బాలకృష్ణతో కోహ్లి సెల్ఫీ దిగాడా?

ఓ క్రికెట్ స్టేడియంలో బాలయ్యతో కోహ్లి ఈ ఫొటోలు దిగినట్టున్నాయి. అయితే ఈమధ్య కాలంలో బాలకృష్ణ ఏ క్రికెట్ స్టేడియంను సందర్శించలేదు.

2 రోజుల నుంచి వైరల్ అవుతున్న ఫొటోలివి. నందమూరి అభిమానులు వీటిని తెగ షేర్ చేస్తున్నారు. కోహ్లీకి కూడా బాలయ్య పవర్ ఏంటో తెలిసొచ్చిందని, స్వయంగా సెల్ఫీ దిగాడంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

కట్ చేస్తే, ఈ ఫొటోలు ఫేక్ అని తేలింది. గుగూల్ లో రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ తో కొంతమంది ఈ ఫొటోల ప్రామాణికతను నిర్థారించడానికి ప్రయత్నించారు. 99.8 శాతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్-ఏఐ సాయంతో ఈ ఫొటోలు సృష్టించినట్టు తేలింది.

ఓ క్రికెట్ స్టేడియంలో బాలయ్యతో కోహ్లి ఈ ఫొటోలు దిగినట్టున్నాయి. అయితే ఈమధ్య కాలంలో బాలకృష్ణ ఏ క్రికెట్ స్టేడియంను సందర్శించలేదు.

అటు కోహ్లి వేసుకున్న జెర్సీ కూడా ఇది ఫేక్ అని నిర్థారించింది. ఒప్పో లోగో ఉన్న జెర్సీని ధరించాడు కోహ్లి. ఆ కంపెనీతో బీసీసీఐ ఒప్పందం 2019లోనే ముగిసింది. ఈమధ్య ఏఐ సహాయంతో ఇలాంటి ఫొటోలు సృష్టించడం చాలా ఈజీ అయిపోయింది. అన్నింటినీ నిజం అనుకోకూడదని హెచ్చరిస్తున్నారు టెక్ నిపుణులు.

4 Replies to “బాలకృష్ణతో కోహ్లి సెల్ఫీ దిగాడా?”

Comments are closed.