అనిత ఉక్కిరిబిక్కిరి

ప్ర‌త్య‌ర్థులెవ‌రైనా విమ‌ర్శ‌లు చేస్తే హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనితకు బాధ వుండేది కాదు. ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణే ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని అనిత జీర్ణించుకోలేక‌పోతున్నారు. అయితే త‌న‌ను ఏమీ అన‌లేద‌ని ఆమె అన‌డం గ‌మ‌నార్హం.…

ప్ర‌త్య‌ర్థులెవ‌రైనా విమ‌ర్శ‌లు చేస్తే హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనితకు బాధ వుండేది కాదు. ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణే ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని అనిత జీర్ణించుకోలేక‌పోతున్నారు. అయితే త‌న‌ను ఏమీ అన‌లేద‌ని ఆమె అన‌డం గ‌మ‌నార్హం. అనిత విఫ‌ల‌మైంద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్న‌ట్టు చూపాల‌ని హోంమంత్రి స‌వాల్ విస‌ర‌డం ఆమెకే చెల్లింది. అనిత తీరు న‌వ్వ‌లేక ఏడ్చిన‌ట్టుగా వుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి రాష్ట్రంలో అమ్మాయిల‌పై అఘాయిత్యాలు, హ‌త్య‌లు, అలాగే ఇత‌ర‌త్రా అరాచ‌కాలు పెరిగిపోయాయ‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. అయితే ఇవ‌న్నీ ప్ర‌త్య‌ర్థుల ఆరోప‌ణ‌లుగా హోంశాఖ మంత్రి అనిత తిప్పుకొడుతూ వ‌చ్చారు.

కానీ హోంశాఖ మంత్రిగా అనిత అట్ట‌ర్ ప్లాప్ అయ్యార‌నే విమర్శ‌ల‌కు ప‌వన్ సంచ‌ల‌న కామెంట్స్ బ‌లం క‌లిగించాయి. దీంతో అనిత హోంశాఖ మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌నే డిమాండ్స్ ముందుకొస్తున్నాయి. మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాల‌ను, అలాగే రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌ను అరిక‌ట్ట‌క‌పోతే, తానే హోంశాఖ మంత్రి ప‌ద‌విని తీసుకోవాల్సి వ‌స్తుంద‌నే హెచ్చరిక‌పై తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ కామెంట్స్ ముమ్మాటికీ అనిత‌ను అవ‌మానించేలా ఉన్నాయ‌ని ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే అనిత పేరుకే హోంశాఖ మంత్రి అని, అధికారాల‌న్నీ తండ్రీత‌న‌యుడైన చంద్ర‌బాబు, లోకేశ్ వద్ద ఉన్నాయి. ఈ విష‌యం తెలిసి కూడా ప‌వ‌న్ త‌న స‌హ‌చ‌ర మంత్రిపై అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పైగా ప‌వ‌న్ కామెంట్స్‌ను మ‌రో మంత్రి నారాయ‌ణ స‌మ‌ర్థించారు.

ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రులు ఇత‌ర శాఖ‌ల్లో త‌ప్పులు జ‌రుగుతున్న‌ప్పుడు అప్ర‌మ‌త్తం చేస్తూ వుంటార‌న్నారు. హోంశాఖ మంత్రి అనిత‌కు సంబంధించి కూడా ప‌వ‌న్ అలాంటి వ్యాఖ్య‌లే చేసి వుంటార‌ని ఆయ‌న అన్నారు. దీంతో అనిత ఏకాకి అయ్యిన‌ట్టే. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల వ్య‌వ‌హారాల్ని సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌వేక్షిస్తుంటార‌ని తెలిసి కూడా అనిత‌పై ప‌వ‌న్ చేసిన కామెంట్స్ వెనుక ఏమై వుంటుంద‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది.

ఏది ఏమైనా మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు జ‌రుగుతున్నాయ‌ని, క‌ట్ట‌డి చేయ‌క‌పోతే తాను హోంశాఖ మంత్రి ప‌ద‌వి తీసుకుంటే వేరేలా వుంటుంద‌ని బ‌హిరంగంగా కామెంట్ చేయ‌డంతో ఏదో జ‌రుగుతోంద‌న్న భావ‌న ఏర్ప‌డింది. ఇంత‌కాలం ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుపడుతున్న అనిత‌కు ప‌వ‌న్ కామెంట్స్ ఇబ్బందిక‌రంగా మారాయి.

11 Replies to “అనిత ఉక్కిరిబిక్కిరి”

  1. NEXT Lokesh సిఎం

    పవన్ హోం మినిస్టర్ కన్ఫర్మ్

    2029 గెలిస్తే సిఎం సీటు షేరింగ్

    1. టీడీపీతో పవన్ కలిసి ఉన్నంతకాలం ఎప్పటికి పవన్ ని సీఎం కానివ్వరు…. అది పవన్ కి కూడా తెలుసు

  2. సీ ఎం గారిని కలిసి వస్తే విషయం తెలిపోతుంది కదా!దీనికి ఉక్కిరిబిక్కిరి ఎందుకో?

  3. Ikkada matter ardgamayina avanattu raasav

    Mee boku batch ni vadilestunnaru Ani PK maata

    PK home ayite social media lo boothulu taggutayi

    Nayakulu noru adupulo pettukoni matladutaaru

    Idi ycp ki warning la vundi TDP ki la ledu

    Ayina super ga cover chesav

  4. AP లో ఎక్కడ స్త్రీలపై హత్యాచారం జరిగిన, మర్డర్లు జరిగిన నిందుతులు వెంటనే ఆరెస్ట్ అవుతున్నారు హోం మంత్రి #vangalapudianitha గారు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ విషయాన్నీ తెలుసుకోవాలి.పవన్ కళ్యాణ్ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పడం మానుకోవాలి.

  5. బాల నియంత్రత్వ అస్పష్ట రాజకీయ సనాతనిక్….

    హోం మినిష్టర్ ఏం ఖర్మ చదువులేనోడి మతోన్మాధి చంకనెక్కి కేసులున్నోడికి భుజం కాస్తూ వచ్చిన అధికారాన్ని దెప్పి పొడుస్తూ, దళిత మహిళా హోం మినిష్టర్ ను అవమానిస్తూ కావలసిన పదవిని లాక్కోవడం పెద్ద గగనమా ఢిల్లీ నుంచి కేసులని భయపెడితే హోం ఏమిటీ 2 సంవత్సరాలు కాలం ముఖ్యమంత్రి పదవే దిగొస్తుంది. మతమూ, కులమూ,నిలకడలేని తనమూ, ఆవేశం క్వాలిఫికేషన్స్ సరిపోవా..!

  6. విలన్ ని హీరో తన్నక పొతే జనాలకు నచ్చదు అధికారం లో వుండగా వైసీపీ నేతలు చేసిన దుర్మార్గాన్ని చూసిన ప్రజలకు ఓపిక నశిస్తుందని పవన్ గ్రహించబట్టే బ్యాండ్ మొదలెట్టాలని చెబుతున్నాడు చంద్రబాబు గారు అడ్డు లేకపోతె పవన్ లోకేష్ అయితే ఈ పాటికి ఈ బ్యాచ్ కి తోలుతీసి చేతిలో పెడుదురు

Comments are closed.