పార్టీని ఆమె మర్చిపోయింది.. లీడర్లు ఆమెను మర్చిపోయారు

విజయశాంతి అలియాస్ రాములమ్మ కాంగ్రెస్ పార్టీని మర్చిపోయింది. పార్టీ నాయకులు ఆమెను మర్చిపోయారు.

విజయశాంతి అలియాస్ రాములమ్మ కాంగ్రెస్ పార్టీని మర్చిపోయింది. పార్టీ నాయకులు ఆమెను మర్చిపోయారు. ఆమెతో ఎవరూ టచ్ లో లేరు. ఏ కార్యక్రమానికి ఆమెకు ఆహ్వానం లేదు. ఆమె పార్టీలో ఉందా లేదా అర్థం కావడంలేదు.

రాజకీయ నాయకులు ఎక్కువమంది పార్టీలు మారడం సహజం. అలా మారడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే పార్టీలు మారి కొందరు నాయకులు అందలాలు ఎక్కుతారు. కొందరు పాతాళానికి పడిపోతారు. పార్టీ మారి అందలం ఎక్కినవారిలో ప్రస్తుత ఉదాహరణగా సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుకోవచ్చు. పార్టీలు మారి రాజకీయ అధ్యాయం ముగించుకున్నవారిలో విజయశాంతి అలియాస్ రాములమ్మను చెప్పుకోవచ్చు.

ఆమె రాజకీయ జీవితం ముగిసిపోవడానికి పార్టీలు మారడమే కారణమా అంటే కొందరు విశ్లేషకులు అవుననే అంటున్నారు. అనారోగ్యం కారణంగా పాలిటిక్స్ కు దూరంగా ఉందని కొందరు చెబుతున్నారు. కారణం ఏదైనా ఆమె మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్న మాట వాస్తవం.

సినిమా కెరీర్ పీక్స్ లో ఉన్న దశలోనే రాజకీయాల్లో ప్రవేశించింది. బీజేపీలో చేరింది. ఆ పార్టీ కూడా సముచిత స్థానం ఇచ్చింది. తరువాత కమలం పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టింది. తరువాత దాన్ని అప్పటి టీఆర్ఎస్ లో విలీనం చేసింది. కేసీఆర్ ఆమెను చెల్లిగా గౌరవించాడు. మెదక్ ఎంపీగా గెలిచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇద్దరే గులాబీ పార్టీ ఎంపీలు. ఒకరు విజయశాంతి కాగా మరొకరు కేసీఆర్.

కానీ ఈ తరువాత జరిగిన పరిణామాల్లో కేసీఆర్ ఆమెను పక్కకు పెట్టాడు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరింది. అక్కడ ప్రాధాన్యం ఇచ్చారు. 2018 ఎన్నికల్లో పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలు కూడా అప్పగించారు. మెదక్ అసెంబ్లీ టికెట్ ఇస్తే ఓడిపోయింది. అప్పట్లో కాంగ్రెస్ నాయకులను ముప్పుతిప్పలు పెట్టిందంటారు. వాళ్ళు అనేకసార్లు బతిమాలి పార్టీ ప్రచారానికి రప్పించాల్సి వచ్చిందట.

ఎందుకో కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోయింది. తరువాత మళ్ళీ బీజేపీలో చేరింది. జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా పదవి ఇచ్చారు. కానీ అక్కడా అసంతృప్తే. మునుగోడు ఉపఎన్నిక ముగిశాక కాంగ్రెస్ పార్టీలో చేరింది. అసెంబ్లీ ఎన్నికల్లోగానీ , పార్లమెంటు ఎన్నికల్లోగానీ ఆమెకు టిక్కెట్ ఇవ్వలేదు. ఏ ఎన్నికల్లోనూ ఆమె ప్రచారం చేయలేదు.

అప్పటి నించి సైలెంట్ అయిపొయింది. మధ్యలో ఒకటి రెండుసార్లు గులాబీ పార్టీలు సపోర్ట్ చేస్తూ మాట్లాడినట్లు గుర్తు. కాంగ్రెస్ పార్టీపై పాజిటివ్ గానీ, నెగెటివ్ గా కానీ కామెంట్స్ చేయడంలేదు. అసలు రాజకీయాలు, దేశ సమస్యలు, రాష్ట్ర సమస్యలు …ఏవీ మాట్లాడటంలేదు. బంధం తెగిపోయినట్లే.

7 Replies to “పార్టీని ఆమె మర్చిపోయింది.. లీడర్లు ఆమెను మర్చిపోయారు”

  1. Aame ku vayasu vachina brain inka mature kaledu. Edo oka party lo unte samuchitha gouravam undedi. Aavida garu party lo cheragane CM post icheyalante ela? State lo unna anni party lu ayipoyayi aakhariki sontha party petti adi kuda Trs lo kalipesindi. Ippudu aavidani ye party cherchukodu. Cinema lu elagu levu. Personal ga family ledu. Eko Niranjan.

  2. Aame ku vayasu vachina brain inka mature kaledu. Edo oka party lo unte samuchitha gouravam undedi. Aavida garu party lo cheragane CM post icheyalante ela? State lo unna anni party lu ayipoyayi aakhariki sontha party petti adi kuda Trs lo kalipesindi. Ippudu aavidani ye party cherchukodu. Cinema lu elagu levu. Personal ga family ledu. Eko Niranjan.

  3. Aame ku vayasu vachina brain inka mature kaledu. Edo oka party lo unte samuchitha gouravam undedi. Aavida garu party lo cheragane CM post icheyalante ela? State lo unna anni party lu ayipoyayi aakhariki sontha party petti adi kuda Trs lo kalipesindi. Ippudu aavidani ye party cherchukodu. Cinema lu elagu levu. Personal ga family ledu. Eko Niranjan.

  4. ఆమె పేరులోనే శాంతి ఉంది. కానీ రాజకీయ జీవితమంతా అశాంతి, అసంతృప్తి తోనే ఉంది

Comments are closed.