తమ్మినేని ఇన్నింగ్స్ ముగిసినట్లేనా?

శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా, మాజీ స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాంది నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర. ఆయన టీడీపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ప్రజారాజ్యంలోకి…

శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా, మాజీ స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాంది నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర. ఆయన టీడీపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ప్రజారాజ్యంలోకి వెళ్ళారు. అక్కడ నుంచి వైసీపీలోకి వచ్చారు.

తమ్మినేని ఆముదాలవలస నుంచి పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో వైసీపీ తరఫున గెలిచిన ఆయన మంత్రి కావాలని అనుకున్నారు. అయితే అధినాయకత్వం ఆయనను స్పీకర్ గా చేసింది. తమ్మినేని ఈ పదవిలో అయిదేళ్ల పాటు ఉన్నారు.

ఆయనకు 2024లో వైసీపీ టికెట్ ఇచ్చింది కానీ టీడీపీ కూటమి ప్రభంజనంలో ఓటమి పాలు అయ్యారు. ఆయనను సొంత మేనల్లుడే ఓడించారు. అలా టీడీపీ అభ్యర్థి రవికుమార్ చేతిలో రెండు సార్లు ఓడిన సొంత మేనమామగా తమ్మినేని మిగిలారు.

వైసీపీ అధినాయకత్వం ఏపీ వ్యాప్తంగా కొత్తగా అనేక అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించుకుంటూ వస్తోంది. ఆ క్రమంలో ఆముదాలవలసకు మొదటిసారిగా తమ్మినేని కుటుంబాన్ని పక్కన పెట్టి చింతాడ రవికుమార్ అనే వైసీపీ నేతను ఇంచార్జిగా చేసింది.

ఆముదాలవలసలో టీడీపీ బలంగా ఉండడంతో పాటు మేనల్లుడు కూనతో మేనమామ తమ్మినేని పోరాటం అనుకున్న స్థాయిలో సాగడం లేదు అన్న అంచనాలతోనే వైసీపీ కొత్త నాయకత్వం వైపు మొగ్గు చూపించింది అని అంటున్నారు. తన రాజకీయ వారసుడిగా కుమారుడిని తీసుకుని రావాలని అనుకున్న తమ్మినేనికి ఇది షాకింగ్ పరిణానమే అని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని కొన్ని దశాబ్దాల పాటు తన ప్రభావాన్ని రాజకీయంగా జిల్లాలో చూపించారు.

ఆయన టీడీపీ లోపలా బయటా కూడా కింజరాపు కుటుంబాన్ని ఎదిరించి నిలబడ్డారు అని అంటారు. రాజకీయాలలో ఆయన ఇపుడు చివరి దశలో ఉన్నారని అంటున్నారు. తన వారసుడిగా కుమారుడిని నిలబెట్టే ప్రయత్నంలో ఆయన విజయం సాధించలేకపోయారు అని అంటున్నారు. తాజా నియామకంతో తమ్మినేని సైలెంట్ అయ్యారు.

ఆయనకు టీడీపీలో అయితే అవకాశం లేదనే అంటున్నారు. సొంత మేనల్లుడు అక్కడ హవా చాటుతున్నారు ప్రజారాజ్యం నాటి పరిచయాలతో జనసేన వైపు వెళ్తారా అన్నది ప్రచారంలో ఉంది. అయితే తమ్మినేని రాజకీయ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా అని కూడా అంతా తర్కించుకుంటున్న నేపథ్యం ఉంది.

8 Replies to “తమ్మినేని ఇన్నింగ్స్ ముగిసినట్లేనా?”

  1. ఇంత గ..లీ జు గాడు అనుకోలేదు తమ్మినేని. టీడీపీ లో వున్నపుడు మంచి వాగ్ధాటి కలిగిన నాయకుడు గా , పేరుండేది.

  2. ఒక్క 5 ఇయర్స్ కోసం కక్కుర్తి పడి పార్టీ మారి ఇలా ఇన్నింగ్స్ ముగిసినట్టెనా అని అదే పార్టీ మోచేతి నీళ్లు తాగే వెబ్సైట్ లో న్యూస్ వచ్చే పరిస్థితినే స్వయంకృతాపరాధం అంటారు…

Comments are closed.