పేర్ని గోడౌన్‌లో రేషన్‌బియ్యం మాయం కావడంపై మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానసతేజపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వాళ్లిద్దరు అజ్ఞాతంలో ఉన్నారు. పేర్ని నాని కూడా వారం పాటు ఎవరికీ కనిపించలేదు. ఆ తర్వాత ఆయన ఇంటికొచ్చారు. పేర్ని కుటుంబ సభ్యులు అరెస్ట్ కాకుండా టీడీపీ నేతలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని రాజకీయం చేస్తున్నారనే విమర్శలున్నాయి.
టీడీపీ నేతలే దగ్గరుండి పేర్ని జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శిని ఎక్కడికో సాగనంపారనే ఆరోపణలు లేకపోలేదు. ఈ విషయమై సీఎం చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యినట్టు ప్రచారం జరుగుతోంది. కృష్ణా జిల్లా టీడీపీ నేతలపై చంద్రబాబు సీరియస్ కావడంతో, తమకు పేర్నికి ఎలాంటి రాజకీయ అవగాహన లేదని చెప్పుకునేందుకు తాజాగా తండ్రీకొడుకులు పేర్ని నాని, కిట్టులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇవాళ మధ్యాహ్నం లోపు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి రేషన్ బియ్యం మాయంపై వివరణ ఇవ్వాలని, మీ దగ్గరున్న రికార్డులు సమర్పించాలని ఆ నోటీసుల్లో పేర్కొనడం గమనార్హం. అసలు సంబంధమే లేని పేర్ని నాని, కిట్టులకు నోటీసులు ఇవ్వడం ఏంటనే ప్రశ్న వైసీపీ నుంచి వస్తోంది.
మరోవైపు మాయమైన బియ్యానికి ఇప్పటికే రూ.1,70 కోట్లు పేర్ని కుటుంబం చెల్లించింది. ఇక కేసు ఏముందనే చర్చ జరుగుతోంది. కేవలం పేర్ని కుటుంబంతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని చంద్రబాబు వద్ద నిరూపించుకోడానికే తాజాగా పేర్ని నాని, ఆయన కొడుకుకు నోటీసులు ఇప్పించారని పలువురు అంటున్నారు.
Lopala veyyali biyyam donga
మరి.. ఏలేరు.. కుంభకోణం నుండి.. మొన్న స్కిల్ కుంభకోణం వరకు.. అన్నింటికీ సూత్రధారి.. పాత్రధారి అయినా మన SkillD0n G@ బైయట ఉండచ్చా ఏంటే రంకు ప్రియా?
ఒకడు దొంగతనం చేసి దొరికిన తరువాత, డబ్బులు తిరుగిచ్చేస్తే case పెట్టకూడదా!!!
ante thappu chesi dabbu kattesthe case nundi escape ayipovachaa? idhi jaggadi govt kaadhu. GA venkat nuvvu inkaa aa trans lo vunnaav/