బన్నీ అరెస్ట్.. పవన్ ట్వీట్

ఓవైపు బన్నీ అరెస్ట్ పై ప్రతి నిమిషం అప్ డేట్స్ వస్తుంటే, మరోవైపు సరిగ్గా నిమిషాల వ్యవథిలో పవన్ కల్యాణ్ వేసిన ట్వీట్ ను కొంతమంది హైలెట్ చేస్తున్నారు.

సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి కిందట అతడ్ని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం అరెస్ట్ ఫార్మాలిటీస్ జరుగుతున్నాయి. మరోవైపు అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్ పై లంచ్ మోషన్ విచారణ జరపాలని లాయర్లు మరో పిటిషన్ వేశారు. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు. మరికాసేపట్లో దీనిపై తీర్పు రాబోతోంది.

ఓవైపు బన్నీ అరెస్ట్ పై ప్రతి నిమిషం అప్ డేట్స్ వస్తుంటే, మరోవైపు సరిగ్గా నిమిషాల వ్యవథిలో పవన్ కల్యాణ్ వేసిన ట్వీట్ ను కొంతమంది హైలెట్ చేస్తున్నారు.

“కలిసుంటే నిలబడతాం.. విడిపోతే పడిపోతాం” అనే కొటేషన్ ను ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్. నిజానికి ఆయన ఈ కొటేషన్ పెట్టిన సందర్భం వేరు. “ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా కనీసం రెండున్నర దశాబ్దాల పాటు రాజకీయ స్థిరత్వం అవసరం. మనం కులాల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోతే సాదించలేం. ప్రతీ ఒక్కరూ అర్దం చేసుకుని విభేదాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.” అనేది దానికి కొనసాగింపుగా ఆయన పెట్టిన పోస్టు.

కానీ అంతలోనే కొంతమంది ఈ ట్వీట్ ను, బన్నీ అరెస్ట్ కు లింక్ చేస్తూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఏపీ ఎన్నికల టైమ్ లో పవన్ కల్యాణ్, జనసేన పార్టీని కాదని.. వైసీపీ అభ్యర్థి కోసం ప్రచారం చేశాడు బన్నీ. అలా మెగాకాంపౌండ్ నుంచి విడిగా వైసీపీ వైపు వెళ్లడం వల్ల, ఇలాంటి టైమ్ లో అతడికి మద్దతు కరువైందంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. పవన్ కూడా అదే ఉద్దేశంతో పోస్టు పెట్టారని చెప్పుకొచ్చారు. కానీ పవన్ ట్వీట్ పెట్టిన సందర్భం పూర్తిగా వేరు.

తెరపైకి పోలీస్ స్టేషన్ ఎపిసోడ్..

పుష్ప-2 సినిమా ప్రారంభంలోనే పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ ఉంటుంది. అరెస్టయిన తన మనుషుల్ని విడిపించుకునేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు పుష్పరాజ్. ఏకంగా పోలీస్ స్టేషన్ నే కొనేస్తాడు. పోలీసులందరికీ భారీగా డబ్బులిచ్చి వాళ్లందరితో వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పిస్తాడు. ఇప్పుడు నిజజీవితంలో కూడా అల్లు అర్జున్ కు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వచ్చింది. దీంతో పుష్ప-2 పోలీస్ స్టేషన్ సన్నివేశాన్ని చాలామంది గుర్తుచేసుకుంటున్నారు.

ఇక అరెస్ట్ కు సంబంధించి అప్ డేట్స్ విషయానికొస్తే.. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన విషయాన్ని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నిర్థారించారు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు రావడం వల్లనే తొక్కిసలాట జరిగిందన్నారు ఆనంద్. బన్నీని కోర్టులో హాజరుపరుస్తామంటున్నారు.

అటు విషయం తెలుసుకున్న చిరంజీవి, తన షూటింగ్ రద్దు చేసుకొని హుటాహుటిన పోలీస్ స్టేషన్ కు బయల్దేరారు. నిర్మాత దిల్ రాజు, ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ కు ఆదేశిస్తే మాత్రం, ఆదివారం బన్నీ జైలులో గడపాల్సి ఉంటుంది.

5 Replies to “బన్నీ అరెస్ట్.. పవన్ ట్వీట్”

  1. జగన్ మీద న్యూస్ లేక అల్లాడుతున్న ga కి ఇంక పండగే. నిస్తేజంగా ఉన్న సైట్ లో ఇంక వీళ్ళ ఫ్యామిలీ మీద వార్తల వరద పారిస్తాడు.

  2. మొన్న మోహన్ బాబు మీద కూడా ఇష్టం వచ్చినట్టు బోలెడు సెక్షన్స్ కింద కేసులు వేశారు…నాకు తెలిసి దీనివెనుక సిబిఎన్ హస్తం ఉంది. ఎందుకంటే మోహన్ బాబుకు సిబిఎన్ కి మధ్య పాత కోపాలు తాపాలు చాలా ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ ని ఇలా అరెస్టు చేయడం ఎలా 14 రోజులు రిమాండా..? ఏమిటో మరి. అసలు రేవంత్ రెడ్డి సర్కారు నిజంగా చెత్త సర్కారు.

  3. ఆ కొంతమంది అంటే మరెవరో కాదు GA గారు మరియు మన పార్టీ ప్రభుద్దులే అయ్యుంటారు

Comments are closed.