1. ఈయన్ని చేర్చుకుంటే కూటమిలో ముసలం పుట్టటం సరే..

    .

    ఈయన్ని వదులుకుంటే లెవెనోడీ పరుస్థితి ఎంటో కూడా రాయి ఎంకటి..

    1. అక్కడ ఆ పార్టీ లో ఏ నా బొక్కా లేదు.. ఏముంది రాయడానికి.. అని రచయత భావం కావొచ్చు..

  2. 2028 లోనే నియోజక వర్గాలు పెరుగుతాయని అందరికీ తెలుసులే GA….. మన పార్టీ ఖాళీ ఐపోతుందని అసూయతో కూడిన కడుపు మంట వల్ల వచ్చిన బాధ GA ఇది….అంతే…😂😂

    1. 2024 లో జగన్ ఫేస్ ఎక్కడ పోయింది.. మడిచి గుద్దలో దొపుకొన్నాడా..?

      కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా.. జగన్ రెడ్డి ఫేస్ ఫేడ్ అవుట్ అయిపోయిందా..?

  3. వీడ్ని తిసుకొవడం కంటె ..వీడ్ని తిసుకున్నాం అని అలొచన్ వచ్చిన అ పార్టి అధ్యక్షుడు బట్టలిప్పుకొని బజార్లొ తిరగడం మెలు

  4. అప్పట్లో కరకట్ట నివాసం మీదకు రౌడీలతో దాడికి వెళ్ళింది ఇతనే అనుకుంటా కదా …మరి వెళ్లి ఎలా కలుస్తారో…???

      1. జగనన్న ను దారుణంగా తిట్టిన నాయకులను పార్టీ లోకి తీసుకుని మంత్రి పదవులు కూడా ఇచ్చిన మన జగనన్న

Comments are closed.