అట్లాంటా భారత మిత్రులు (ఐ ఎఫ్ ఏ) నిర్వహించిన ఇమ్మిగ్రేషన్ సదస్సు ఆల్ఫారెటా లోని టేస్ట్ ఆఫ్ ఇండియా లో ఘనం గా ముగిసింది. అట్లాంటా లోని ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు లూసీ లూ, రోమీ కపూర్ లు రెండున్నర గంటల వ్యవధి లో విచ్చేసిన రెండు వందల అట్లాంటా ప్రవాస భారతీయుల ఇమ్మిగ్రేషన్ సందేహాలను తీరిక గా విని ఓపిక గా సమాధానాలు చెప్పారు. రోమీ కపూర్ ఈ మధ్య కాలం లో వచ్చిన కొత్త ఇమ్మిగ్రేషన్మార్పులు భారతీయులను ఎలా ప్రభావితం చేస్తాయో విశదించగా, లూసీ లూ ఉద్యోగ సంబంధమైన గ్రీన్ కార్డ్ గురించి తరచు గా ఉండే సందేహాలను నివృత్తి చేసారు. రవి పోణంగి విచ్చేసిన సభ్యులకు న్యాయవాదులతో చర్చాఘోష్టి నిర్వహించారు.
అమెరికా లోని ప్రవాస భారతీయులకు ఇక్కడ ఇమ్మిగ్రేషన్, లీగల్, కెరీర్ గ్రోత్ వంటి అంశాలపై పూర్తి అవగాహన కల్పించి వారికి అన్ని వేళలా అండ గా ఉండడమే తమ ధ్యేయం అని అట్లాంటా భారత మిత్రులు సంఘం వ్యవస్థాపకసభ్యులు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా మాజీ చైర్మన్ సునిల్ సావిలి అన్నారు. సేవా తత్పరత యే ప్రధాన ధ్యేయం గా స్థాపించిన “అట్లాంటా భారత మిత్రులు” ని సభ్యులకు పరిచయం చేస్తూ రాబోయే కాలం లోలీడర్ షిప్ సెమినార్, ఉచిత వైద్యశాల, ప్రథమ చికిత్స శిక్షణా శిబిరం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని సంస్థ వ్యవస్థాపక సభ్యులు సునిల్ సావిలి తెలియ జేసారు. ఈ కార్యక్రమాల నిర్వహణ లో అహర్నిశలు కృషి చేస్తున్నసంస్థ నిర్వాక సభ్యులు శ్యాం మల్లవరపు, అనిల్ బోదిరెద్ది, శ్రీనివాస్ పెద్ది, కిరణ్ గోగినేని, శ్రీకాంత్ ఉప్పల, స్వప్న కస్వ, శ్రావణి రాచకుల్ల, సుబు భాగవతి, గోపీచంద్ ముల్పూరి లను కొనియాడారు.
ఈ కార్యక్రమాన్ని అట్లాంటా భారతీయ సంస్థలు గాటా, గామా, గాట్స్, ఐ.యె.సి.యె లు. అమెరికా జాతీయ భారత సంస్థలు ఆటా, తానా, నాటాలు మెచ్చుకొని భవిష్యత్తు లో ఐ ఎఫ్ ఏ నిర్వహించే కార్యక్రమాలకి పూర్తి మద్దతుప్రకటించాయి. ఈ కార్యక్రమానికి యూనికార్న్ టెక్నాలజీస్ (Sunil Savili), ర్యాపిడ్ ఐ.టీ (Goutham Goli), టేలెంట్9 (Srinivas Tatineni) లు ఆర్ధిక సహాయాన్ని అందజేసాయి. లక్ష్మి నారం రెడ్డి, క్రాంతి మాదినేని, సంజీవ్ఆకుల, భూషన్ కల్లా, సాంబ శివా రెడ్డి, మధు వంగవీటి సహాయం అందజేయగా, శ్రీనివాస్ దుర్గం ఆడియో సౌకర్యాలని, టీవీ5, టీవీ9 కరస్పాండెంట్ శ్రీధర్ వాకిటి ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ సౌకర్యాలని అందజేసారు.