పుష్ప 2.. ఎసి.. డిసి.. ఆట

సినిమా బ్లాక్ బస్టర్ అయితే డబ్బులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి. అదంతా నిర్మాతలకే. వచ్చే డబ్బు ఇంత అని ఊహించలేం కూడా.

పేకాటతో పరిచయం వున్న వాళ్లకు ఈ ఎసి డిసి ఆట అనే దాని అర్థం తెలిసిందే. కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టినట్లే, లేదంటే ఏమీ లేదు. పుష్ప 2 సినిమాతో మైత్రీ మూవీస్ పేరు దేశం అంతా మారుమోగుతోంది. వారికి ఇప్పుడు ఇది ఓ హై ప్రొఫైల్ విజిటింగ్ కార్డ్. పుష్ప నిర్మాతలు అంటే ఒక రేంజ్, ఒక లెవెల్, టాలీవుడ్ లో వెయ్యి కోట్ల టర్నోవర్ సినిమా తీసిన వారు అతి కొద్ది మంది. రాజమౌళి నుంచి వచ్చిన సినిమాలు వెయ్యి కోట్ల టర్నోవర్ వున్నా ఎక్కడా హడావుడి వుండదు. నిర్మాతకు పేరూ వుండదు. టోటల్ క్రెడిట్ గోస్ టు రాజమౌళి.. అన్నట్లు వుంటుంది.

అందువల్ల ఇప్పటికి ఈ రేంజ్ ఫీట్ సాధించిన నిర్మాతలుగా పేరు తెచ్చుకున్నది అశ్వనీదత్ (కల్కి), నవీన్ యెర్నేని (పుష్ప 2). పుష్ప వన్ అనుకోని హిట్, అదో హటాత్ పరిణామం. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత డబ్బు వెనక్కు ఇచ్చారు బయ్యర్లకు. కానీ పుష్ప విడుదల తరువాత సోషల్ మీడియాలో రీల్స్ వల్ల వచ్చిన క్రేజ్ ఇంతా అంతాకాదు. ముఖ్యంగా ఊ అంటావా పాట వల్ల నార్త్ బెల్ట్ లో వచ్చిన క్రేజ్ మరింత. దాంతో బాహుబలి తరువాత సీక్వెల్ వుంటుందని చెప్పి, వెంటనే తీసిన సినిమాగా పుష్ప క్రెడిట్ ను దక్కించుకుంది.

పుష్ప 2 కు క్లాప్ పడిన దగ్గర నుంచి ప్రయాణం సాగుతూనే వుంది. దాదాపు మూడేళ్ల ప్రయాణం, ఈ సినిమా పెట్టుబడికి అయిన వడ్డీలే 100 కోట్లు అని టాక్ వుంది. త్వరగా తీసి వుంటే ఇక్కడే ఓ యాభై కోట్లు మిగిలి వుండేవి. అది వేరే సంగతి. పుష్ప 2 కి విపరీతమైన బజ్ వచ్చింది. దాని ఫలితమే సినిమా ప్రచారానికి వివిధ కార్పొరేట్ బ్రాండ్ లు అన్నీ కలిసి దగ్గర దగ్గర 150 కోట్లు ఖర్చు చేయడం. అదంతా నిర్మాతకు కలిసి వచ్చినట్లే.

పుష్ప 2 ఎసి డిసి ఎందుకు అయింది అంటే.. సినిమా టర్నోవర్ లో సింహ భాగం హీరోకి వెళ్తోంది. దాదాపు 27 శాతం అంటే 270 కోట్లు హీరోకే అని ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం. ఆ తరువాత సింహభాగం దర్శకుడు సుకుమార్ ది. ఆయన స్వంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ ది.

కానీ సినిమా మాత్రం ఒక్క ఆంధ్రలో తప్ప మిగిలిన ప్రతి చోటా నిర్మాతలు పంపిణీ చేసుకుంటున్నారు. ఎక్కడా అమ్మలేదు. అందువల్ల సినిమా బ్లాక్ బస్టర్ అయితే డబ్బులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి. అదంతా నిర్మాతలకే. వచ్చే డబ్బు ఇంత అని ఊహించలేం కూడా.

కానీ ఏమాత్రం తేడా జరిగినా, మైత్రీకి వున్న మంచి పేరు ప్రకారం వెనక్కు ఇవ్వాల్సి వుంటుంది. తీసుకున్న అడ్వాన్స్ ల నుంచి. ఆఫ్ కోర్స్ ఆ మేరకు హీరోకి, దర్శకుడి కి కూడా తగ్గే అవకాశం వుంది. ఇతర భాషల్లో, ఓవర్ సీస్ లో సినిమా ఎంత గొప్పగా ఆడితే నిర్మాతలకు అంతకు అంతా పండగ. అందుకే పుష్ప 2 ఏసి డిసి ఆట అయింది.

ఈ ఆట ఫలితం తేలేది మరో మరో వారం రోజుల్లో.

18 Replies to “పుష్ప 2.. ఎసి.. డిసి.. ఆట”

  1. పాపం మన అన్నయ్య అధికారం లో వుండి వుంటే 30 rs కి tickets పెట్టి బాగా help చేసి వుండువాడు…కదా GA….

  2. అదే మన అన్నయ్య అధికారం లో వుండి వుంటే 30 rs కి tickets అమ్మించి పేద ప్రజలకు హెల్ప్ చేసి వుండేవాడు….అంతేనా GA….

  3. సినిమా కి ఖర్చు అయిందంటే ok రెమ్యూనరేషన్ అంతంతా ఇచ్చి జనాల దగ్గర ఉన్న డబ్బుల్ని లక్కోవడం, అభిమానం పెంచెకున్నారుగా డబ్బులు వస్తాయిలే అనుకోవడం కరెక్ట్ కాదు రెమ్యూనరేషన్ తగ్గించుకోండి మాకు టికెట్స్ ధర తగ్గించండి plz

  4. మూడు ముక్కలాట, డంఖా పలాసు అన్నమాట. దేవి తో సున్నము పెట్టుకున్నారు , చూద్దాం ఏమవ్వుద్దో.

  5. చిన్న example కరోనా టైం లో ఇంటర్ పాస్ కానోడుకూడా పాస్ చేసారు గవర్నమెంట్ అలాంటి టైం లోనే పుష్ప వచ్చింది హిట్ అయింది అంతే తేడా

Comments are closed.