సంక్రాంతి సినిమాలకు ఎదురుదెబ్బ?

ప్రభుత్వం ఇచ్చిన 14 రోజుల ప్రత్యేక అనుమతుల్ని, 10 రోజులకు కుదించింది. టికెట్ రేట్ల పెంపుపై మాత్రం కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఏపీలో సంక్రాంతి సినిమాలకు ప్రత్యేక అనుమతులు వచ్చిన సంగతి తెలిసిందే.. రిలీజ్ కాబోతున్న 3 సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చేశారు. వీటిలో చరణ్, బాలయ్య సినిమాలకు బెనిఫిట్ షోలకు కూడా పర్మిషన్లు వచ్చేశాయి.

ఆల్ సెట్ అనుకున్న టైమ్ లో షాక్ తగిలింది. ఏపీ హైకోర్టులో ఈ జీవోలపై పిటిషన్ పడింది. సినిమాలకు బెనిఫిట్ షోలు ఇవ్వడం వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని పిటిషనర్ ఆరోపించారు. సంధ్య థియేటర్ ఘటనను ఉదాహరణగా పేర్కొన్నారు. అదే విధంగా నిబంధనలకు విరుద్ధంగా ఇబ్బడిముబ్బడిగా టికెట్ రేట్లు పెంచుకుంటున్నారని కూడా పిటిషన్ లో ఆరోపించారు.

దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు, గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ టికెట్ రేట్ల పెంపు కాలపరిమితిని కుదించింది. ప్రభుత్వం ఇచ్చిన 14 రోజుల ప్రత్యేక అనుమతుల్ని, 10 రోజులకు కుదించింది. టికెట్ రేట్ల పెంపుపై మాత్రం కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

గేమ్ ఛేంజర్ సినిమాకు అర్థరాత్రి ఒంటి గంట ఆట (బెనిఫిట్ షో)కు అనుమతినిచ్చింది ప్రభుత్వం. ఈ ఒక్క షోకు 600 రూపాయలు టికెట్ రేటు పెట్టుకోవచ్చని తెలిపింది. అలాగే డాకు మహారాజ్ సినిమాకు ఉదయం 4 గంటల షోకు అనుమతిస్తూ, టికెట్ రేటును 500 రూపాయలు చేసింది. పెంపును 10 రోజులకు కుదించడంతో, ఆ ప్రభావం ఈ సినిమా వసూళ్లపై పడుతుంది.

5 Replies to “సంక్రాంతి సినిమాలకు ఎదురుదెబ్బ?”

  1. తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు… సీ బి పని

Comments are closed.