ప‌వ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ప‌ద‌వి కోసం కాదు!

నాగబాబు తన ట్వీట్‌లో పవన్ కల్యాణ్ స్వార్థానికి దూరంగా ఉండే ప్రజానాయకుడని, ఆయన చేసే ప్రతి పని ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమేనని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ సీట్ల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ అవ్వ‌డంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. జనసేన-బీజేపీ కూటమి కోటాలో ఒక సీటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్న నాగబాబుకు దక్కబోతోందన్న ఊహాగానాల నేపథ్యంలో, పవన్ కల్యాణ్ రాజకీయ వ్యవహారాలపై నాగబాబు ట్విట్టర్ ద్వారా కీలక వ్యాఖ్యలు చేశారు.

నాగబాబు ట్వీట్‌లో ఏముందంటే… నాగబాబు తన ట్వీట్‌లో పవన్ కల్యాణ్ స్వార్థానికి దూరంగా ఉండే ప్రజానాయకుడని, ఆయన చేసే ప్రతి పని ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమేనని పేర్కొన్నారు. “పవన్ కల్యాణ్ సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటారు. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతదూరమైనా వెళ్తారు, పోరాడతారు. ఢిల్లీకి వెళ్లడం ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే. ఇలాంటి నాయకుడి కోసం నా జీవితాన్నే అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ఎలాంటి రాజకీయ ఆశలూ లేవు. నేను నా నాయకుడికి సేవ చేయడానికే ఇక్కడ ఉన్నాను” అని ట్వీట్ చేశారు.

గత కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులతో సమావేశాలు, ప్రధాని మోదీతో చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఏకు చెందిన ఎంపీలకు ప్రత్యేక విందు కూడా ఇచ్చారు. నేషనల్, ఇంటర్నేషనల్ అంశాలపై మీడియాతో మాట్లాడారు. ఈ పర్యటన రాజ్యసభ పదవి కోసం అంటూ పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగబాబు చేసిన ట్వీట్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రస్తుతం ఉన్న మూడు రాజ్యసభ సీట్లలో రెండు సీట్లు టీడీపీకి, ఒకటి జనసేన-బీజేపీ కూటమికి దక్కే అవకాశం ఉంది. టీడీపీ తరపున మాజీ ఎంపీ గల్లా జయదేవ్, ఆశోక్ గజపతిరాజు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఆశోక్‌కు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇస్తే అందులో ఒక‌టి చింత‌కాయ‌ల విజ‌య్ కు రాజ్య‌స‌భ సీటు ఇచ్చే చాన్స్ ఉంది. జనసేన-బీజేపీ సీటుకు సంబంధించి నాగబాబు లేదా పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తికి అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల జాబితా వచ్చే వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

11 Replies to “ప‌వ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ప‌ద‌వి కోసం కాదు!”

  1. మరి అయితే.. జగన్ రెడ్డి ని బొక్కలో వేసి కుమ్మడానికా..?

    అప్పుడే అంత పని చేయకండి పవన్ సారూ.. మాకు వారం వారం జగన్ రెడ్డి పండించే కామెడీ మిస్ అవుతుంది.. ఇంకొన్నాళ్ళు ఈ కామెడీ ఇలాగే కొనసాగనీ..

        1. ఇక్కడ అర్ధం కానీ విషయం ఏమిటి అంటే, ప్రజలు జగన్ వద్దు కూటమి ముద్దు అని అందలం ఎక్కించారు, సుమారు అర్ద సంవత్సరం కావస్తున్నది. ఎన్నికల ముందు అంత ఇంత అన్నారు. కానీ జగన్ అభిమానులే జగన్ జపం మానేశారు కానీ వీళ్ళు మాత్రం అధికారంలో వున్నది మేము అనే ఫీలింగ్ లేకుండా ఇంకా జగనే సీఎం గా ఉన్నట్లు, ప్రతి రోజు జగన్ జపం చేసేస్తున్నారు. అంటే అంత లా జగన్ భయ పెట్టాడు అనుకోవాలా? లేక వాళ్ళ గెలుపు రాజమార్గం లో వచ్చిన గెలుపు కాదు అని వస్తున్న విమర్శలు నిజం అనుకోవాలా? ఏది ఏమైనా మీగెలుపు ప్రజలు ఇచ్చిన గెలుపు అనుకుంటే ఎవడి పైనో విమర్శలు కాకుండా ప్రజలకోసం పనిచెయ్యండి. కాదు ఈగెలుపు ప్రజలు ఇచ్చింది కాదు మేము సృష్టించు కున్న గెలుపు అనుకుంటే మాత్రం ఇలాంటి విమర్శలతో మరో నాలుగున్నర ఏండ్లు కాలం గడిపేయ్యడమే….

  2. డాక్టర్ గారూ, మా ఆయన మొహం పీక్కుపోయింది, జుట్టు గడ్డం నెరిసిపోయింది. కింగులా ఉండేవాడు బొంగులా అయ్యాడు..మామూలు మనిషి అవ్వాలంటే ఏం తినిపించాలి?

    డాక్టర్ : మీ ఆయన మళ్ళీ మామూలు అవ్వాలంటే జనాల డబ్బు తినిపించాలి. అదే ఆయన గ్లామర్ సీక్రెట్..

    1. six months అవుతుంది జనం డబ్బు తినక, పాపం ఓటర్లు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు మరి బొంగులా కాక ఎలా ఉంటాడు, రోజు కాస్త భారతి సిమెంట్ తినమని చెప్పండి తగ్గొచ్చు ఎందుకంటే అది కూడా అక్రమంగా సంపాదించి పెట్టిన కంపనీ కాబట్టి తింటే వొంట పడుతుందేమో ప్రయత్నించండి

Comments are closed.