ఇవేం క‌మిటీలు?.. వైసీపీ కేడ‌ర్‌లో తీవ్ర అసంతృప్తి!

ఇలాంటి స‌మ‌యంలో పార్టీ కోసం గ‌ట్టిగా నిల‌బ‌డ్డ నిబ‌ద్ధ‌త క‌లిగిన వాళ్ల‌కు గుర్తింపు ఇవ్వ‌క‌పోతే ఎలా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది

వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు పార్టీకి సంబంధించి మండ‌ల‌, జిల్లా, రాష్ట్ర క‌మిటీల ఏర్పాటు జ‌రుగుతోంది. అయితే నియోజ‌క‌వర్గాల స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు, ఎమ్మెల్యేల సిఫార్సుల మేర‌కు ఈ క‌మిటీల్లో కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు చోటు క‌ల్పిస్తున్నారు. కానీ క‌మిటీల‌పై వైసీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి క‌నిపిస్తోంది.

వైసీపీ ఘోర ప‌రాజ‌యం అయిన నేప‌థ్యంలో చాలా జాగ్ర‌త్త‌గా క‌మిటీల్లో ప్ర‌జాద‌ర‌ణ ఉన్న వాళ్ల‌కు చోటు క‌ల్పించి, త‌ద్వారా పార్టీ బ‌లోపేతం చేయ‌డానికి బ‌దులు, అందుకు భిన్నంగా వ్య‌వ‌హారం న‌డుస్తోంది. ఎమ్మెల్యేలు, స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు, కొంద‌రు ఎంపీలు త‌మ‌కు అనుకూలంగా ఉంటే చాలు, కార్య‌క‌ర్త‌ల‌కు తెలియాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ట్టుగా కొంద‌రికి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టార‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. ఈ విష‌య‌మై వైసీపీ ముఖ్య నాయ‌కుల వ‌ద్ద కొంద‌రు ఆవేద‌న వ్య‌క్తం చేస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ముందు వైసీపీని బ‌లోపేతం చేసుకుని, అధికారంలోకి తెచ్చుకుంటేనే త‌మ‌కు భ‌విష్య‌త్ వుంటుంద‌నే స్పృహ లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌నే ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలాగైతే పార్టీ పుంజుకోవ‌డం ప‌క్క‌న పెడితే, మ‌రింత అసంతృప్తి పెరుగుతుంద‌ని, అంతోఇంతో ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కులు కూడా దూర‌మ‌య్యే ప్ర‌మాదం వుంటుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఏ క‌మిటీలో అయినా స్థానం క‌ల్పించాలంటే, క‌నీసం 60 శాతం కేడ‌ర్ నుంచి ఆమోదం ఉండాల‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం క‌మిటీల్లోని కొంద‌రి పేర్లు చూస్తే, ఎప్పుడూ, ఎక్క‌డా విన‌లేదే, క‌న‌లేదే అని ముఖ్య నాయ‌కుల వ‌ద్ద కేడ‌ర్ నిల‌దీస్తున్నారు. గ‌తంలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ప‌ద‌వులు అనుభ‌వించిన చాలా మంది… ఇప్పుడు మౌనాన్ని ఆశ్ర‌యించారు.

ఇలాంటి స‌మ‌యంలో పార్టీ కోసం గ‌ట్టిగా నిల‌బ‌డ్డ నిబ‌ద్ధ‌త క‌లిగిన వాళ్ల‌కు గుర్తింపు ఇవ్వ‌క‌పోతే ఎలా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. కావున క‌మిటీల్లో చోటు కోసం సిఫార్సు చేస్తున్న పేర్ల‌పై అధిష్టానం ఒక‌టికి రెండుసార్లు విచారించిన త‌ర్వాతే, త‌గిన నిర్ణ‌యం తీసుకోవాల‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

9 Replies to “ఇవేం క‌మిటీలు?.. వైసీపీ కేడ‌ర్‌లో తీవ్ర అసంతృప్తి!”

  1. బొక్క లో ఉన్న A1అన్న కోసం ఎన్నోవేల కిలోమీటర్లు”పాదాల మీద నడిచి” పార్టీని నిలబెట్టి, ఊరురూ తిరిగి ప్రచారం చేసి కుర్చీ ఎక్కిస్తే పెళ్ళాం & పెళ్ళాం రంకు మొగుడి మాటలు విని కష్టపడిన చెల్లెకి కనీసం ఓ పదవి ఇవ్వకుండా, ఆస్తులూ ఇవ్వకుండా వాళ్ళు చరిత్ర బైట పెడతా అన్న పాపానికి గోడకి కొట్టి, తన్ని, బైటకి తరిమేసిన ఈడూ ఓ నాయకుడు.. ఈడు వేసే కమిటీ లకి ఓ విలువ ఉంటుందా??

      1. ante goddali correct anna mata mari enduku gundepotu ani nara ani covering

        pilla nichina mamani chamipna vadi kante better kada

        correction champa ledu , he took party from pativrata garu .. chusam kada entha baga vunnaro mana neelam party lo

  2. ఎవడో కడప ఎంపీ గా పోటీ చెయ్యడం కోసం, సొంత చిన్నాన్ననే గొడ్డలితో వేసేసి, అక్రమ ఆస్తుల కోసం కన్న తల్లి మీదే కేసులు పెట్టి వేధించే బజార్ L ‘కొడుకు.. వీడూ ఒక నాయకుడా?? వీడి కమిటీ లని ఎవడు గౌరవిస్తాడు??

  3. వైసిపి ఇక అధికారంలోకి వస్తుంది అన్నది కలలో మాట ఈ ఐదేళ్ళు రాణి హోదా కోసం దెబురించటమే సరిపోద్ది ఆ తర్వాత వుంటే గింటే ఆ హోదా ఏదో అనుమానమే ఎప్పుడూనా పార్టీ మూసుకోక తప్పని పరిస్థితి

Comments are closed.