విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఆశ‌లు వ‌దులుకోవాల్సిందేనా?

ఆంధ్రుల సెంటిమెంట్‌తో ముడిప‌డిన విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను అధికారంలో ఉండి కూడా కాపాడుకోలేని ద‌య‌నీయ స్థితి క‌ళ్లెదుటే క‌నిపిస్తోంది.

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూట‌మి స‌ర్కార్లే ఉండ‌డంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌ప‌రం కాద‌నే ఆశ‌లుండేవి. కానీ వాస్త‌వ ప‌రిస్థితుల్ని చూస్తే…చాప‌కింద నీళ్ల‌లా ప్రైవేట్‌ప‌రం చేయ‌డానికి విశాఖ స్టీల్ ప‌రిశ్ర‌మ యాజ‌మాన్యం తాను చేయాల‌నుకున్న‌ది చేసుకుంటూ పోతోంది. తాజాగా స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు నోటీసు ఇవ్వ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

క‌నీసం 15 ఏళ్లు స‌ర్వీస్ పూర్తి చేసుకోవ‌డంతో పాటు 45 ఏళ్లు దాటిన వారు, అలాగే 2026, జ‌న‌వ‌రి త‌ర్వాత ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న ఉద్యోగులు స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ ప‌థ‌కానికి అర్హులుగా యాజ‌మాన్యం ప్ర‌క‌టించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ విశాఖ స్టీల్ ప‌రిర‌క్ష‌ణ‌పై గొప్ప‌లు చెప్పారు. ఆంధ్రుల సెంటిమెంట్‌తో ముడిప‌డిన విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను అధికారంలో ఉండి కూడా కాపాడుకోలేని ద‌య‌నీయ స్థితి క‌ళ్లెదుటే క‌నిపిస్తోంది.

ఒక‌వైపు విశాఖ కార్మికులు ఏళ్ల త‌ర‌బ‌డి చేస్తున్న ఆందోళ‌న‌ల‌కు ఏ మాత్రం విలువ లేకుండా పోతోంది. కార్మికుల పోరాటాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. తాము అనుకున్న‌ది చేసి తీరుతామ‌నే రీతిలో కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి వీఆర్ఎస్ ప్ర‌క‌ట‌న‌తో తేల్చి చెప్పింది.

ఉద్యోగుల్ని క్ర‌మంగా త‌గ్గించ‌డం ద్వారా విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను కేంద్ర ప్ర‌భుత్వ యాజ‌మాన్యం నుంచి త‌ప్పుకుని, ప్రైవేట్ వ్య‌క్తుల‌కు క‌ట్ట‌బెట్టాల‌నే ప్ర‌య‌త్నాలు ఊపందుకున్నాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

5 Replies to “విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఆశ‌లు వ‌దులుకోవాల్సిందేనా?”

  1. Entire Vizag voted for kootami and privatization of Steel plant. So, stop crying. No one wants this to remain a public entity. Kootami won the biggest majority in Gajuwaka where the plan is located. So, public is with kootami on this decision.

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. కరెక్ట్ డెసిషన్. ప్రభుత్వ ఉద్యోగులకి కూడా ఇదే పాలసీ పెడితే కొత్త వాళ్ళ కి నిరోద్యోగులకి అవకాశాలు వస్తాయి.

  4. ప్రజలు కట్టిన పన్నును ఇలాంటి వాటికీ ఎందుకు ఇవ్వాలి లాస్ లు వస్తుంటే వాళ్లే జీతాలు తగ్గించుకోవాలి అవసరానికి మించి ఉద్యోగస్తులు ను నియమించడం సోంబేరులను జనాల డబ్బులతో మేపుతారా నిజం గపనిచేసేవాడికి భయం ఎందుకు అది ప్రైవేట్ రంగం అయినా ఒక్కటే పబ్లిక్ అయినాఒక్కటే

Comments are closed.