విశాఖ జిల్లాలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన 2019 ఎన్నికల ముందు పార్టీలో చేరారు. పార్టీ ఓటమి తరువాత వెళ్ళిపోయారు అని వైసీపీ నేతలు అంటున్నారు. భీమునిపట్నంలో అధినాయకత్వం ఎవరిని ఇంచార్జిగా చేయాలి అన్నది ఆలోచిస్తున్న తరుణంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అవంతి గుడివాడ గుడివాడ అమర్నాథ్ భీమిలీ మీద మనసు పడుతున్నారు అని ప్రచారం సాగుతోంది.
ఈ మాజీ మంత్రి 2024 ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓటమి చూశారు. ఆయన 2019లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మంత్రి కూడా అయ్యారు. 2014 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.
గుడివాడ సొంత నియోజకవర్గం గాజువాక అనే చెప్పాలి. అయితే ఆయన ఎంపీ ఎమ్మెల్యేగా మొదట్లో పోటీ చేసింది అనకాపల్లి కావడంతో నియోజకవర్గానికి అలా దూరం అయ్యారు. దాని ప్రభావం 2024 ఎన్నికల్లో కనిపించింది.
గాజువాకలో తిప్పల నాగిరెడ్డి కుటుంబం పట్టు సాధించింది. వచ్చే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి కుమారుడు పోటీ చేస్తారు అని అంటున్నారు. దాంతో గుడివాడ కూడా తనకంటూ ఒక పర్మనెంట్ సీటు ఉండాలని చూస్తున్నారు. భీమిలీ సీటు ఆయనకు అలా అనుకోని విధంగా కలిసి వచ్చింది అని అంటున్నారు.
అవంతి రాజీనామా చేయడంతో వైసీపీ అధినాయకత్వానికి గుడివాడ సరైన వారుగా కనిపిస్తున్నారు. బలమైన కాపు సామాజిక వర్గం అక్కడ ఉంది. అదే సామాజిక వర్గానికి చెందిన గుడివాడకు ఇక్కడ రాజకీయంగా కలసివస్తుందని భావిస్తున్నారు. ఆయన తండ్రి గుడివాడ గురునాధరావు గతంలో పెందుర్తి ఎమ్మెల్యేగా పనిచేసినపుడు ఆ పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాలు ఇపుడు భీమిలీలో కలసి ఉన్నాయి.
అలా తండ్రి వైపు ఉన్న పలుకుబడి కూడా తనకు అనుకూలిస్తుందని ఏ పేచీ లేకుండా భీమిలీ నుంచే రానున్న ఎన్నికల్లో పోటీకి దిగవచ్చు అన్నది గుడివాడ ఆలోచనగా ఉంది అంటున్నారు. మంచి రోజు చూసి భీమిలీ ఇంచార్జిగా గుడివాడ పేరుని అధినాయకత్వం ప్రకటిస్తుందని, అధికారికంగా భీమిలీ నుంచి తన రాజకీయ కార్యక్రమాలు ప్రారంభించాలని గుడివాడ భావిస్తున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది.
ఈ కొడుగుడ్దు రాష్త్రం లొ ఎక్కడ నుంచున్నా గెలవడు!
ఏదో మనసు పడ్డాను గానీ.. ఎంతో అలసు అయ్యను కానీ