అవంతి సాకులు అతకలేదు!

చాలా కాలంగా పార్టీని వీడాలని నిర్ణయించుకొని చివరికి అవంతి ఈ సాకులతో పార్టీకి దూరం కావడం, అయితే జనాలకు అంత సమంజసంగా ఉండడం లేదని అంటున్నారు.

కొత్తగా కూటమి ప్రభుత్వం ఆంధ్రాలో అధికారంలోకి వచ్చింది. ప్రజలు అయిదేళ్ల పాటు పాలించమని అధికారం ఇచ్చారని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆరు నెలల వ్యవధిలోనే టీడీపీ కూటమి ప్రభుత్వం మీద నిరసనలు తగవని ఆయన చెబుతూ, అందుకే తాను పార్టీని వీడుతున్నాను అని చెప్పారు.

వైసీపీని వీడేందుకు ఈ మాజీ మంత్రి ఎంచుకున్న సాకులు అతికినట్లుగా లేవని అంటున్నారు. ఎందుకంటే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నెల నెలాల వ్యవధిలోనే టీడీపీ పోరాటాలకు సిద్ధమైంది అని గుర్తు చేస్తున్నారు.

అంతే కాదు, మూడు నెలలు కాకుండా విశాఖలో భవన నిర్మాణాల కార్మికులతో లాంగ్ మార్చ్ అంటూ పవన్ కళ్యాణ్ ఆనాడు ఆందోళనలు చేపట్టారని అంటున్నారు. అప్పుడే వైసీపీ ప్రభుత్వానికి 151 సీట్లు వచ్చాయి, అయిదేళ్లూ పాలించమనే జనాలు అధికారం ఇచ్చారన్నది గుర్తుకు రాలేదా అని అంటున్నారు.

చాలా కాలంగా పార్టీని వీడాలని నిర్ణయించుకొని చివరికి అవంతి ఈ సాకులతో పార్టీకి దూరం కావడం, అయితే జనాలకు అంత సమంజసంగా ఉండడం లేదని అంటున్నారు. ఎవరైనా ఏ పార్టీలో అయినా ఉండవచ్చు, వెళ్ళిపోవచ్చు. అది వారి ఇష్టం. కానీ వారు పార్టీని వీడేటపుడు లేదా వేరే పార్టీలో చేరేటప్పుడు ఇచ్చే ప్రకటనలే జనాలు చూస్తారు.

అవి సహేతుకంగా లేకపోతే, వారికే రాజకీయంగా ఇబ్బంది అవుతుందని అంటున్నారు. తన పదిహేనేళ్ల రాజకీయ జీవితంలో ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఇలా నాలుగు పార్టీలు మార్చి అయిదవ పార్టీ కోసం చూస్తున్న అవంతి శ్రీనివాస్ కి వైసీపీ విధానాలు, జగన్ ఏకపక్ష పాలన అధికారంలో ఉన్నపుడు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించేవారే ఎక్కువగా ఉన్నారు.

5 Replies to “అవంతి సాకులు అతకలేదు!”

  1. పొని.. జగన్ అతి మంచితనం అతి నీజాయితీ వల్లె వెల్లిపొతున్నను అని చెపుతాడులె!

    1. నువ్వు నాకు నచ్చావ్ సినిమా లో చంద్ర మోహన్ గారు అంటారు నిన్న రాసిన లెటర్ అంతా తప్పు మా వాడు చాలా మంచోడు అని మళ్ళీ rayamantava అని

  2. అప్పుడు ఇచ్చిన 151 ప్రజా తీర్పు అయినప్పుడు ఇప్పుడు ఇచ్చిన 11 కూడా ప్రజా తీర్పు అవుతుంది ఈ ఐదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఉండమని తీర్పు ఇచ్చారని చెబుతున్నారు అంతే కదా..

Comments are closed.