కూట‌మిలో ఉన్నోళ్ల‌కే దిక్కులేదు.. కొత్త‌గా వ‌చ్చే వాళ్ల‌కు?

అధికారం ఎక్క‌డుంటే, అక్క‌డ వాలిపోయేవాళ్లు ఉన్నారు. అధికార ల‌క్ష‌ణ‌మ‌దే. అధికారం అనేది అయ‌స్కాంతంలా ఆక‌ర్షిస్తూ వుంటుంది.

అధికారం ఎక్క‌డుంటే, అక్క‌డ వాలిపోయేవాళ్లు ఉన్నారు. అధికార ల‌క్ష‌ణ‌మ‌దే. అధికారం అనేది అయ‌స్కాంతంలా ఆక‌ర్షిస్తూ వుంటుంది. మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ప్ర‌తిప‌క్షంలో వుంటూ పోరాటాలు చేయ‌డానికి మెజార్టీ నాయ‌కులు ఇష్ట‌ప‌డడం లేదు. ఎందుకంటే రాజ‌కీయాల్లోకి వ్యాపారులు రావ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణం. లాభ‌న‌ష్టాలు బేరీజు వేసుకునే వాళ్లు సొంత ప్ర‌యోజ‌నాలు త‌ప్ప‌, సామాజిక కోణంలో ఆలోచించే ప‌రిస్థితి వుండ‌దు.

ఈ నేప‌థ్యంలో కూట‌మి పార్టీల్లో కొంద‌రు చేరుతున్నారు. కొత్త‌గా త‌మ పార్టీల్లో చేరుతున్న నాయ‌కుల్ని చూసి, పాత‌వాళ్లు న‌వ్వుకుంటున్నారు. ఎప్ప‌టి నుంచి వుంటున్న త‌మ‌కే దిక్కు లేక‌పోతే, కొత్త‌గా వ‌చ్చి ఏం సాధిస్తార‌నేది వారి భావ‌న‌. అధికార పార్టీలో వుంటే, ఆర్థికంగా ల‌బ్ధి పొందొచ్చ‌నే ఏకైక కార‌ణంతోనే అటుగా వెళుతున్నార‌నేది వాస్త‌వం. అయితే కూట‌మి ప్ర‌భుత్వ ఖ‌జానాలో ల‌బ్ధి పొంద‌డానికి చిల్లి గ‌వ్వ కూడా లేదు.

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి ఎక్క‌డెక్క‌డ ఆదాయం వుందా? అని భూతద్దం పెట్టి మరీ వెతుక్కుంటున్నారు. ఇసుక‌, మ‌ట్టి, భూముల‌ను దోచుకునే వాళ్లు మిన‌హాయిస్తే, చిన్నాచిత‌కా నాయ‌కుల‌కు ఆ అవ‌కాశం వుండ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యేలే మొత్తం ఆదాయం త‌మ‌కే కావాల‌ని అంటున్నారు. సొంత పార్టీ వాళ్ల‌కు సైతం ప‌ది రూపాయ‌లు ల‌బ్ధి క‌లిగిస్తామ‌నే ధ్యాసే కొర‌వ‌డింది.

దీంతో టీడీపీ, జ‌న‌సేన ద్వితీయ శ్రేణి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో కొంద‌రు మున్సిప‌ల్ వార్డు స‌భ్యులు, కార్పొరేట‌ర్లు, మాజీ ఎమ్మెల్యేలు త‌దిత‌రులు అధికార పార్టీల్లో చేర‌డానికి ఉత్సాహం చూపుతున్నారు. అంద‌రికీ కండువాలు క‌ప్పే వ‌ర‌కూ బాగా మాట్లాడుతున్నారు. ఆ త‌ర్వాత అస‌లు సినిమా మొద‌ల‌వుతోంది. ప‌ట్టించుకునే దిక్కులేద‌ని కూట‌మి పార్టీల్లో చేరిన వాళ్లు వాపోతున్నారు. ఏవేవో ఊహించుకుని అధికార కూట‌మి నీడ‌న చేరుకుంటే, చివ‌రికి ఏమీ అయ్యేలా క‌నిపించ‌డం లేదనే వాళ్లే ఎక్కువ‌.

10 Replies to “కూట‌మిలో ఉన్నోళ్ల‌కే దిక్కులేదు.. కొత్త‌గా వ‌చ్చే వాళ్ల‌కు?”

  1. ఎప్పటినుండో ఉన్న మర్రి రాజశేఖర్ సీట్ కొత్తగా వచ్చిన రజినీ తన్నుకుపోలా? పైగా మంత్రి కూడా అయిపాయె

    1. మర్రి కూడా ఏదో ఒక్కసారి MLA అయ్యాడు..అతని కి అంత సీన్ లేదు..రజిని ని గుంటూరు కి పంపితే మర్రికి టికెట్ ఇవ్వకుండా ఎవడో బు..క్కా పకీర్ గాడికి సీట్ ఇచ్చారు అక్కడ….వాడు మున్సిపాలిటీ కి ఎక్కువ..కార్పొరేషన్ కి తక్కువ..35000 తేడాతో ఒడినట్లు న్నాడు..టీడీపీ కూడా ఎవరైనా యంగ్ ఫేస్ కి టికెట్ ఇచ్చింటే గాజువాక,భీమిలి,మంగళగిరి తరవాత పేట మెజారిటీ వుండేది.

  2. ఎప్పటినుండో ఉన్నవాళ్లను కాదని కేశినేని నాని విజయవాడ పార్లమెంట్ సీట్ కొట్టేయాలా?

  3. వాడేదో జనవరి నుండి తీర్థ యాత్రలు కి బయల్దేరుతాను అంటున్నాడుగా.. మింగేసిన కూసిన్ని డబ్బులు వాడి జీవాన పోయటం ఎందుకని పార్టీ లు మారి గమ్ముగా కూర్చోవటం మంచిది కాదా అని!!

Comments are closed.