సరికొత్త చరిత్ర సృష్టించిన టీమిండియా!

గత ముప్పై సంవత్సరాల్లో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్ టీమ్ ను టెస్టుల్లో ఫాలో ఆన్ ఆడించిన జట్టు ఏదీ లేదు. సొంత గడ్డ  మీద ఆస్ట్రేలియాను ఫాలో ఆన్ ఇన్నింగ్స్ ఆడించి.. టీమిండియా కొత్త రికార్డును…

గత ముప్పై సంవత్సరాల్లో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్ టీమ్ ను టెస్టుల్లో ఫాలో ఆన్ ఆడించిన జట్టు ఏదీ లేదు. సొంత గడ్డ  మీద ఆస్ట్రేలియాను ఫాలో ఆన్ ఇన్నింగ్స్ ఆడించి.. టీమిండియా కొత్త రికార్డును స్థాపించింది. ఆసీస్ అదృష్టం బాగుండి.. నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. వరసగా రెండు రోజుల పాటు వాతావరణం సహకరించకపోవడంతో సిడ్నీ టెస్టు డ్రా గా ముగిసింది.

అయితేనేం.. ఆస్ట్రేలియాలో తొలి సారి టెస్టు సీరిస్ విజయాన్ని సాధించింది టీమిండియా. 2-1 తేడాతో బోర్డర్ –గవాస్కర్ ట్రోఫీని టీమిండియా నెగ్గింది. ట్రోఫీని మరో టర్మ్ తన దగ్గరే అట్టిపెట్టుకుంది కొహ్లీ సేన. 

బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత ఆస్ట్రేలియా జట్టు కొంచెం బలహీనం అయిన మాట వాస్తవమే కానీ.. స్వదేశంలో ఆ జట్టు ఎప్పుడూ పులిలాంటిదే. అలాంటి జట్టును కొహ్లీ సేన ఓడించింది. తద్వారా 70 యేళ్ల చరిత్రలో తొలి సారి టీమిండియా ఆస్ట్రేలియాలో టెస్టు సీరిస్ ను నెగ్గింది. అంతేకాదు.. ఇంత వరకూ ఏ ఆసియన్ జట్టు కూడా టెస్టు సీరిస్ ను నెగ్గలేదు.  టీమిండియాకే అది సాధ్యం అయ్యింది.

బౌలర్ల అద్భుత ప్రతిభ, బ్యాట్స్ మెన్ గొప్ప రాణింపుతోనే ఇది సాధ్యం అయ్యింది. ఆస్ట్రేలియన్ పేస్ బౌలర్లకు ధీటుగా ఇండియన్ పేసర్లు అక్కడి పిచ్ ల పరిస్థితిని సద్వినియోగం చేసుకున్నారు. ఇక కొహ్లీ సహజసిద్ధంగానే రాణించగా.. పుజారా ఇరు జట్లకు మధ్యన ప్రధాన వ్యత్యాసంగా నిలిచాడు. టెస్టు క్రికెట్లో తన ప్రాధాన్యత ఏమిటో ప్రపంచానికే చాటి చెప్పాడు ఈ బ్యాట్స్ మన్. 

అందుకే.. ఆఖరి మ్యాచ్ కు సంబంధించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ను, టోర్నీకి సంబంధించి మ్యాన్ ఆఫ్ ద సీరిస్ ను నెగ్గాడు ఈ బ్యాట్స్ మన్.

జనసేన అన్ని స్థానాల్లో పోటీ పవన్ కళ్యాణ్ ధైర్యమేంటి?

అటు జనం.. ఇటు భయం, పవన్ ఒంటరిగా వెళ్లాలి.. ఇదే అభిమానుల కోరిక!