దేవర 2… పుష్ప 3… వుంటాయా?

ఇప్పట్లో దేవర 2 మరియు పుష్ప 3 రావడం కష్టమే. 2026 లేదా 2027 తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయి.

ఈ ఏడాది విడుదలైన రెండు భారీ సినిమాలు దేవర మరియు పుష్ప 2. ఈ రెండు సినిమాలకు సీక్వెల్‌లు ఉంటాయని ముందే ప్రకటించారు. సినిమాల చివర కూడా ఆ మేరకు లీడ్ ఇచ్చారు. అంటే అధికారికంగా సీక్వెల్‌లు ఉంటాయని భావించవచ్చు. అయితే ఈ సీక్వెల్‌లు ఎప్పుడు వస్తాయి?

దేవర సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి, అలాగే పుష్ప 2కి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దేవర సినిమా విడుదలకు ముందే ఎన్టీఆర్ చాలా సినిమాలు ప్లాన్ చేసేసుకున్నారు. పుష్ప 2 సినిమాతో మూడు సంవత్సరాలు గడిపిన బన్నీ, తర్వాతి సినిమాను త్రివిక్రమ్‌తో ప్లాన్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, ఈ రెండు సినిమాల తర్వాత భాగాలు వస్తాయా? అన్నదే అసలు పాయింట్. రెండూ కమర్షియల్ సక్సెస్ అయినా, దేవర సినిమా క్రిటిక్స్‌కు అంతగా నచ్చలేదని సమాచారం. అభిమానులు క్రిటిక్స్‌పై విరుచుకుపడుతూ, సినిమా బాగా వసూలు చేసిందని వాదించారు. నిజంగా సినిమా అద్భుతం అనిపిస్తే, కొరటాల శివ వెంటనే దేవర 2 స్క్రిప్ట్‌కు శ్రీకారం చుట్టాలి. కనీసం ఒక సినిమా గ్యాప్ తర్వాత అయినా ఎన్టీఆర్ దేవర 2 చేయాలి కదా?

అభిమానుల మాట ప్రకారం దేవర సినిమా బ్లాక్‌బస్టర్. మరి అలాంటి సినిమాకు సీక్వెల్ చేయకపోతే ఎలా? కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఎన్టీఆర్ దేవర సీక్వెల్‌పై దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. అదృష్టవశాత్తు కమర్షియల్‌గా పాస్ అయినందున, మళ్లీ కొరటాలతో ఆ సీక్వెల్ రిస్క్ వద్దు అన్నది ఎన్టీఆర్ ఆలోచనగా భావిస్తున్నారు.

ఇక పుష్ప 3 విషయానికి వస్తే… బన్నీ తలుచుకుంటే తప్ప ఆ సీక్వెల్ కూడా ఉండకపోవచ్చు. పుష్ప ఫ్రాంచైజీ బ్లాక్‌బస్టర్‌గా మరోసారి నిరూపితమైంది. కానీ పుష్ప 1కు తెలుగు నాట పూర్తిగా ఆదరణ రాలేదు. నార్త్ బెల్ట్‌లో డబ్బులు బాగా వచ్చాయి. అందుకే వెంటనే పుష్ప 2 చేశారు.

ఇప్పుడు పుష్ప 2 తెలుగు ప్రేక్షకులలో ఎలాంటి ఫలితం సాధిస్తుందో అనేది వేచి చూడాల్సి ఉంది. దేవర సినిమాలాగే పుష్ప 2కి కూడా అన్ని వైపుల నుంచి సమానమైన ప్రశంసలు రాలేదని తెలుస్తోంది. అందువల్ల పుష్ప 3 విషయంలో బన్నీ ఆలోచనలు ఎలా ఉంటాయో చూడాలి. సుకుమార్ మంచి స్క్రిప్ట్‌తో రెడీ అయితేనే అది సాధ్యం.

మొత్తం చూస్తే, ఇప్పట్లో దేవర 2 మరియు పుష్ప 3 రావడం కష్టమే. 2026 లేదా 2027 తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయి.

22 Replies to “దేవర 2… పుష్ప 3… వుంటాయా?”

  1. ఈ వెబ్ సైట్ వాడు,

    వాడి కులానికి అండగా నిలిచినందుకు,

    అల్లు అర్జున్ గురించి రోజుకి 100 ఆర్టికల్స్ రాసి లేపుతాడు.

    మరి పిచ్చి జనాలు, ఫ్యామిలీ కి 1500 పెట్టి ఎందుకు వెళ్ళాలి?

    మంచి డ్రెస్ ఒకటి కొనిపెడితే, మా నాన్న హీరో అని పిల్లాడు చెప్పుకుంటాడు.. ఎవడో బొక్క గాడి బానిస అని ప్రూవ్ చేసుకోవడానికి డబ్బు ఖర్చు చేస్తే మీ ఇష్టం.

    ఈ రికార్డు కొట్టడానికి రేపు ఇంకో బొక్క గాడి సినిమా కి 400 టికెట్ పెడతారు

  2. జనాలంతా electric cars కోసం, humanoid robots కోసం ఎదురు చూస్తోంటే వెధవతనంగా ఈ దిక్కుమాలిన cinemax ల sequels కోసం ఎదురు చూస్తున్నాడు.

    అయినా వేయి కోట్ల budget తో Cinemax కు తీసే సత్తా ఉన్న భారతీయ దర్శకులు మరి lion king, Moana వంటి పిల్లల cinemax లు తీసి ప్రపంచాన్ని మెప్పించొచ్చుగా. అది చేతగాదు.

    ‘ఒక సోంబేరి హీరో ఉంటాడు. వాడికి లంకె బిందె దొరుకుతుంది. లేదా సంద్రంలో వందల ఏళ్ల క్రితం మునిగిన ఓడలో బంగారపు నిధి దొరుకుతుంది. లేదా ఎడారిలో crude oil బావి దొరుకుతుంది. మరేదో సహజ వనరు అక్రమంగా దొరుకుతుంది.’ అని ఒక కథ అనుకోని దానికి అడ్డమైన elevations ఇచ్చుకుంటే వెర్రి ముఖాలేసుకొని జనాలు వేలంవెర్రిగా చూస్తారు (ఆ లేకిc బుధులు విదేశాలకు పోయినా పోవు)

  3. జనాలంతా electricc carss కోసం, humanoidd robotss కోసం ఎదురు చూస్తోంటే వెధవxతనంగా ఈ దిక్కుxమాలిన cinemax ల sequelss కోసం ఎదురు చూస్తున్నాడు.

    అయినా వేయి కోట్ల budgett తో Cinemax కు తీసే సత్తా ఉన్న భారతీయ దర్శకులు మరి lionn kingg, Moanax వంటి పిల్లల cinemax లు తీసి ప్రపంచాన్ని మెప్పించొచ్చుగా. అది చేతగాదు.

    ‘ఒక సోంxబేరి హీxరో ఉంటాడు. వాడికి లంకె బింxదె దొరుకుతుంది. లేదా సంద్రంలో వందల ఏళ్ల క్రితం మునిగిన ఓడలో బంగారపు నిధి దొరుకుతుంది. లేదా ఎడారిలో crudex oill బావి దొరుకుతుంది. మరేదో సహజ వనరు అxక్రమంగా దొరుకుతుంది.’ అని ఒక కథ అనుకోని దానికి అడ్డxమైన elevationsx ఇచ్చుకుంటే వెర్రి ముఖాలేసుకొని జనాలు వేలంవెర్రిగా చూస్తారు (ఆ లేకిc బుధులు విదేశాలకు పోయినా పోవు)

  4. జనాలంతా electricc carss కోసం, humanoidd robotss కోసం ఎదురు చూస్తోంటే వెధవxతనంగా ఈ దిక్కుxమాలిన cinemax ల sequelss కోసం ఎదురు చూస్తున్నాడు.

  5. D f cxvvvvజనాలంతా electricc carss కోసం, humanoidd robotss కోసం ఎదురు చూస్తోంటే వెధవxతనంగా ఈ దిక్కుxమాలిన cinemax ల sequelss కోసం ఎదురు చూస్తున్నాడు.

  6. అల్లు అర్జున్ నట విశ్వరూపం 💫💫🔥🔥

    ఇండియన్ ఇండస్ట్రీ హిట్ పుష్ప2🔥🔥🔥🔥🔥🔥💫💫💫

    అల్లు అర్జున్ భాయ్& సుక్కు బాయిల మనసు చాలా గొప్పది 😍 😍

    అందుకే మీకు ఇండియా గర్వించేస్తాయి దక్కింది పుష్ప-2 🔥🔥🔥 ద్వారా

Comments are closed.