తెలుగు చలనచిత్ర రంగంలో ఎంతోమంది స్టార్ హీరోల మధ్య తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొని తొలి ప్రాయంలోనే రాంగోపాల్ వర్మ కంటపడి “వంగవీటి” లాంటి పవర్ ఫుల్ బయోపిక్ మూవీలో అవకాశాన్ని కైవసం చేసుకొని..తెలుగు తెరకు పరిచయమయ్యారు టాలెంటెడ్ యాక్టర్ సందీప్ మాధవ్.
వంగవీటి పాత్రకి ప్రాణం పోశారు.. మలి చిత్రంగా “జార్జిరెడ్డి” లాంటి విప్లవకారుడు చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. తాజాగా తన హ్యాట్రిక్ సినిమాని ఇప్పటివరకూ ఎవరూ చేయని అద్భుతమైన కథని ఎంచుకొని సినిమా చేస్తున్నారు సందీప్ మాధవ్. ఈ చిత్రం ద్వారా నూతన దర్శకుడు అప్సర్ హుస్సేన్ దర్శకుడిగా పరిచయం కానున్నారు..
యస్ అండ్ యమ్ క్రియేషన్స్ మరియు వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ పతాకాలపై అత్యంత భారీ బడ్జెట్ తో సుబాని అబ్దుల్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్, సురేష్, బాబు మోహన్ లతో పాటు ప్రముఖ నటీనటులు నటించనున్నారు. మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన గాయత్రి సురేష్, అక్షిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై ఎవరూ టచ్ చేయని.. సరికొత్త పాయింట్ తో అప్సర్ గంధర్వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ప్రముఖ దర్శకుడు వీర శంకర్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించడం విశేషం..అలాగే మరెన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలకు ఛాయాగ్రహణం బాధ్యతలు నిర్వహించిన జవహర్ రెడ్డి ఫోటోగ్రఫీ గంధర్వ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనుంది. యువ సంగీత దర్శకుడు రాప్ రాక్ షకీల్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ పాయింట్ కానుంది.
చిత్రం ప్రారంభం కాకముందే ఇప్పటికే ఈ చిత్ర కథ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.. డిసెంబర్ 27న ఈ గంధర్వ చిత్రం చలనచిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా ప్రారంభం కానుంది..
ఈ చిత్రానికి డివోపి; జవహర్ రెడ్డి, సంగీతం; రాప్ రాక్ షకీల్, ఎడిటర్; బుల్లిరెడ్డి, ఆర్ట్; విజయ్ కృష్ణ, కో-డైరెక్టర్; ప్రకాష్ పచ్చల, ప్రొడక్షన్ కంట్రోలర్; జె.రామారావు, కో-ప్రొడ్యూసర్; యమ్.యన్. నారాయణ్, పిఆరోఓ; సాయి సతీష్, నిర్మాత; సుబాని అబ్దుల్, దర్శకత్వం; అప్సర్ హుస్సేన్.