మహిళ మృతి.. పుష్ప-2 థియేటర్లో అసలేం జరిగింది?

సంధ్య థియేటర్ దగ్గర జరిగిన విషయాన్ని వెల్లడించాడు మృతురాలి భర్త భాస్కర్.

ఊహించని విధంగా పుష్ప-2 విడుదల సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. అసలైన ఇరుకైన ప్రాంతం, పైగా హీరో రావడంతో జనం తోసుకున్నారు. ఆ తొక్కిసలాటలో 39 ఏళ్ల రేవతి అనే మహిల మృతి చెందింది. ఆమె కొడుకు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

అసలు రాత్రి సంధ్యా థియేటర్ దగ్గర ఏం జరిగింది? తొక్కిసలాట జరగడానికి కారణం ఏంటి? ఈ విషయాల్ని స్వయంగా మృతురాలి భర్త వెల్లడించాడు.

“మేం థియేటర్ లో ఉన్నాం. సరిగ్గా అప్పుడే అల్లు అర్జున్ వచ్చాడు. ఒక్కసారిగా పబ్లిక్ రావడంతో అంతా జామ్ అయిపోయింది. నేను, పాప పక్కకున్నాం. నా భార్య, బాబు కొంచెం ముందుకెళ్లారు. కాల్ చేస్తే ఎత్తారు. ఆ తర్వాత 10 నిమిషాలకు కాల్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. ఇంతలో పాప ఏడుస్తోంది. దగ్గర్లోనే తెలిసినవాళ్లు ఉంటే వెళ్లి పాపను అక్కడ పెట్టి వచ్చాను. అంతలోనే ఏదో జరిగిందని అంతా మాట్లాడుతున్నారు. పోలీసువాళ్లు ఓ వీడియో చూపించారు. అది మా బాబుదే. వెంటనే జీపులో ఎక్కించుకొని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. తర్వాత నన్ను పోలీస్ స్టేషన్ కు రమ్మన్నారు. నా భార్యకు ఏమైందని అడిగాను, ఏం చెప్పలేదు. ఆ తర్వాత నిమ్స్ కు రమ్మని కాల్ చేశారు. బాబును వెంటిలేటర్ పై పెట్టామన్నారు. 48 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేమన్నారు. అప్పుడే ఇంకో ఫోన్ వచ్చింది. నా భార్య చనిపోయింది, గాంధీ హాస్పిటల్ కు రమ్మన్నారు.”

ఇలా రాత్రి సంధ్య థియేటర్ దగ్గర జరిగిన విషయాన్ని వెల్లడించాడు మృతురాలి భర్త భాస్కర్. ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న భాస్కర్ కొడుకు అల్లు అర్జున్ ఫ్యాన్. బాబు కోసమే కుటుంబంతో కలిసి సినిమాకొచ్చామని, ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదంటూ కన్నీళ్లుపెట్టుకున్నాడు భాస్కర్.

మరోవైపు అల్లు అర్జున్ పై పలు సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. అభిమాని మరణానికి కారణమైన అల్లు అర్జున్ ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ఎలాంటి సమాచారం లేకుండా అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చాడని మరికొంతమంది ఆరోపిస్తున్నారు.

20 Replies to “మహిళ మృతి.. పుష్ప-2 థియేటర్లో అసలేం జరిగింది?”

    1. Cheepaduga aa pilladu bunny fan Ani… So favorite hero vachadu Ani chuddaniki vellochi beyond his physical ability in that rush…may be his mother went for his safety…I think for saving his son…her mother got more injured …assalu buddhi bunny gadiki … benifit show hype ekkuva Ani telisi akadi ravadam…bunny is responsible for his fan death

  1. ఆ తల్లికి సద్గతులు కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

    Sorry to say… అభిమానులూ… ఇప్పుడు పోయిన ఆ తల్లి ప్రాణాల్ని… మన అభిమాన హీరోలు వెనక్కి తేగలరా? మొసలి కన్నీళ్లు కార్చి… ఎంతోకొంత విదిలించి…అండగా ఉంటాం… అనే డైలాగులు వల్లించి… కొంతకాలం తరువాత మర్చిపోతారు.. తీరని శోకం ఆ కుటుంబానికే కదా… ఆ నష్టం ఎవడు పూడుస్తాడు. ఇది కేవలం బన్నీ గారి గురించి కాదు. అందరు హీరోలు… రాజకీయ నాయకులకు వర్తిస్తుంది. రద్దీ ఉంటుంది అని తెలిసీ రిస్క్ చేయకూడదు.

      1. అది ఆయన ఇష్టం. ఆయన సినిమా.. ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఆయనది. ఆయన వచ్చినా… రాకపోయినా ఫ్యామిలీస్ … పిల్లలు ఇలా బెనిఫిట్ షోస్… మొదటిరోజు చూడాల్సిన నేసిసిటీ ఏంటి? మనం మారితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి.

        1. టికెట్ ధరలు అందుబాటులో ఉంటాయి

        2. హీరోలు నేల మీద నడుస్తారు. మీరంటే నాకు ప్రాణం అనే పిచ్చి డైలాగులు చెప్పరు. అవి నిజమనుకుని మనం చొక్కాలు చించుకొనవసరం లేదు

  2. సినిమాలు..అన్నం..పెట్టవు. హీరోలను..అభిమానించండి..కానీ..ఆరాదించ..వద్దు. ఆరాధనకు..అర్హులు..మీ..తల్లిదండులు..మాత్రమే.

  3. Gumpu mestri em chestunadu? Hyderabad lanti city lo prime theater lo thokkisalata jarigi janam chanipothe siggu anipinchatam leda? Just shame andi shame.

  4. బాధాకరం. అయినా అలాంటి హింసాత్మక సినిమా కి చిన్న పిల్లలతో వెళ్ళటం ఏమిటి ? అక్కడ తోపులాటలు ఉంటాయన్న విషయం తెలుసుగా . ఏమిటో మనకి బాధ్యత తీసుకోవటం ఎప్పుడు తెలుస్తుందో. ప్రతిదానికి పక్కవారి మీద తోసెయ్యటమే .

Comments are closed.