అల్లు అర్జున్ వెర్షన్ మారిందా..?

థియేటర్ కు వెళ్లినప్పుడు ప్రొసీజర్ ఫాలో అయ్యారా.. పోలీసులకు సమాచారం ఇచ్చారా అనే ప్రశ్నలకు సమాధానం దాటేశాడు అల్లు అర్జున్.

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి నమోదైన కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు నిన్న అరెస్ట్ చేయడం, ఆయన ఈరోజు ఉదయం బెయిల్ పై విడుదలవ్వడం కూడా తెలిసిందే.

అయితే తొక్కిసలాట ఘటనపై బెయిల్ పై బయటకొచ్చిన తర్వాత అల్లు అర్జున్ మాట్లాడిన మాటల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా బాధితుడు చెబుతున్న వెర్షన్ కు, అల్లు అర్జున్ తాజా స్టేట్ మెంట్ కు పొంతన కుదరడం లేదు.

ఈరోజు పొద్దున్నుంచి 2 సార్లు మీడియా ముందుకొచ్చాడు అల్లు అర్జున్. తాజాగా మరోసారి మీడియా ముందుకొచ్చాడు. జాతీయ మీడియాను కూడా ఆహ్వానించి ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ మీడియా సమావేశంలో తొక్కిసలాట ఘటనపై మరోసారి స్పందించాడు. ప్రమాదం జరిగినప్పుడు తను థియేటర్ లోపల సినిమా చూస్తున్నాననే అర్థం వచ్చేలా మాట్లాడాడు బన్నీ.

“నేను నా కుటుంబంతో థియేటర్ లోపల ఉన్నాను. సినిమా చూస్తున్నాను. యాక్సిడెంట్ బయట జరిగింది. ఆ ఘటనతో నాకు ఎలాంటి డైరక్ట్ కనెక్షన్ లేదు. ఇది పూర్తిగా యాక్సిడెంటల్ గా జరిగిన ఘటన. నేను ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు.”

ఇది అల్లు అర్జున్ తాజా స్టేట్ మెంట్. కొన్ని రోజుల కిందట బాధితుడు ఇచ్చిన స్టేట్ మెంట్ మరోలా ఉంది. బన్నీ రావడం వల్లనే తొక్కిసలాటి జరిగిందని చెబుతున్నాడు బాధితుడు, మృతురాలి భర్త భాస్కర్.

“థియేటర్ లోపలకు వెళ్దామని రెడీ అయ్యాం. అల్లు అర్జున్ అప్పుడే వచ్చాడు. దాంతో పబ్లిక్ జామ్ అయిపోయారు. మా భార్య, బాబు కొంచెం ముందుకెళ్లారు. నేను, పాప పక్కకు ఉండిపోయాం. కాల్ చేస్తే లోపలే ఉన్నామని చెప్పారు. కాసేపటి తర్వాత కాల్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. నా భార్య చనిపోయిందని ఆ తర్వాత పోలీసులు చెప్పారు.”

తను కుటుంబంతో కలిసి సంథ్య థియేటర్ లోపల సినిమా చూస్తుంటే, ఘటన బయట జరిగిందని బన్నీ చెబుతున్నాడు. బాధితుడు భాస్కర్ మాత్రం అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగి తన భార్య చనిపోయిందని చెబుతున్నాడు. ఇదే విషయం ఎఫ్ఐఆర్ లో కూడా నమోదుచేశారు పోలీసులు.

జరిగిన ఘటనపై మరోసారి విచారం వ్యక్తం చేశాడు బన్నీ. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని పదేపదే ప్రకటించాడు. తను 20 ఏళ్లుగా థియేటర్ కు వెళ్తున్నానని, ఇప్పటివరకు 30 సార్లు వెళ్లి ఉంటానని, ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని అన్నాడు.

థియేటర్ కు వెళ్లినప్పుడు ప్రొసీజర్ ఫాలో అయ్యారా.. పోలీసులకు సమాచారం ఇచ్చారా అనే ప్రశ్నలకు సమాధానం దాటేశాడు అల్లు అర్జున్. తను లోతుగా వివరాల్లోకి వెళ్లనని, కేసు కోర్టు పరిథిలో ఉంది కాబట్టి ఇంతకుమించి ఎక్కువ మాట్లాడనని అన్నాడు. త్వరలోనే బాధిత కుటుంబాన్ని కలుస్తానని తెలిపాడు.

5 Replies to “అల్లు అర్జున్ వెర్షన్ మారిందా..?”

  1. ఎంత సమర్దించుకున్నా, ఎంతో కొంత irresponsibility అయితే వుంది. అది జైలు లో పెట్టే అంత పెద్దదా అన్నది లీగల్ విషయం. ఇది తప్పకుండా భవిష్యత్తు లో ఇలాంటి ఘటన లు మరే హీరో విషయం లో జరగకుండా ఆపుతుందని ఆశిద్దాం

  2. why is he wearing that icon star t-shirt.? why this self dabba when ur movies getting great success.Be humble. Have we seen prabhas wearing rebel star or other heros wearing like this ?

Comments are closed.