అట్లాంటాలో శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో శ్రీ భద్రాచల సీతారాముల కళ్యాణమహోత్సవం సెప్టెంబర్ 6వ తేదీన అట్లాంటాలోని నార్క్రాస్ హైస్కూల్లో అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి అట్లాంటా నలుమూలలనుండి…

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో శ్రీ భద్రాచల సీతారాముల కళ్యాణమహోత్సవం సెప్టెంబర్ 6వ తేదీన అట్లాంటాలోని నార్క్రాస్ హైస్కూల్లో అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి అట్లాంటా నలుమూలలనుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు భద్రాచలం నుంచి వచ్చిన సీతారామ లక్ష్మణ విగ్రహాలకు అట్లాంటాలోని మహిళలు హిందూ సాంప్రదాయకంగా ఘనంగా స్వాగతం పలికారు. అందంగా అలంకరించిన సీతారాముల విగ్రహాలను పెద్దఎత్తునా ఉరేగింపుగా వేదికపైకి తీసుకవచ్చి ప్రతిష్టించారు.
 
భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు ఆద్వర్యములో పూజారుల బృందం సంప్రదాయ పద్ధతిలో సీతారాముల కళ్యాణం జరిపించారు. కళ్యాణం జరిగిన తరువాత భక్తులకు పానకం, వడపప్పు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

శ్రీమతి షీలా లింగం, డాక్టర్ ఆశా వెల్లంకి, డాక్టర్ గాయత్రి దేవినేని, శ్రీమతి విజయ లంకా, శ్రీమతి సంధ్యా ఎల్లాప్రగడ మరియు శ్రీమతి మాధవి కొర్రపాటి వేదికను అందంగా అలంకరించి పూజ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా కళ్యాణోత్సవం చేయించిన దాతలకు పట్టు చీరలు, దోవతిలు, కండువాలను మరియు బంగారు నాణెములను బహూకరించారు. తిరుపతి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన లడ్డు ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. ఈ కళ్యాణ వేడుకల్లో  ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. చిన్నారులకోసం ఏర్పాటు చేసిన ఫేస్ పెయింటింగ్, పప్పెట్ షోలు ఆకట్టుకున్నాయి.

తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని, కార్యదర్శి సతీష్ వేమన, మాజీ అధ్యక్షుడు గంగాధర్ నాదెళ్ళ మరియు ఈ కార్యక్రమ కోఆర్డినేటర్ అయిన తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు ఈ కళ్యాణోత్సవానికి హాజరయ్యారు.

తానా కోశాధికారి మధుసూదన్ తాతా, సంయుక్త్త కోశాధికారి అంజయ్య చౌదరి లావు మరియు ప్రాంతీయ ప్రతినిధి గౌతం గుర్రం ఆద్వర్యములో జరిగిన ఈ కార్యక్రమానికి పూర్ణ వీరపనేని, అనిల్ ఎలమంచిలి, శ్రీనివాస్ సేగిరెడ్డి, అలువాలరెడ్డి శీలం, సునీల్ శావిలే, వాసు నల్లా, మాలతి నాగభైరవ, సోహిని ఐనాల, వరప్రసాద్ యాదనా మరియు మురళి కాకుమాని సహాయసహకారాలు అందచేశారు.