ప్రవాసాంధ్రుల వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏపీఎన్నార్టీలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా పనిచేస్తున్న డీవీరావు ఇటీవలే పదవీ విరమణ పొందారు. ఏపీ రవాణా శాఖలోని నెల్లూరుజిల్లా గూడూరు ప్రాంతీయ రవాణా శాఖాధికారి కార్యాలయంలో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ హోదాలో పనిచేస్తున్న డీవీ రావు… ఏపీఎన్నార్టీకి డిప్యూటేషన్ పై వెళ్లారు. పదవీ విరమణ దాకా ఏపీఎన్నార్టీలోనే ఓఎస్డీగా కొనసాగిన డీవీ రావు… ప్రవాసాంధ్రులు, ఏపీ ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలు కొనసాగించడంలో కీలక భూమిక పోషించారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టే దిశగా ఏపీఎన్నార్టీ చేసిన కృషిలో డీవీ రావు కూడా కీలక భూమిక పోషించారనే చెప్పాలి. ఏపీఎన్నార్టీ చొరవతో చాలామంది ప్రవాసాంధ్రులు… నవ్యాంధ్రలో భారీఎత్తున పెట్టుబడులు పెట్టడంతో పాటుగా స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించారు.
నవ్యాంధ్రలో పరిశ్రమల స్థాపనకు ఉన్న మెరుగైన అవకాశాలను ప్రవాసాంధ్రులకు వివరించడంలో డీవీ రావు కీలక భూమిక పోషించారు. ఈ క్రమంలో గత నెల 30న పదవీ విరమణ చేసిన డీవీ రావు సేవలను కొనియాడుతూ పలువురు ప్రకటనలు విడుదల చేశారు.
విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేయడంతో పాటుగా ప్రవాసాంధ్రులు తమ జన్మభూమి అభివృద్ధిపై దృష్టి సారించేలా చేయడంలో డీవీ రావు కృషి చేశారని ఆయన సేవలను ప్రవాసాంధ్రులు కీర్తించారు. పదవీ విమరణ తర్వాత డీవీ రావు ఆయురారోగ్యాలను సుఖమయ జీవితం కొనసాగించాలని ప్రసాదించాలని ప్రవాసాంధ్రులు అభిలషించారు.