పంటలు వేయడం కూడా తప్పేనా?

అన్నదాతల మీద పోలీసు కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్యగా ప్రజలు భావిస్తున్నారు.

అమరావతి రాజధానిలో రైతులు దాదాపు 50 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వానికి అప్పగించారు. ఆ భూములలో క్రియాశీలంగా రాజధాని నిర్మాణాలు జరగడం అనేది ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. అది కూడా కేవలం కొన్ని ప్రాంతాలకు పరిమితం. నిర్మాణ పనులు కనీసం మొదలైనట్టుగా కనిపించాలంటే ఇంకా ఒక ఏడాదిపట్టినా ఆశ్చర్యం లేదు.

రైతులు భూములు అప్పగించిన తొలి 5 సంవత్సరాల పదవీకాలంలో చంద్రబాబు నాయుడు నిర్మాణాలన్నీ కంప్యూటర్లలో చేశారు తప్ప భూమి జోలికి రాలేదు. జగన్మోహన్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత అసలు రాజధానినే పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో భూములు అన్ని అలా వృధాగా ఉండిపోయాయి.

ఎంతో సారవంతమైన భూములు అలా వృధా కావడం జాతికి మంచిదేనా? రైతులు ఖాళీగా పిచ్చి మొక్కలు మొలుస్తున్న భూముల్లో పంటలు సాగు చేస్తే అది తప్పు అవుతుందా? అనే మీమాంస ఇప్పుడు ఎదురవుతోంది!

ఎందుకంటే సుమారు 25 ఎకరాల భూములలో కొందరు రైతులు దున్ని నీరు పెట్టి విత్తనాలు విత్తేసరికి– సి ఆర్ డి ఏ అధికారులు వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖాళీగా ఉన్న భూములను, తాము ఇచ్చిన భూములను వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తే అది శిక్షార్హమైన నేరం అవుతుందా?

ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టే సందర్భంలో అవి తమ భూములని నిర్మాణాలు చేపట్టడానికి వీలులేదని రైతులు అడ్డుపడితే కేసులు పెట్టాలి గాని, సారవంతమైన భూములను బీడు పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేని రైతు గుండె ఆ ప్రాంతాన్ని దున్ని విత్తితే అదికూడా నేరంగా పరిగణించాలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే ‘భూములు దున్నిన రైతులందరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు’ అని రాజకీయ రంగు పులమడం ఇంకొక ఎత్తు. నిరుపయోగంగా ఉన్న భూమిని సద్వినియోగం చేయాలని రైతు అనుకోవడం సహజం. అయితే అందుకు రాజకీయరంగు అవసరం అవుతుందా..? భూములను దున్ని విత్తినంత మాత్రాన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రయోజనం ఏముంటుంది.. అనేది ప్రశ్న!

సరిగ్గా ఎక్కడైతే విత్తుతున్నారో అదే ప్రాంతంలో పంట చేతికి వచ్చేలోగా నిర్మాణాలు జోరందుకునే పనైతే ఒకవేళ ప్రభుత్వం అభ్యంతర పెట్టడంలో అర్థం ఉంది గాని, అటుఇటు కాకుండా సారవంతమైన భూములు రైతులకు ఉపయోగపడకుండా– రాజధాని పనులు చేపట్టకుండా అలా ఇంకెంతకాలం బీళ్లుగా వదిలేయాలనే ఉద్దేశంతో ఉన్నారో అర్థం కావడం లేదని ప్రజలు అనుకుంటున్నారు.

ఒకవేళ రైతులు నిర్మాణాలు జరిగే ప్రాంతంలో వ్యవసాయం ప్రారంభించినా సరే సి ఆర్ డి ఏ అధికారులు వారికి నచ్చజెప్పి వెనక్కు తగ్గేలా చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రాజధాని పనులు జోరుగా ఊపందుకుంటున్నాయి కాబట్టి ఆటంకాలు కలిగించగల ఇలాంటి పనులు చేయవద్దని వారికి హితవు చెప్పవచ్చు. అలాంటి ప్రయత్నాలు ఏమీ లేకుండానే అన్నదాతల మీద పోలీసు కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్యగా ప్రజలు భావిస్తున్నారు.

5 Replies to “పంటలు వేయడం కూడా తప్పేనా?”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. నిజమైన రైతు భూమి బీడుగా ఉంటే సహించలేదు…

    అక్కడ ఉన్నది కేవలం 25 ఎకరాల నిజమైన రైతులు మాత్రమే .. మిగిలిన వాళ్ళు అందరు… రియల్ ఎస్టేట్ స్టార్స్… అది ఒక డబ్బు ప్రపంచం…

Comments are closed.