స్మ‌గ్లింగ్‌పై ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా మాట్లాడ్డం ఏంటి నాదెండ్ల‌?

జ‌న‌సేన నాయ‌కుల్ని అర్థం చేసుకోవ‌డం క‌ష్ట‌మో, లేక వాళ్ల మాట‌ల్లో అర్థం వుండ‌దే తెలియ‌ని ప‌రిస్థితి. అధికారంలో కీల‌క భాగ‌స్వామిగా ఉంటూ, ప్ర‌తిప‌క్ష నాయ‌కుల్లా ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ మొద‌లుకుని, ఆ పార్టీ నాయ‌కులు…

జ‌న‌సేన నాయ‌కుల్ని అర్థం చేసుకోవ‌డం క‌ష్ట‌మో, లేక వాళ్ల మాట‌ల్లో అర్థం వుండ‌దే తెలియ‌ని ప‌రిస్థితి. అధికారంలో కీల‌క భాగ‌స్వామిగా ఉంటూ, ప్ర‌తిప‌క్ష నాయ‌కుల్లా ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ మొద‌లుకుని, ఆ పార్టీ నాయ‌కులు విచిత్రంగా మాట్లాడుతున్నారు. శాంతిభ‌ద్ర‌త‌ల‌పై ప‌వ‌న్‌క‌ల్యాణ్ అమాయ‌కంగా హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌పై ఏవో కామెంట్స్ చేశార‌ని అనుకున్నారు.

కానీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉద్దేశ‌పూర్వ‌కంగానే సొంత ప్ర‌భుత్వానికి మచ్చ తెచ్చేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అసంతృప్తి టీడీపీ నేత‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ ఆదివారం విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ దేశ భ‌ద్ర‌త‌కు భంగం క‌లిగించేలా కాకినాడ పోర్ట్‌లో స్మ‌గ్లింగ్ జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌నిఖీలో ఎన్నో అంశాలు వెలుగు చూశాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

రూ.12,800 కోట్లతో ప్రజలకు రేషన్ బియ్యం అందిస్తున్న‌ట్టుగా ఆయ‌న చెప్పారు. అయితే మంత్రిగా తన సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన తెనాలిలో పౌరసరఫరాల శాఖ గోడౌన్‌లో తనిఖీ చేశామన్నారు. ఆ తర్వాత‌ తనిఖీల్లో కూడా తూకాల్లో తేడాలు ఉన్నాయని ఆయ‌న అన‌డం గ‌మ‌నార్హం. కాకినాడ‌లో త‌నిఖీల్లో 51,427 మెట్రిక్ టన్నుల బియ్యం పట్టుకున్న‌ట్టు మంత్రి తెలిపారు. 13 కంపెనీలపై కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు మంత్రి నాదెండ్ల చెప్పారు. అయితే వాళ్లంతా కోర్టును ఆశ్ర‌యించి బియ్యం విడుదలకు ఆదేశాలు తెచ్చుకున్న‌ట్టు మంత్రి తెలిపారు.

కాకినాడలో అసలేం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకుంద‌న్నారు. గత ఐదేళ్లల్లో కాకినాడ పోర్టులోకి ఒక్కరూ కూడా వెళ్లలేదని నాదెండ్ల తెలిపారు. సుమారు 48,537 కోట్ల రూపాయల విలువ చేసే బియ్యం ఎగుమతి చేశారని మంత్రి ఆరోపించారు. దీని వెనుక ఎవరున్నారో బయటకు లాగుతున్నామని ఆయ‌న అన్నారు. మంత్రిగా ఉన్న నాదెండ్ల కాకినాడ‌లో అస‌లేం జ‌రుగుతున్న‌దో తెలియ‌డం లేద‌న‌డం, అలాగే దేశ భ‌ద్ర‌త‌కు ముప్పు వాటిల్లే విధంగా స్మ‌గ్లింగ్ జ‌రుగుతుంద‌ని ఆరోపించ‌డం కూట‌మి స‌ర్కార్‌కు రాజ‌కీయంగా న‌ష్టం తెచ్చేలా ఉన్నాయి. ఇవ‌న్నీ ప్ర‌తిప‌క్ష నాయ‌కులు మాట్లాడాల్సిన అంశాలు. కానీ తెలిసో, తెలియ‌కో జ‌న‌సేన నాయ‌కులు ఏవేవో మాట్లాడుతున్నార‌ని టీడీపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు.

10 Replies to “స్మ‌గ్లింగ్‌పై ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా మాట్లాడ్డం ఏంటి నాదెండ్ల‌?”

  1. ఇంతవరకూ రైస్ స్మగ్లింగ్ మీద ఒక్క ఆర్టికల్ రాయకుండా .. తమరు రాసే మొదటి విశ్లేషణ ఇదా .. సిగ్గుగా లేదా సర్

  2. ఈ మాఫియా వెనక్కి ఎవరున్నారో బయటికి తియ్యమని ప్రభుత్వం మీద గట్టిగా ఆర్టికల్ రాయండి సర్

  3. బావుంది మీ నాయకుడేమో శాంతి భద్రతల వైఫల్యం పైన ప్రతిపక్ష నాయకుడి లాగా హోం మంత్రి నీ అంటాడు. నువ్వు కూడా మంత్రివి అయ్యుండి ప్రతి పక్షం అంటున్నావు. ఏం నాయకులు రా బాబు.

  4. స్వపక్షం లో విపక్షం. బాగా పని చేస్తున్నారు. నెమ్మదిగా వైకాపా కి ప్రత్యామ్నాయంగా గా ఎదుగుతారేమో?. Let us wait and see

Comments are closed.