ఇక మీరిద్దరే పార్టీని చూసుకోవాలి!

కేటీఆర్.. కవిత, హరీష్ రావులను పిలిపించి, పార్టీ నిర్వహణ బాధ్యతలు వారికే అప్పగించినట్లు తెలుస్తోంది.

ఫార్ములా-ఈ రేసు కేసులో తనను అరెస్టు చేయవచ్చని కేటీఆర్‌కు భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీలోనూ ఇదే చర్చ సాగుతోంది. హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టేసి, ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేయడంతో, దర్యాప్తు సంస్థలు కేటీఆర్‌ను విచారించే అవకాశం ఉందని తెలిపింది. కోర్టు తాము జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది.

సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో, కేటీఆర్‌కు అరెస్టు నుంచి రక్షణ లభించకపోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన జైలుకు వెళ్లే పరిస్థితి ఎదురవుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్, కవిత, హరీష్ రావులతో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేసినప్పుడు, ఆమెకు ఆరు నెలల పాటు బెయిల్ దొరకకపోవడం గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కేటీఆర్ విషయంలోనూ ఇదే జరుగుతుందని భావిస్తున్నారు.

ఈ పరిస్థితిలో, కేటీఆర్.. కవిత, హరీష్ రావులను పిలిపించి, పార్టీ నిర్వహణ బాధ్యతలు వారికే అప్పగించినట్లు తెలుస్తోంది. కవితకు జిల్లా స్థాయిలో సమావేశాలు, విభాగాల నేతల సమన్వయ బాధ్యతలు అప్పగించగా, హరీష్ రావుకు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, పోరాటాల నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.

ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెంచాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు.

హైకోర్టు తీర్పు అనంతరం, కేటీఆర్ మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ను బ్రోకర్ అని, మంత్రి పొంగులేటిని కాంట్రాక్టర్ అని అభివర్ణించారు. రేపు ఏసీబీ విచారణలో ఏమైనా కొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయేమో చూడాలి.

8 Replies to “ఇక మీరిద్దరే పార్టీని చూసుకోవాలి!”

  1. తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు… సీ బి

  2. ఇంకెక్కడుంది పార్టీ, తాగుబోతు రాష్ట్ర సమితిని, బీహార్ రాష్ట్ర సమితిగా మార్చాక జనం మర్చిపోయారు, లోక్ సభ ఎన్నికల్లో సున్నా సీట్లు వచ్చాయి చింతమడక శేఖర్, పాస్పోర్ట్ బ్రోకర్, వెలమ దొర, కాపర్ శేఖర్, బాతాల పోశెట్టి కి

  3. జైల్లో చెడు అలవాట్లు ను దూరం చేసుకొనే అవకాశం ఉంటుంది ఆ రకం గ ktr కి మంచిది

Comments are closed.