రామ్ చరణ్.. 2 కాదు, 3 గెటప్స్

ప్రభాస్ పేరిట ఉన్న అతిపెద్ద కటౌట్ రికార్డ్ ను రామ్ చరణ్ బద్దలుకొట్టాడు.

గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్, 2 డిఫరెంట్ రోల్స్ పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. ఒక గెటప్ లో ఐఏఎస్ ఆఫీసర్ గా, మరో గెటప్ లో అప్పన్న పాత్రలో చరణ్ కనిపించబోతున్నాడు. ఈ రెండు పాత్రల్లో అప్పన్న పాత్ర టోటల్ సినిమాకు హైలెట్ అవుతుందంటూ ఇప్పటికే ఫీలర్లు వస్తున్నాయి.

అయితే సరిగ్గా విడుదలకు కొన్ని రోజుల ముందు మరో క్రేజీ మేటర్ బయటపెట్టాడు దర్శకుడు శంకర్. గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ గెటప్స్ 2 కాదు, 3 అంటున్నారు ఈ దర్శకుడు. ఐఏఎస్ ఆఫీసర్, అప్పన పాత్రతో పాటు.. కాలేజ్ స్టూడెంట్ గెటప్ కూడా ఉందని చెబుతున్నాడు. రఫ్ లుక్ లో, గడ్డం పెంచుకొని కాలేజీ స్టూడెంట్ గా కూడా చరణ్ కనిపించబోతున్నాడని ప్రకటించాడు.

రీసెంట్ గా అమెరికాలోని డాలస్ లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. అక్కడ రామ్ చరణ్ క్రేజ్ చూసి షాక్ అయ్యాడంట శంకర్. సినిమా ఎడిటింగ్ లో ఓ సీన్ ను ఈ దర్శకుడు ఆల్రెడీ కట్ చేశాడు. డాలస్ లో చరణ్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి, ఎడిటర్ కు ఫోన్ చేసి కట్ చేసిన సన్నివేశాన్ని తిరిగి పెట్టమని చెప్పాడట.

ప్రభాస్ ను బీట్ చేసిన రామ్ చరణ్

మరోవైపు ప్రభాస్ పేరిట ఉన్న అతిపెద్ద కటౌట్ రికార్డ్ ను రామ్ చరణ్ బద్దలుకొట్టాడు. 230 అడుగుల ప్రభాస్ కటౌట్ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చరణ్ గేమ్ ఛేంజర్ లుక్ తో ఏకంగా 256 అడుగుల కటౌట్ ను ఏర్పాటుచేశారు. విజయవాడలో ఏర్పాటుచేసిన ఈ కటౌట్ వీడియోలు/ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

23 Replies to “రామ్ చరణ్.. 2 కాదు, 3 గెటప్స్”

  1. ఎన్ని గెటప్స్ వేసినా ఏమి లాభం లేదు శంకర్ దగ్గర సరుకు అయిపోయి దశాబ్దం దాటింది ఈ సినిమా తో దిల్ రాజు గేమ్ చేంజ్ అవ్వడం పక్కా,డిజాస్టర్ ఆఫ్ ద డెకేడ్ అవుతుంది ఈ సినిమా

      1. cinema baleka pothe ae star kuda emi cheyyaledu..cherry okka ssr tho thappa anni outdated directors thone cinemalu chesthadu mostly..nag aswin lanti director ni line lo pettakunda ilanti ink aipoina valla tho teesthe use ledhu..hope snkr sir shows his power again

  2. సంధ్య థియేటర్ సంఘటన చూసిన తరువాత అయినా అభిమానం హద్దుల్లో ఉంచుకోవాలి.దేని కోసం ఇంత పెద్ద పెద్ద కటౌట్లు? తమిళుల అతిని మించి పోతున్నాం..అంతా మంచి గా నడిచినంత కాలం బానే వుంటుంది. తేడా వస్తే ఎంత రచ్చ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం కదా.

    1. Ee concept mega abhimanulaki varthinchadhaa brother? Vaallu chese athi kanipinchadhaa?

      Nijam cheppaalante mega abhimanulu chesentha overaction and negative comments vere heroes fans cheyaru. Mega fans kante remaining heroes fans chala better

Comments are closed.