మహేష్ ముందు జాగ్రత్త

సబ్జెక్ట్ బాగుందని ఓకె అనేసాడు కానీ, మహేష్ వీలయినంత ముందు జాగ్రత్త తీసుకుంటున్నాడట బ్రహ్మోత్సవం సినిమా మీద.  శ్రీకాంత్ అడ్డాల మంచి దర్శకుడే కానీ ముకుంద అంతగా ఆకట్టుకోలేదు.. .సీతమ్మవాకిట్లో లాంటి మల్టీస్టారర్ వ్యవహారం…

సబ్జెక్ట్ బాగుందని ఓకె అనేసాడు కానీ, మహేష్ వీలయినంత ముందు జాగ్రత్త తీసుకుంటున్నాడట బ్రహ్మోత్సవం సినిమా మీద.  శ్రీకాంత్ అడ్డాల మంచి దర్శకుడే కానీ ముకుంద అంతగా ఆకట్టుకోలేదు.. .సీతమ్మవాకిట్లో లాంటి మల్టీస్టారర్ వ్యవహారం వేరు. 

అందుకే ఈ సారి మహేష్ చాలా ఆలోచిస్తున్నాడట. స్క్రిప్ట్ లో కాస్త మార్పులు చేర్పులు, సీన్లు రీరైటింగ్ వంటి సూచనలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీన్ నెరేషన్ ల మరీ లాగ్ వద్దని కూడా సూచించినట్లు తెలుస్తోంది. ఓ రేంజ్ కు చేరిన హీరోకు ఆ మాత్రం జాగ్రత్తలు వుండాలి మరి.