చేతకాలేదు.. చేతులెత్తేసింది!

బీఆర్​ఎస్​ పార్టీకి ఆయుధంగా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతుంది.

ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇస్తుంది. హామీలు ఇచ్చేటప్పుడు వాటిని అమలు చేయగలమా? లేదా? అనే ఆలోచన ఉండదు. ముందు అధికారంలోకి రావాలి. తరువాత చూసుకోవచ్చు అనే ధ్యాసే ఉంటుంది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెసు పార్టీ అలాగే చేసింది. ఆరు గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చింది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం మినహాయించి మరే పథకం సంపూర్ణంగా అమలు జరగలేదని, జరగడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. నిజానికి ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రభుత్వానికి భారంగానే ఉంది. ఉచితంగా ప్రయాణించే బస్సుల సంఖ్యను తగ్గించారని సమాచారం. ప్రభుత్వం తాము అన్ని పథకాలు బ్రహ్మాండంగా అమలు చేస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని అంటున్నారు.

కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన హామీల్లో “తులం బంగారం” ఒకటి. కేసీఆర్​ సీఎంగా ఉన్నప్పుడు పేదింటి ఆడపిల్లల వివాహానికి ఆర్థిక సహాయం చేశారు. హిందువులకు కల్యాణ లక్ష్మి పేరుతో, ముస్లిములకు షాదీ ముబారక్​ పేరుతో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అయితే కాంగ్రెసు పార్టీ ఈ ఆర్థిక సహాయానికి తోడు తులం బంగారం కూడా ఇస్తామని హామీ ఇచ్చింది.

ఈ హామీ సహజంగానే పేదవారిని ఆకర్షించింది. కాంగ్రెసు అధికారంలోకి రావడానికి ఇది కూడా దోహదం చేసింది. కాని రేవంత్​ రెడ్డి సీఎం అయ్యాక తులం బంగారం ఊసే లేకుండా పోయింది. తులం బంగారం అంటే మాటలు కాదు కదా. బంగారం ధర విపరీతంగా పెరిగింది. తులం బంగారం ఇవ్వడం అసాధ్యం. కాని హామీ ఇచ్చేటప్పుడు ఆ సోయి ఉంటే కదా. పార్టీ అధికారంలోకి వచ్చాక తత్వం బోధపడింది.

అంతే.. ఈ పథకానికి మంగళం పాడింది. బీఆర్​ఎస్​ అనేకసార్లు తులం బంగారం ఏమైందని ప్రశ్నించింది. ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. చివరకు శాసనమండలిలో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత తులం బంగారం పథకం ఏమైందని అని అడిగినప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్​ ఆ పథకం అమలు చేయడంలేదని చెప్పారు. ఇది కచ్చితంగా రేవంత్​ రెడ్డి ప్రభుత్వానికి మైనస్​ అవుతుంది.

బీఆర్​ఎస్​ పార్టీకి ఆయుధంగా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతుంది. గతంలో ప్రభుత్వం తాము హామీలు ఒకటొకటి నెరవేర్చకుంటూ వస్తున్నామని, తులం బంగారం పథకం కూడా అమలు చేస్తామని చెప్పింది. కాని ఇప్పుడు పొన్నం ప్రభాకర్​ ఈ పథకం (కళ్యాణమస్తు) అమలుకావడంలేదని తేల్చి చెప్పారు. అంటే ప్రభుత్వానికి చేతకావడంలేదని అర్థమైపోయింది.

10 Replies to “చేతకాలేదు.. చేతులెత్తేసింది!”

  1. ముక్కోడి దోపిడీ కంటే లక్ష రెట్లు బెటర్ , ముక్కోడి కాలం లో ఫోన్ టాపింగ్ , గొర్రెల స్కాం , అవినీతి.

    ఆంధ్ర పారిశ్రామికవేత్తలని వాళ్ళని బెదిరించి డబ్బు గుంజుడు

    సాక్షి , tv9 , Ntv లని కొనేసి అక్రమాలు చేసిన వార్తలు రాకుండా చేశాడు,

    ధరణి పోర్టల్ లో కొన్ని లక్షల ఎకరాలు కాజేశారు ముక్కోడు , డ్రామా రావు , లిక్కర్ కవిత, అగ్గిపెట్టె నాటకాల హరీష్ రావు గాడు

  2. ముక్కోడి దోపిడీ కంటే లక్ష రెట్లు బెటర్ , ముక్కోడి కాలం లో ఫోన్ టాపింగ్ , గొర్రెల స్కాం ,

    ధరణి పోర్టల్ లో కొన్ని లక్షల ఎకరాలు కాజేశారు ముక్కోడు , డ్రామా రావు , లిక్కర్ కవిత, అగ్గిపెట్టె నాటకాల హరీష్ రావు గాడు

Comments are closed.