చిరంజీవి, అనీల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా మొదలైంది. ప్రారంభమైన తొలి రోజు నుంచే ప్రచారం కూడా ప్రారంభించారు. తొలి ప్రచార వీడియోలో భాగంగా టెక్నీషియన్స్ ను పరిచయం చేశారు.
చిరంజీవి గత సినిమాల్ని గుర్తుచేస్తూనే, ఒక్కో విభాగాన్ని పరిచయం చేశారు. డైరక్షన్ డిపార్ట్ మెంట్, మ్యూజిక్, ఆర్ట్, సినిమాటోగ్రఫీ.. ఇలా అందర్నీ పరిచయం చేస్తూ చివర్లో దర్శకుడు అనీల్ రావిపూడిని కూడా చూపించారు.
అంతా బాగుంది కానీ ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ ను మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. మొన్నటివరకు అదితి రావు పేరు గట్టిగా వినిపించింది.
నిజంగా ఆమెనే ఎంపిక చేసినట్టయితే, ఓపెనింగ్ కు అదితి తప్పనిసరిగా వచ్చి ఉండేది. కానీ అలా జరగలేదు. అంటే హీరోయిన్ ఎంపిక ఇంకా అధికారికంగా పూర్తవ్వలేదన్నమాట. అనీల్ రావిపూడితో పాటు చిరంజీవి కూడా హీరోయిన్ విషయంలో మరో ఆప్షన్ కోసం వెదుకుతున్నట్టు వార్తలొస్తున్నాయి.
మరోవైపు ఇదే యూనిట్ లో ఇంకొంతమంది మాత్రం అగ్రిమెంట్ పూర్తికాకపోవడంతో అదితి ఓపెనింగ్ కు రాలేదని, హీరోయిన్ గా ఆమె ఫిక్స్ అని చెబుతున్నారు.
జయసుధ గారు అయితే బాగుంటుంది
నాకైతే రంభ ఐతే బావుంటుంది అనిపిస్తోంది, పైగా హిట్ కాంబినేషన్
Sneha Meena Ramya krishna
అదితి రావు కి ఆక్టింగే రాదు… ఇంకా అనిల్ సినిమాల్లో కామెడీ టైమింగ్ ఉండాలి
I think Meena is good