కూట‌మి స‌ర్కార్‌కు షాక్‌…!

విద్యుత్ చార్జీల పెంపును ఏ స్థాయిలో జ‌నం వ్య‌తిరేకిస్తున్నారో హాజ‌రైన ఆందోళ‌న‌కారులే నిద‌ర్శ‌నం.

కూట‌మి స‌ర్కార్‌కు తిరుప‌తి జ‌నం షాక్ ఇచ్చారు. తిరుప‌తిలో వైసీపీ 60 వేల‌కు పైగా తేడాతో కూట‌మి చేతిలో ఓడిపోయింది. అలాంటి తిరుప‌తి న‌గ‌రంలో విద్యుత్ స‌ర్దుబాబు చార్జీల పెంపును నిర‌సిస్తూ వైసీపీ నేతృత్వంలో చేప‌ట్టిన నిర‌స‌న ర్యాలీలో జ‌నం పోటెత్తారు. విద్యుత్ స‌ర్దుబాటు చార్జీల కింద రాష్ట్ర ప్ర‌జానీకంపై రూ.15 వేల కోట్ల‌కు పైగా భారం వేసి కూట‌మి స‌ర్కార్ షాక్ ఇచ్చింది.

ఇందుకు నిర‌సన‌గా వైసీపీ తిరుప‌తి ఇన్‌చార్జ్ భూమ‌న అభిన‌య్ నేతృత్వంలో చేప‌ట్టిన ర్యాలీలో వేలాది మంది పాల్గొని, ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను చాటిచెప్పి, గ‌ట్టి షాక్ ఇచ్చార‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఈ జ‌నాన్ని చూసి కూట‌మి స‌ర్కార్ అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది.

విద్యుత్ చార్జీల పెంపును ఏ స్థాయిలో జ‌నం వ్య‌తిరేకిస్తున్నారో హాజ‌రైన ఆందోళ‌న‌కారులే నిద‌ర్శ‌నం. కూట‌మి స‌ర్కార్ పాల‌న కేవ‌లం ఆరు నెల‌ల కాలాన్ని మాత్ర‌మే పూర్తి చేసుకుంది. ఇంత త‌క్కువ స‌మ‌యంలో చేప‌ట్టిన నిర‌స‌న‌లో వేలాదిగా పాల్గొన‌డం, అందులోనూ వైసీపీ భారీ తేడాతో ఓడిపోయిన తిరుప‌తిలో తీవ్ర‌స్థాయిలో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక ప్ర‌ద‌ర్శ‌న కూట‌మికి హెచ్చ‌రిక లాంటిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

తిరుప‌తిలో చేప‌ట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మంలో ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్ర‌మ‌ణ్యం, న‌గ‌ర మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష‌, కార్పొరేట‌ర్లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

12 Replies to “కూట‌మి స‌ర్కార్‌కు షాక్‌…!”

  1. Pawan will be CM if the same evms process next time too. Poor jagan. He is not understanding the reality. They are simply wasting time. No sixers, power bills high, huge debts, no employment, no roads…..but you will see people still like cbn. Reason…..that is the feel good cbn could give.

  2. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది మరి 15 వేలు లాస్ ఎవరి హయం లో వచ్చిందో ఎవరి నిర్వాకం మో ప్రజలకు తెలుసు అందరు వద్దన్నా విద్యుత్ కాంట్రాక్టు లు రద్దు తో ఏర్పడిన సంక్షోభం ప్రజల నెత్తిన పడింది జగన్ రెడ్డి గారి ఓటర్ లకు తెలియక పోవచ్చు కానీ ఈ నిర్వాకం ఎవరిదో కూటమి ఓటర్ లకు తెలుసు అందుకే ఇంటికి పంపించేరు

  3. లోకనాథరావు మాయమవడం: గ్రేట్ ఆంధ్రలో కులం, కలకలం, కుక్కనక్కలు!”

    లోకనాథరావు గారిని వెతుకుతూ గ్రేట్ ఆంధ్ర ఫ్యాన్స్ ఇప్పుడు ‘మిస్సింగ్ పర్సన్’ పోస్టర్లు వేసే స్థితికి చేరుకున్నారు. పూజారి కుటుంబం నుంచి వచ్చిన గౌరవనీయుడు, కానీ వెబ్‌సైట్‌లో మాత్రం కుల చర్చలకు కింగ్. “కాపు vs కమ్మ” అని కొత్త లీగ్ ప్రారంభించిన వ్యక్తి, ఈసారి తన అభిమానులను షాక్ ఇచ్చాడు – కనిపించడమే లేదు!

    మరి ఎక్కడికి వెళ్లారు? కొందరు అంటున్నారు “ఆన్‌లైన్ ఫైట్ ఫలితంగా రిటైర్మెంట్ తీసుకున్నారేమో,” మరి కొందరు అంటున్నారు “కుల చర్చల మోస్తున్న వెన్నునొప్పి పెరిగిందేమో!” అంతే కాకుండా, రఙ్గనాథ్, ఎప్పుడూ ఆయనకు మద్దతుగా ఉండేవారు, మరియు ఇదే దారిలో ఉన్న ఆయనకు లోకనాథరావు ఎక్కడున్నారో తెలుసోమో!

    అందరికీ స్పష్టమైన విషయం ఏమిటంటే, లోకనాథరావు గారి పిచ్చి వ్యాఖ్యల వల్ల గ్రేట్ ఆంధ్ర పాఠకులకు ఎంతో ‘ఫన్’ ఉండేది. అలాగైనా, లోకనాథరావు గారిని ఎవరు అయినా వెతికిపట్టి తెచ్చేయండి. కానీ ఈసారి, కులం గురించి కాదు, స్నేహం గురించి మాట్లాడే లీడర్‌గా కనిపించాలి. మరి ఆయన మళ్లీ తెరమీదకి రాగానే “లోకనాథరావు – ది రిటర్న్” అంటూ పెద్ద హిట్టు కొట్టే నమ్మకం ఉంది! 😄

Comments are closed.