మార్చి నెలలోకి వచ్చేశాం. ఈ నెలకు సంబంధించి సినిమాలు కూడా అన్నీ షెడ్యూల్ అయి ఉన్నాయి. పవన్ సినిమాపై మాత్రం డౌట్స్ ఇంకా అలానే ఉన్నాయి.
హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి మార్చి 28 రిలీజ్ అంటూ పోస్టర్లు వస్తూనే ఉన్నాయి. కానీ ట్రేడ్ మాత్రం నమ్మడం లేదు. ఎందుకంటే, పవన్ కల్యాణ్ వ్యవహారశైలి అలా ఉంది మరి.
కీలకమైన ఓ బ్లాక్ షూటింగ్ పూర్తయితే, సినిమా రెడీ అవుతుంది. పవన్ మాత్రం షూటింగ్ చేయడం లేదు. దీంతో ఈ నెలలో ఈ సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలు కొనసాగుతున్నాయి.
ఈ సినిమా చెప్పిన తేదీకి దాదాపు రాదని ఇతర నిర్మాతలు ఫిక్స్ అయిపోయారు. మొన్నటికిమొన్న నిర్మాత నాగవంశీ కూడా అదే చెబుతున్నాడు. తన సినిమా మ్యాడ్ స్క్వేర్ ను మార్చి 29కి రిలీజ్ చేస్తున్న ఈ నిర్మాత, పవన్ సినిమా 28వ తేదీకి వస్తుందనే సమాచారం తన దగ్గర లేదన్నాడు.
ఒకవేళ పవన్ సినిమా వస్తే తమ సినిమాను వాయిదా వేస్తామని కూడా అంటున్నాడు. నిజంగా అలా వాయిదా పడేలా ఉంటే మ్యాడ్ స్క్వేర్ ప్రచారం ప్రారంభించడు కదా.. ఏకంగా ప్రెస్ మీట్ ఈవెంట్ పెట్టడు కదా..! అటు మైత్రీ నిర్మాతలు కూడా ఇదే చెబుతున్నారు. హరిహర వీరమల్లు రాదనే పక్కా సమాచారంతోనే వాళ్లు రాబిన్ హుడ్ మూవీని ముందుకు తీసుకొచ్చారు.
ఇటు హరిహర వీరమల్లు నిర్మాతలు మాత్రం తమ సినిమా కచ్చితంగా మార్చి 28కి వస్తుందని చెబుతున్నారు. కనీసం ఇలా డేట్ చెబితేనైనా పవన్ కల్యాణ్ షూటింగ్ కు వస్తారేమో అనేది వాళ్ల ఆలోచన కావొచ్చు.
కాల్ బాయ్ జాబ్స్ >>>తొమ్మిది, సున్నా, ఒకటి, తొమ్మిది, నాలుగు,
Raka ovochu
పాపం ఏ యం రత్నం .. ముందే నలిగిపోయి ఉన్నాడు .. ఈ సినిమా దెబ్బకు పాతాళం అడుగుకు పొయ్యుంటాడు