ఈ సుప్రీం కోర్టు తీర్పు కాస్త గమనించండి సార్..!

ఒకే వ్యాఖ్యలకు సంబంధించి పోసాని కృష్ణ మురళిని ఊరూరా తిప్పుతున్నారు. ఇది కచ్చితంగా రాజకీయ ప్రేరేపిత వేధింపులే అని ప్రజలు కూడా అనుకుంటున్నారు.

ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. తమ ప్రత్యర్థి పార్టీకి చెందిన వారిని చిత్ర విచిత్రమైన కేసులతో వేధించడం అనేది ఇవాళ చాలా మామూలు సంగతి అయిపోయింది. మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరో ఒకరు.. ఎక్కడో ఒకచోట కేసు పెట్టడం.. అరెస్టులు, రిమాండులు అనేది మామూలు అయింది. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులే అనే సంగతి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం కూడా ఉండదు.

అయితే ఇలాంటి కేసుల విషయంలో ఎవరు అధికారంలో ఉంటే వారి వేధింపులను, ప్రత్యర్థులు భరిస్తూ ఉండాల్సిందేనా? వేరే మార్గాంతరం లేదా? అనే ప్రశ్నలు సాధారణంగా ఉత్పన్నం అవుతుంటాయి. అలాంటి ప్రశ్నలకు సమాధానంగా సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును పరిశీలించాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో వేధింపులకు గురవుతున్నది వైసీపీకి చెందిన వారే గనుక, ఈ తీర్పును వారు మరింత శ్రద్ధగా గమనించాలి.

తమిళనాడులో ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మం గురించి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై ఇప్పటికే ఆయన మీద అనేక కేసులు నమోదై ఉన్నాయి. సనాతన ధర్మంపై వ్యాఖ్యలకు సంబంధించి కేసుల విచారణ జరుగుతున్న వివిధ కోర్టులకు ఉదయనిధి స్వయంగా హాజరు కావాల్సిన అవసరం లేదని సుప్రీం చెప్పింది. అలాగే ఇదే విషయం మీద కొత్త కేసులు నమోదు చేయడానికి కూడా వీల్లేదని ఆదేశించింది. ఇది తమిళ ఉపముఖ్యమంత్రి కి పెద్ద ఊరట అనే చెప్పాలి.

మరి మన రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ఈ తీర్పును గమనిస్తే.. కొన్నాళ్ళ కిందట రాంగోపాల్ వర్మ ఇదే డిమాండ్ తో .. తన ట్వీట్ లకు సంబంధించి కొత్త కేసులు నమోదు కాకుండా చూడాలని కోర్టును ఆశ్రయించిన సంగతి అందరికీ గుర్తుంటుంది.

ఇప్పుడు జరుగుతున్నది వేరే. ఒకే వ్యాఖ్యలకు సంబంధించి పోసాని కృష్ణ మురళిని ఊరూరా తిప్పుతున్నారు. ఇది కచ్చితంగా రాజకీయ ప్రేరేపిత వేధింపులే అని ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఈ తరహా ఒకే రకం కేసుల్లో ఊర్లు తిప్పే వేధింపులు పోసానితో ఆగవు. ముందు ముందు మరింత మంది ఇదే తరహాలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే వైసిపి నేతలు ఈ సుప్రీం తీర్పును జాగ్రత్తగా గమనిస్తే.. వేధింపులను కొంత తప్పించుకోగల అవకాశం ఉంటుంది.

14 Replies to “ఈ సుప్రీం కోర్టు తీర్పు కాస్త గమనించండి సార్..!”

  1. ఇది దుశ్శాసనుడు భీముడు యుద్ధరంగం లో మీదకు వస్తుంటే చెప్పే వరసలు (అన్న వరస ) నీతులు లాగా వున్నాయి జనాలు కూడా నోటితో నవ్వారు అయినా వీళ్ళేమి నిరపరాదుల మీద ఏమిపడటం లేదు కుటుంబ స్త్రీలను అవమాన పరచిన వారిమీద పడుతున్నారు అది విద్యావంతులకు నచ్చబట్టే గ్రాడ్యుయేట్ వోటింగ్ సరళి నేరస్తులను శిక్షిస్తుంటే సామాన్యుడు పడే ఆనందాన్ని తెలియజేసింది

  2. why journalists are doing the job of lawyers and concluding that both cases are relevant/same… If this judgement of supreme is really relevant to the cases of RGV or any other, let their counsel quote the same in their petitions to seek appropriate reliefs….

    1. రే రంగడు!

      This is about enlightening people and making them aware of the law. Let the public decide its necessity who are you to make that judgment? As the fourth estate, media outlets have every right to inform and educate the public. Just because the news isn’t in your favor, you can’t take sides like this!

      1. //isnt in my favour//…. so you declared it as relevant… the plea by Stalin for clubbing of criminal cases registered against him across multiple states…. multiple FIRs are registered against him since September 2023…. All those multiple cases are still admitted by courts. Now court has ordered to not to file fresh FIRs on the same issue without courts permission as they have listed it for Final hearing in April…. In posani case multiple FIRs were already filed on same issue between november 24 to Feb 25 and various courts have admitted them separately…. If stalin case has to be considered as reference, still posani will haveh as all 16-17 cases alive on same issue and fresh cases might be filed after courts permission….వైకాపా వాళ్ళు అంటే నిషాని గాళ్ళు ఏమో కానీ మేము కాదు….

      2. In stalin matter multiple petitions filed since september 2023 were still alive, only relief is that fresh cannot be filed without permission from justice as they have listed for final hearing in April 2025… justice have not declared that new petitions on same issue are not admissible… If posani counsel takes this as reference, still all 17 petitions filed against him on same issue will survive and new petitions only require permission…. నిజంగా పనికి వస్తే లాయర్ ఈ judgement వాడేసుకుంటాడు…. పనికి రాదు కాబట్టే వాడలేదు….

Comments are closed.