పార్టీలో చేర్చుకున్నాక తొక్కేస్తారంతే!

మాజీ మంత్రి జోగి రమేశ్ ఇప్పుడు తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఆయన మీద ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. ఈ కేసుల నుంచి విముక్తి ఇవ్వడాన్ని ఒక తాయిలంగా ఆశ చూపించి..…

మాజీ మంత్రి జోగి రమేశ్ ఇప్పుడు తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఆయన మీద ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. ఈ కేసుల నుంచి విముక్తి ఇవ్వడాన్ని ఒక తాయిలంగా ఆశ చూపించి.. ఆయనను లొంగ తీసుకోవడానికి అధికార కూటమి ప్రయత్నిస్తుండవచ్చు. కేసుల దెబ్బ తాళలేక జోగి రమేశ్ లొంగిపోయి ఉండొచ్చు. అయితే ఒకవేళ ఆయన ఇలాంటి కీలక సమయంలో పార్టీ మారినప్పటికీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ప్రశ్నార్థకం. అయితే విశ్లేషకులు మాత్రం.. ఒకసారి పార్టీలో చేరిన తర్వాత ఆయన రాజకీయ జీవితాన్ని పూర్తిగా తొక్కేస్తారని అంచనా వేస్తున్నారు.

చంద్రబాబునాయుడు ఇంటి మీద దాడి చేసిన కేసులో జోగి రమేశ్ కీలక నిందితుడు. ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరయ్యారు. ఆయన ద్వారా.. ఆ దాడికి సూత్రధారులుగా సజ్జల రామక్రిష్ణారెడ్డి పేరు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పించాలని.. వారిని కూడా విచారణకు పిలవాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఈనేపథ్యంలో జోగికి పార్టీ మారే ఆఫర్ ఇచ్చి ఉండొచ్చు.

ఒకవేళ పార్టీ మారి వారు కోరుకుంటున్నట్టుగా.. అందరి పేర్లను దాడికి బాధ్యులుగా జోగి రమేష్ చెప్పేశారనే అనుకుందాం. అంతమాత్రాన తెలుగుదేశం పార్టీ ఆయనను నెత్తిన పెట్టుకుంటుందని అనలేం. ఎందుకంటే.. జోగి రమేశ్ కు అవకాశం కల్పించడానికి వారి వద్ద నియోజకవర్గాలు కూడా ఖాళీ లేవు.

జోగి రమేశ్ గతంలో ప్రాతినిధ్యం వహించిన పెడన నియోజకవర్గం నుంచి, ఆయన ప్రాబల్యం ఉన్న మైలవరం నియోజకవర్గం నుంచి ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థులే ఉన్నారు. జోగి రమేశ్ తో తీవ్రంగా విభేదించిన, ఆయన కారణంగానే పార్టీ మారిన వసంత క్రిష్ణప్రసాద్ కూడా తెదేపాలో ఉన్నారు. వీరిని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన జోగిని నెత్తిన పెట్టుకోవడానికి తెలుగుదేశానికి కారణాలేం లేవు.

కాకపోతే.. చంద్రబాబు నివాసం మీద దాడి సహా, అగ్రిగోల్డ్ భూముల కేసులు కూడా ఆయన కుటుంబంపై ఉన్నాయి. ఆ కేసుల నుంచి విముక్తి ఒక్కటే బహుశా ఆయనకు దక్కగల ఆఫర్ తప్ప.. రాజకీయంగా ఇక భవిష్యత్తు ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి టెక్నిక్కులు చంద్రబాబు వద్ద చాలా ఉంటాయని, జోగిని పార్టీలో చేర్చుకుని, తమ అవసరం తీరిపోయిన తర్వాత రాజకీయంగా తొక్కేస్తారని పలువురు అంటున్నారు.

11 Replies to “పార్టీలో చేర్చుకున్నాక తొక్కేస్తారంతే!”

  1. వల్లభనేని వంశీ,కరణం బలరాం,మద్దాల గిరి,వాసుపల్లి గణేష్,రాపాక వరప్రసాద్ మా అన్నయ్య పార్టీ కి మారి తమ రాజకీయ భవిష్యత్తు ను తిరుగు లేకుండా చేసుకున్నారు కదా ga

  2. If this happens atleast TDP people will 100% say for sure ” జోగి కి లేకపోయినా బాబు కైనా ఉండద్ద కాస్త సిగ్గు శరం “

  3. ఈ వేదికలో కొంతమంది అసభ్య పదజాలాన్ని ఉపయోగించి, కుటుంబ సభ్యులను చర్చల్లోకి లాగుతున్నారని తెలుసుకోవడం చాలా నిరాశ కలిగిస్తోంది. ఇది పూర్తిగా అననుసరణీయం, అసహనీయమైనది, మరియు ఇకపై దీన్ని ఏ విధంగానూ సహించము. గమనిక: ఈ సందేశాన్ని గంభీరంగా పరిగణించాలి—ఇలాంటి ప్రవర్తన కొనసాగితే, తక్షణం మరియు కఠినమైన చర్యలు తీసుకోబడతాయి.

    మనకు అందరికీ తన అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు ఉంది; ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలన్నా, ఏ అభిప్రాయానికి వ్యతిరేకం చెప్పుకోవాలన్నా స్వేచ్ఛ ఉంది. కానీ, ఇది గౌరవంతో, మర్యాదగా ఉండాలి. ఈ జీవితం సాకంతమైనది; మరి అసభ్యంగా ప్రవర్తించడానికి ఎందుకు ప్రయత్నించాలి? అసభ్య పదజాలం ఉపయోగించేవారు లేదా వ్యక్తిగత దూషణలతో దిగజారేవారు తక్షణమే నివేదించబడతారు మరియు ఈ వేదిక నుంచి శాశ్వతంగా తొలగించబడతారు.

    పంచ్ ప్రభాకర్ వంటి కొందరు వ్యక్తుల ప్రవర్తన ఎంత దారుణంగా మారిందో చూశారు. కానీ ఇలాంటి ప్రవర్తన మనం అనుసరించాల్సినది కాదు, అలాంటి అసభ్యతకు మన వేదికపై స్థానం లేదు. మన సంభాషణల స్థాయిని, నాణ్యతను కాపాడుకోవడం మనందరి బాధ్యత.

    గ్రేట్ ఆంధ్ర ఈ వేదికను గౌరవపూర్వక వాతావరణంగా నిలబెట్టే బాధ్యత వహించాలి. ఇది కేవలం అభిప్రాయాలను తెలిపే స్థలమే కాదు, మనిషి గౌరవం మరియు పరస్పర మర్యాదా పూర్వకమైన చర్చలకు వేదిక కావాలి. భారత ప్రభుత్వం మరియు ఇతర జాతీయ సంస్థలు కూడా ఇటువంటి ఆన్‌లైన్ దుర్వినియోగాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అసభ్య పదజాలం వాడేవారు, కుటుంబాలపై దూషణలు చేసేవారు చట్టపరమైన కఠిన పరిణామాలను ఎదుర్కొనే అవకాశం ఉంది, మరియు ఇది వారి జీవితంపై శాశ్వత ప్రభావాన్ని చూపగలదు.

    మీరు చేయదగిన పనులు, కలిగించదగిన గౌరవం, అన్ని ఈ జీవితంలోనే ఉన్నాయి. ఈ జీవితం స్వల్పమైంది; అసభ్య పదజాలం, ద్వేషపూరిత వ్యాఖ్యలు ఉపయోగించి ఎందుకు ఈ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు? ఇకపై ప్రతీ వ్యాఖ్యకి బాధ్యత ఉంది—మనలో ఏ ఒక్కరి తలపై మచ్చ లేకుండా ఈ వేదికను కాపాడుకుందాం. ఇప్పుడే ఈ ప్రవర్తనను పూర్తిగా విసర్జించండి లేదా కఠినమైన, శాశ్వత పరిణామాలను ఎదుర్కొండి.

  4. వెళ్తే తొక్కేస్తారని తెలీనంత చిన్న పిల్లాడు కదా జోగి?

    .

    కూటమి లోకి పంపి ముసలం పుట్టించాలని శకుని గానీ ఐడియా అయ్యుండాలి..

  5. నియంత లఫంగి నాయాలు ఎవ్వడు లేదు అనుకుంటా .. 2029 నాటికి 175 నియోజకవర్గాలు కాస్త 225 అవుతున్నాయి . వాటిలో సర్దుబాటు చెయ్యవచ్చు ..,

Comments are closed.