పుష్ప2- 450 కోట్ల భారీ టార్గెట్

దాదాపు 450 కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేయాల్సి వుంటుంది.ఇది చాలా పెద్ద ఫీట్.

పుష్ప 2 విడుదల జస్ట్ నాలుగు రోజుల్లోకి వచ్చేసింది. సినిమా సెన్సారు టాక్ అంటూ ఒక పక్క హడావుడి మొదలైపోయింది. సినిమా సెన్సారు చేసిన సభ్యుల్లో ఎవరో ఔత్సాహికులు మొత్తం కథ అంతా బయటకు చెప్పేసినట్లుంది. దాంతో స్టార్ట్ టు ఎండ్ కథ ఇదీ అంటూ చక్కర్లు కొట్టేస్తోంది.

ఇదంతా ఇలా వుంటే టికెట్ ల బుకింగ్ ఇంకా ఓపెన్ కాలేదు. ఓపెన్ అవుతుంది.. మంచి ఓపెనింగ్ తీసుకుంటుంది. అదంతా అలా వుంచితే తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్ర, సీడెడ్, నైజాం కలిసి ఎంత వసూళ్లు సాగించాల్సి వుంటుంది అన్నది పాయింట్.

ఆంధ్రలో 90 కోట్ల మేరకు, నైజాంలో 100 కోట్లు, సీడెడ్ లో 30 కోట్లకు పుష్ప 2 సినిమాను బయ్యర్లకు విక్రయించారు. 18శాతం జిఎస్టీలు, థియేటర్ రెంట్లు, డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు, ఇరవై శాతం కమిషన్ అన్నీ తీసేయగా 220 కోట్లు రావాల్సి వుంటుంది. అంటే దాదాపు 450 కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేయాల్సి వుంటుంది.

ఇది చాలా పెద్ద ఫీట్. బాహుబలి, ఆర్ఆర్ఆర్ రేంజ్ కలెక్షన్లు రావాలి. అంత రన్నింగ్ వుండాలి. కేవలం రెండువారాల్లో వచ్చేసే టార్గెట్ కాదు ఇది. విడుదలయిన తరువాత మధ్యలో గ్యాప్ ఇచ్చి, మళ్లీ పండగ టైమ్ లో థియేటర్లు వుండేలా చూసుకోవాల్సి వుంటుంది. పుష్ప వన్ కు నిర్మాతలు డబ్బులు వెనక్కు ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు రేట్లకు ఇప్పుడు రేట్లు డబుల్. మరి సినిమా డబుల్ రేంజ్ హిట్ కావాలి. ఫ్యామిలీలు తరలి రావాలి, చాలా పెద్ద టాస్క్ ఇది.

18 Replies to “పుష్ప2- 450 కోట్ల భారీ టార్గెట్”

  1. అప్పటి రేట్లకు ఇప్పటి రేట్లు double aa…. సిగ్గులేని GA 50 rs కి double 300 ఎలా అవుతుంది….అప్పట్లో మీరు చేసిన అరాచకం గురించి అందరూ మర్చిపోయారు అని fix ఐపోయి మరీ రుద్దు తున్నావా GA….😂😂

  2. Theatre ki vacche public 50% of the population nundi 10% ki padipoyindhi ani film makers ki telisi, ee vacche 10% vaari mida ne, ticket rates 500% penchi colls gunjudhaamu ani plan. Audience ee tricks ki padoddu. 2nd week daaka wait cheste, rates taggaaka choodu, leda OTT varaku wait chesi, aa theatre lo spend chese money ni oka mutual fund SIP start cheste 20 yrs lo meere rich avutaru

Comments are closed.